Andhra Pradesh:ఆమత్యా.. ఇంకా టైముందే:ఎమ్మెల్సీ నాగబాబు. సైలెంట్‌గా రాజకీయాల్లోకి వచ్చారు. తమ్ముడికి అండగా నిలిచారు. తెర వెనుక కష్టపడ్డారు. జనసైన్యాన్ని నడిపించారు. ఇన్నాళ్లూ పార్టీకే పరిమితం అయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా పొలిటికల్ స్క్రీన్ మీద మెగా రోల్‌కు రెడీ అయ్యారు. ఇటు పార్టీ, అటు ప్రభుత్వం.. జన సైనికులకు డబుల్ ధమాకా.నాగబాబును ఎమ్మెల్సీని చేసిందే మంత్రి పదవి ఇవ్వడానికి అని అంటున్నారు. ఆయనకు ఇచ్చే కేబినెట్ బెర్త్ ఇదే అంటూ రకరకాల ప్రచారమూ జరుగుతోంది. అదిగో ఉగాదికే కేబినెట్ విస్తరణ.. లేదులేదు జూన్లో తొలకరి తర్వాత అంటూ మరో వాదన.
ఆమత్యా.. ఇంకా టైముందే
ఏలూరు, మార్చి 20
ఎమ్మెల్సీ నాగబాబు. సైలెంట్‌గా రాజకీయాల్లోకి వచ్చారు. తమ్ముడికి అండగా నిలిచారు. తెర వెనుక కష్టపడ్డారు. జనసైన్యాన్ని నడిపించారు. ఇన్నాళ్లూ పార్టీకే పరిమితం అయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా పొలిటికల్ స్క్రీన్ మీద మెగా రోల్‌కు రెడీ అయ్యారు. ఇటు పార్టీ, అటు ప్రభుత్వం.. జన సైనికులకు డబుల్ ధమాకా.నాగబాబును ఎమ్మెల్సీని చేసిందే మంత్రి పదవి ఇవ్వడానికి అని అంటున్నారు. ఆయనకు ఇచ్చే కేబినెట్ బెర్త్ ఇదే అంటూ రకరకాల ప్రచారమూ జరుగుతోంది. అదిగో ఉగాదికే కేబినెట్ విస్తరణ.. లేదులేదు జూన్లో తొలకరి తర్వాత అంటూ మరో వాదన. ఇలా రకరకాల డేట్స్ వినిపిస్తున్నాయి. అన్నయ్య తనకు మొదటినుంచి బలమైన అండాదండాగా ఉన్నారని.. ఆయనకు సముచిత న్యాయం చేయడం ధర్మమని పవన్ కల్యాణ్ బహిరంగంగానే చెప్పారు. అందుకే, ఎమ్మెల్సీతో పాటు మంత్రి పోస్ట్ కూడా పక్కా అంటున్నారు.ఇక్కడే కాస్త ట్విస్ట్ ఇస్తూ సోషల్ మీడియాలో మరో రకమైన ప్రచారం కూడా జరుగుతోంది. నాగబాబుకు కాస్త నోరు ఎక్కువ. దురుసుతనమూ ఎక్కువే. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే నైజం. పోస్టులతో ప్రత్యర్థులను గిల్లడంలో ఎక్స్‌పర్ట్. లౌక్యం కంటే ముక్కుసూటితనం మెండు.
ఇలా నవరసభరితంగా ఉండే నాగబాబు.. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎలా ఉండబోతున్నారనేదే ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒకవేళ మంత్రి కూడా అయితే.. అప్పుడుంటుంది అసలు మజానాగబాబుకు ఉన్న ఈ ప్రత్యేక నేచరే ఆయనకు ప్లస్ అండ్ మైనస్. ఇటీవల పిఠాపురంలో జరిగిన జనసేన జయకేతనం సభలో నాగబాబు మాట్లాడిన తీరుపై మిక్స్‌డ్ టాక్ వచ్చింది. పవన్ గెలుపునకు రెండు ఫ్యాక్టర్స్ మాత్రమే కారణమంటూ.. మిగతా లీడర్ల స్థాయి తగ్గించినట్టు మాట్లాడారనే విమర్శ వచ్చింది. మెయిన్‌గా వర్మ టార్గెట్‌గానే నాగబాబు అలా అన్నారని టీడీపీ వర్గాల్లో అసంతృప్తి ఉందట. పిఠాపురంలో జనసేనాని గెలుపులో టీడీపీ, వర్మ పాత్రను తక్కువ చేసి మాట్లాడటం ఏంటని? నాగబాబు అలా మాట్లాడటం తగదనే చర్చ నడిచింది. ఎమ్మెల్సీ కాగానే ఆయన ఇలా అంటే.. ఇక మంత్రి అయితే.. నాగబాబు జోరు ఇంకెలా ఉంటుందోననే ఆలోచనలో టీడీపీ ఉందని తెలుస్తోంది. ఆ పాయింట్ బేస్ చేసుకుని.. నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వరంటూ ఓ వర్గం సోషల్ మీడియాలో నెగటివ్ పబ్లిసిటీ కూడా చేస్తోంది. ఈ ప్రచారం రెండు పార్టీలకూ కాస్త ఇబ్బందిగా మారింది.పవన్ కల్యాణ్ అంత కాకున్నా.. నాగబాబు కూడా ఫైర్ బ్రాండ్. మెగా బ్రదర్ కూడా ఇకముందు ఫుల్ యాక్టివ్ అయితే.. ఇక జనసేన దూకుడుకు పగ్గాలుండకపోవచ్చు. పార్టీలో, పబ్లిక్ లో మరింత జోష్ రావొచ్చు.
