Andhra Pradesh:చెరువుల తవ్వకాలకు బ్రేక్:ఒకప్పుడు ఆహ్లాదకరమైన సువిశాల సాగర తీరం ఉండేది. సునామీ, తుపాన్లు వంటి విపత్తుల నుంచి కాపాడేలా ఇసుక తెన్నెలు పుష్కలంగా కనపడేవి. కానీ ఇప్పుడు కనుచూపు మేరలో చెరువులే కనిపిస్తున్నాయి. తీరం వెంబడి పచ్చని గోడలా సరుగుడు తోటలతో గ్రీన్ బెల్ట్ ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం ఆక్వా కాలుష్యంతో నిండిపోయింది. ఏకంగా సముద్రానికి ఆనుకుని మరీ చెరువులు తవ్వేయడం ఆందోళనకరంగా మారింది. ఈ అక్రమ కార్యకలాపాల వల్లనే సముద్రకోతకు గురి అవుతోంది. సీఆర్‌జడ్ పరిధి నానాటికీ ముందుకు చొచ్చుకు వచ్చే పరిస్థితి ఉత్పన్నమైంది.
చెరువుల తవ్వకాలకు బ్రేక్.
కాకినాడ, మార్చి 22
ఒకప్పుడు ఆహ్లాదకరమైన సువిశాల సాగర తీరం ఉండేది. సునామీ, తుపాన్లు వంటి విపత్తుల నుంచి కాపాడేలా ఇసుక తెన్నెలు పుష్కలంగా కనపడేవి. కానీ ఇప్పుడు కనుచూపు మేరలో చెరువులే కనిపిస్తున్నాయి. తీరం వెంబడి పచ్చని గోడలా సరుగుడు తోటలతో గ్రీన్ బెల్ట్ ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం ఆక్వా కాలుష్యంతో నిండిపోయింది. ఏకంగా సముద్రానికి ఆనుకుని మరీ చెరువులు తవ్వేయడం ఆందోళనకరంగా మారింది. ఈ అక్రమ కార్యకలాపాల వల్లనే సముద్రకోతకు గురి అవుతోంది. సీఆర్‌జడ్ పరిధి నానాటికీ ముందుకు చొచ్చుకు వచ్చే పరిస్థితి ఉత్పన్నమైంది. విచిత్రమేంటంటే సీఆర్‌జడ్ పరిధిలోకి వచ్చే ఈ ఆక్వా చెరువులకు ఎటువంటి అనుమతులు లేవు. అయినా ప్రభుత్వం అందించే సబ్సిడీ విద్యుత్తు సరఫరా పుష్కలంగా లభిస్తోంది. ఆక్వా చెరువుల దందాపై కొందరు జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. దీంతో గ్రీన్ ట్రైబ్యునల్ సభ్యులు అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండల పరిధిలోని అంతర్వేదిలో పర్యటించారు. స్వయంగా అక్కడ జరిగే అక్రమాలను సభ్యులు పరిశీలించారు. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తీరం వెంబడి అక్రమంగా తవ్వేసిన ఆక్వా చెరువులను ధ్వంసం చేసి పూడ్చాలని ఆదేశించారు. లేకుంటే స్థానిక అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. స్పందించిన జిల్లా యంత్రాంగం ఆదిశగా చర్యలకు ఉపక్రమించింది.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో అంతర్వేది నుంచి తుని మండలం అద్దరిపేట వరకు సముద్ర తీరం విస్తరించి ఉంది.
ఇందులో అంబేడ్కర్ కోనసీమ జిల్లావ్యాప్తంగా విస్తరించి ఉన్న సముద్రతీరం వెంబడి విచ్చలవిడిగా చెరువులు తవ్వకాలు చేసి ఆక్వాసాగు చేస్తున్నారు. ప్రధానంగా అంతర్వేది గ్రామ పరిధిలో తీరప్రాంతం మొత్తం ఆక్వాసాగుగా మారిపోయింది. ఈ చర్యల వల్ల భారీగా తీరం కోతకు గురవుతోంది. ఈ అక్రమ ఆక్వా చెరువులపై జిల్లా అధికారులకు ఎన్నోసార్లు ప్రజలు ఫిర్యాదు చేశారు. చెరువులు ధ్వంసం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రయోజం లేకపోవడంతో రాజోలు ప్రాంతానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ యనుమల రాజా గ్రీన్ ట్రైబ్యునల్‌లో పిటిషన్ వేశారు. హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ట్రైబ్యునల్ క్షేత్రస్థాయిలో పరిశీలనకు ఆదేశాలు జారీ చేసింది. జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ బృందం ఈ ప్రాంతాన్ని పరిశీలించింది. అంతర్వేది సముద్ర తీరం మొత్తం ఆక్వాపరం కావడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇప్పుడు తాజాగా జిల్లా కలెక్టరు, ఎస్పీలకు ఆక్వాచెరువులను ధ్వంసం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారులు తక్షణ చర్యలకు ఉపక్రమించారు. అయితే కొందరు దీనిని అడ్డుకోవడంతో అధికారులు భారీ పోలీసు బందోబస్తుతో చెరువుల ధ్వంసం చేస్తున్నారు. అంతర్వేది సముద్రతీర ప్రాంతంలోనే కాకుండా అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల పరిధిలోని తీరం వెంబడి ఉన్న ఆక్వాచెరువులు ధ్వసం చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. కోనసీమవ్యాప్తంగా సఖినేటిపల్లితోపాటు మలికిపురం, మామిడికుదురు, అల్లవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం, ఐ.పోలవరం, తాళ్లరేవు మండలాల పరిధిలో తీరానికి ఆనుకుని ఉన్న అక్రమ ఆక్వాచెరువులు ధ్వంసం చేయాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు..
