Andhra Pradesh:గూడురు రైల్వేస్టేషన్ కు మహర్దశ:దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కీలకమైన జంక్షన్లలో ఒకటైన గూడూరు రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరు రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ రూ.49కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులతో స్టేషన్ రూపురేఖల్ని సమూలంగా మారుస్తారు.
గూడురు రైల్వేస్టేషన్ కు మహర్దశ
నెల్లూరు, మార్చి 19
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కీలకమైన జంక్షన్లలో ఒకటైన గూడూరు రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరు రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ రూ.49కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులతో స్టేషన్ రూపురేఖల్ని సమూలంగా మారుస్తారు. ప్రయాణీకులకు మెరుగైైన ప్రయాణ అనుభవాన్ని కల్పించడంతో పాటెు తిరుపతి, నెల్లూరు జిల్లా ప్రాంత ప్రజల రవాణా సౌకర్యాలను మెరుగు పరచడానికి ఉపయోగ పడుతుంది.దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న గూడూరు రైల్వే స్టేషన్ చెన్నైకు సమీపంలో ఉన్న కీలకమైన రైలు జంక్షన్, దక్షిణ కోస్తాలో గూడూరు కీలకమైన రవాణ కూడలిగా ఉంది. ఈ ప్రాంతంలోని కీలక స్టేషన్లను ఆధునీకరించే చర్యల్లో భాగంగా తాజాగా నిధులు కేటాయించారు.రైలు ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించడం, ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి మద్దతు ఇవ్వడం కోసం ఈ నిధులు మంజూరు చేశారు. గూడూరు ప్రాంతం సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా స్టేషన్ అభివృద్ధి పనులు చేపడతారు.
ప్రాజెక్టులో భాగంగా…
1. గ్రౌండ్ + 2 అంతస్తులతో కూడిన కొత్త స్టేషన్ భవనం నిర్మిస్తారు.
2. 1 నుండి 5 వరకు ప్లాట్ఫారమ్లపై పూర్తిగా కవర్ ఓవర్ ప్లాట్ఫారమ్లను నిర్మిస్తారు.
3. తూర్పు నుండి పడమర ప్రవేశ ద్వారం వరకు 12 మీటర్ల వెడల్పు గల రూఫ్ ప్లాజాను స్టేషన్ భవనంతో అనుసంధానిస్తారు.
4. సర్క్యులేటింగ్ ఏరియాకు అభివృద్ధి చేస్తారు.
5. స్టేషన్ భవనాలకు కొత్త రూపురేఖలు కల్పిస్తారు.
విజయవాడ రైల్వే డివిజన్లో 21 రైల్వే స్టేషన్లను రూ.567.41 కోట్లతో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి పనులు చేపట్టినట్టు విజయవాడ డిఆర్ఎం నరేంద్ర పాటిల్ తెలిపారు.

విచ్చలవిడిగా వర్శిటీలకు అనుమతులు
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు మంత్రి నారా లోకేష్. ముఖ్యంగా విశాఖలో ఏఐ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. అదే సమయంలో అమరావతిలో డీప్ టెక్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. గత కొద్దిరోజులుగా యూనివర్సిటీల ఏర్పాటు విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది. అందుకే త్వరగా ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.అమరావతి రాజధానినిర్మాణ పనులు ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. వచ్చే నెలలో ప్రధాని మోదీ పనులు పునః ప్రారంభించనున్నారు. అదే సమయంలో ఇతర సంస్థల నిర్మాణం పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే అమరావతిలో డీప్ టెక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఐఐటి మద్రాస్, టోక్యో యూనివర్సిటీ, ఎల్ అండ్ టి సంస్థల సహకారంతో అమరావతి ప్రాంతంలో యూనివర్సిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది.ఏపీ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆ రంగానికి సంబంధించి విశాఖలో ఏఐ యూనివర్సిటీ నెలకొల్పే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నారా లోకేష్ ఈ విషయంలో పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చారు. ఏపీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ చట్ట సవరణ బిల్లును నారా లోకేష్ మంగళవారం ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం విద్యా రంగ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మొత్తానికి అయితే ఏపీలో యూనివర్సిటీల ఏర్పాటు విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చింది.