Andhra Pradesh:ఏపీలో రెండు కొత్త రైల్వే లైన్లు

Two new railway lines in AP

Andhra Pradesh:ఏపీలో రెండు కొత్త రైల్వే లైన్లు:ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైలు మార్గాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులు కొనసాగుతున్నాయి. అలాగే ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంత ప్రజల ఎన్నో ఏళ్ల కలగా మిగిలిన ఒంగోలు-దొనకొండ, మార్కాపురం -శ్రీశైలం రైలు మార్గాలను ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ రైల్వే లైన్ల అంశాన్ని లోక్‌సభలో ప్రస్తావించారు. ఈ రైల్వే లైన్లను నిర్మించాలని కేంద్రాన్ని కోరడంతో పశ్చిమ ప్రాంత వాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఏపీలో రెండు కొత్త రైల్వే లైన్లు

ఒంగోలు మార్చి 21
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైలు మార్గాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులు కొనసాగుతున్నాయి. అలాగే ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంత ప్రజల ఎన్నో ఏళ్ల కలగా మిగిలిన ఒంగోలు-దొనకొండ, మార్కాపురం -శ్రీశైలం రైలు మార్గాలను ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ రైల్వే లైన్ల అంశాన్ని లోక్‌సభలో ప్రస్తావించారు. ఈ రైల్వే లైన్లను నిర్మించాలని కేంద్రాన్ని కోరడంతో పశ్చిమ ప్రాంత వాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కేంద్రంలో కదలిక వచ్చి రైల్వేమంత్రి స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారుగతంలోనే ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలు – దొనకొండ రైల్వేలైను నిర్మాణం అంచనాలు తయారుచేయాలని ఆదేశాలు వచ్చాయి. మార్కాపురం నుంచి శ్రీశైలంకు రద్దీ పెరగడంతో ఈ రైల్వేలైను ఉపయోగంగా ఉంటుందని భావించారు. ఈ రైల్వే లైన్‌ పూర్తి చేస్తే గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల నుంచి శ్రీశైలం వెళ్లే మల్లన్న భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ అంశాన్ని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గతంలో కూడా లోక్‌సభలో ప్రస్తావించారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి ఈ రెండు కొత్త రైల్వేలైన్లకు అనుమతులు ఇవ్వాలని కోరారు.

తాజాగా మరోసారి ఆయన నడికుడి -శ్రీకాళహస్తి రైల్వేమార్గంలో డెమో రైళ్లను నడపటంతో పాటుగా జనరల్‌ బోగీల సంఖ్యను పెంచాలని కోరారు. పశ్చిమ ప్రాంతంలోని ఈ మూడు రైల్వేలైన్లు కనుక పూర్తి చేస్తే రైతులకు, ప్రజలకు రవాణా సౌకర్యం కూడా మెరుగవుతుందంటున్నారు.ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం మీదుగా నడికుడి -శ్రీకాళహస్తి రైల్వేలైన్‌ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ రైలు మార్గంలో గుంటూరు జిల్లా నడికుడి నుంచి శ్యామలాపురం, దర్శి, పొదిలి వరకు పట్టాల పనులు పూర్తి చేశారు. దర్శి వరకు రైళ్లతో ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ప్రస్తుతం పొదిలి మండలంలోని దాసళ్లపల్లి, పొదిలిలో స్టేషన్ల నిర్మాణం కొనసాగుతోంది. పొదిలికి సమీపంలోని రాజుపాలెం దగ్గర నిర్మిస్తున్న స్టేషన్‌కు ముందు ట్రాక్ పనులు ప్రారంభం కాలేదు. అక్కడ రైతులు కోర్టుకు వెళ్లడంతో 200 మీటర్ల పనులు నిలిపివేసి.. మిగిలిన చోట్ల పనులు చేపట్టారు. ఈ రైలు మార్గంలో పొదిలి రైల్వేస్టేషన్‌ అవతల నుంచి కనిగిరి వరకు వాగులపై వంతెనల నిర్మాణాలు పూర్తి చేయగా.. ట్రాక్‌ పనులు సైతం ముగింపు దశకు వచ్చాయి. పొదిలి, కనిగిరి, పామూరు మీదుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వైపు ట్రాక్ నిర్మాణ పనుల్ని చేపట్టాలని భావిస్తున్నారు. ఈ మేరకు నెల్లూరు జిల్లాలో కూడా ట్రాక్ పనులు త్వరలో ప్రారంభిస్తారని చెబుతున్నారు.

Read more:Andhra Pradesh:పది నెలలైనా ఇంతేనా.. తమ్ముళ్లలో పెరుగుతున్న అసహనం

Related posts

Leave a Comment