Read also; పోసాని చుట్టూ కేసుల వలయం
గుంటూరు మార్చి 22
పోసాని కృష్ణమురళికి సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఆయనను ఓ రోజు కస్టడీకి తీసుకుని విచారించారు. బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో విచారణ జరిపిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మార్ఫింగ్ ఫోటోలు చూపించి చంద్రబాబు,లోకేష్, పవన్ లను దూషించిన వ్యవహరంపై ఆయనపై ఓ టీడీపీ నాయకుడు కేసు పెట్టారు. సమాజంలో వర్గాల మధ్య ద్వేషాన్ని పెంచి అల్లర్లు చెలరేగే కుట్ర చేశాడన్న కారణంగా ఆయనను అరెస్టు చేశారు. ఇప్పటికే ఆయనపై ఇతర కేసులు చాలా ఉన్నాయి. వాటిలో ఆయనకు బెయిల్ మంజూరు అయింది. ఇక కర్నూలు జైలు నుంచి విడుదల అవుతారు అనుకున్న సమయంలో సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ పై అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. సీఐడీ కోర్టులో హాజరుర పరిచినప్పుడు 70 ఏళ్ల వయసులో తనను అనేక ప్రాంతాల్లో తిప్పుతున్నారని… అసలు ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పడంలేదని వాపోయారు. అన్యాయంగా వాదనలు వినిపిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు తనకు లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని కోర్టుకు విన్నవించుకున్నారు. తనకు ఆరోగ్యం సరిగా లేదని ఇప్పటికే రెండుసార్లు స్టంట్లు వేశారని గొంతు చికిత్స కూడా జరిగిందని ఆరోగ్యం సహకరించడం లేదని పోసాని న్యాయమూర్తికి చెప్పుకున్నారు. తాను తప్పు చేసినట్టు తేలితే నరికేయాలని కోరారు.
రెండు రోజుల్లో బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటాన్నారు.పోసానిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 30కిపైగా ఫిర్యాదులు వచ్చాయి. అందులో 17 కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి 26న అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో నమోదైన కేసులో ఆయన అరెస్ట్ చేశారు. అప్పట్నుంచి రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లకు తిరుగుతూనే ఉన్నారు. ఇంకా పోసానిపై ఇంకా అనేక చోట్ల కేసులు నమోద అయి ఉన్నందున ఆయనను ఏ జిల్లా నుంచి అయినా పోలీసులు వచ్చి పీటీ వారెంట్‌తో అదుపులోకి తీసుకుంటారా లేకపోతే విడుదలవుతారా అన్న ఉత్కంఠ ఏర్పడింది. ఏ పోలీస్ స్టేషన్ నుంచీ ఎవరూ పీటీ వారంట్ తో రాకపోతే శనివారం ఉదయం పోసాని విడుదలయ్యే అవకాశం ఉంది. పోసాని కృష్ణమురళి వైసీపీలో అత్యంత అసభ్యంగా మాట్లాడే నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో ఆయనపై కోర్టులు కూడా కేసులు పెట్టాలని ఆదేశించాయి. నారా లోకేష్ మంగళగిరి కోర్టులో ప్రైవేటు పిటిషన్ కూడా దాఖలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన అదే భాషను కొనసాగించారు. అయితే పలు చోట్ల కేసులు నమోదు కావడంతో తూచ్ అన్నారు. తనకు ఇక రాజకీయాలతో సంబంధం లేదని ప్రకటించారు . ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. కానీ పోలీసులు మాత్రం ఆయనను వదిలి పెట్టలేదు. ఇంకా ఆయన చుట్టూకేసుల వలయం ఉందని భావిస్తున్నారు.