Read also:పెద్దిరెడ్డికి వరుస కష్టాలు
తిరుపతి, మార్చి
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ పునాదులు కదులుతున్నాయి. ముసలికి నీళ్లలో బలం ఉన్నట్టు.. పుంగనూరు అడ్డాగా దశాబ్దాలుగా పెద్దిరెడ్డిదే పెత్తనం కొనసాగింది. మైనింగ్ నుంచి లిక్కర్ వరకు.. ఆయనదే హవా. ఆయన చెప్పిందే శాసనం. కను సైగలతో పుంగనూరు నియోజకవర్గాన్ని, ఉమ్మడి చిత్తూరు జిల్లాను ఏలారు పెద్దిరెడ్డి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పతనం కావడంతో.. పెద్దిరెడ్డి పాపాల పుట్ట పగులుతోంది. వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రెడ్ బుక్ పేర్లను బయటకు తీస్తుండటంతో.. పెద్దిరెడ్డితో పాటు ఇన్నాళ్లూ ఆయన అడుగులకు మడుగులు ఒత్తిన కొందరు ఖాకీల కూసాలు సైతం కదులుతున్నాయి. తాజాగా జరిగిన ఓ మర్డర్.. చిత్తూరు పోలీస్ డిపార్ట్‌మెంట్‌నే షేక్ చేసింది. ఇన్నాళ్లూ పొలిటికల్ పెద్దలకు ఊడిగం చేసిన పోలీసుల స్థానాలు మారాయి. పనిలో పనిగా.. చిత్తూరు జిల్లా యంత్రాంగం మొత్తాన్ని ప్రక్షాళన చేస్తోంది పోలీస్ శాఖ.ఒకరు, ఇద్దరూ కాదు. ఏకంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఏకంగా 264 మంది పోలీసులను రాత్రికి రాత్రే బదిలీ చేసింది ప్రభుత్వం. కౌన్సిలింగ్ గట్రా లేకుండా.. ఒక్క ఆర్డర్‌తో అందరినీ ఆర్డర్ లో పెట్టింది. జిల్లాలోని ప్రతీ పీఎస్‌లోనూ ట్రాన్స్‌ఫర్స్ జరిగాయి. పుంగనూరు పోలీస్ స్టేషన్ లో ఏకంగా 20 మందిపై వేటు పడింది. పుంగనూరు నియోజకవర్గం వ్యాప్తంగా 60 మంది ఖాకీలు బదిలీ అయ్యారు. తీవ్ర ఆరోపణలు ఉండి, పెద్దిరెడ్డి మనుషులుగా ముద్ర ఉన్న సిబ్బందిని సుదూర ప్రాంతాలకు పంపించారు. కొందరిని కుప్పం, రాళ్ల బూదుగూరుల PSలకు బదిలీ చేశారు. చిత్తూరు మహిళా స్టేషన్లో పని చేస్తున్న వారికి, రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్న పలువురికి.. పుంగనూరులో పోస్టింగ్ ఇచ్చారు.ఇంతటి సంచలన నిర్ణయానికి కారణం ఇటీవల చిత్తూరులో జరిగిన టీడీపీ కార్యకర్త రామకృష్ణ దారుణ హత్య. ఈ మర్డర్ ను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.
ఇంకా వెయిట్ అండ్ సీ విధానం సరికాదని.. బదిలీ కొరడా ఝలిపించింది. ఏకకాలంలో.. ఏకంగా 264 మంది పోలీసులను బదిలీ చేయడం మాత్రం మామూలు విషయం కానే కాదు. శాంతిభద్రతల మేటర్ లో సర్కారు ఎంత సీరియస్ గా ఉందో చెప్పకనే చెప్పింది.చిత్తూరు జిల్లాలో పోలీసుల పని తీరుపై ప్రభుత్వం కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉంది. శాంతిభద్రతల విషయంలో పోలీసులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టనట్టు ఉంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే.. ఈ సంచలన నిర్ణయం అంటున్నారు. కానిస్టేబుల్ లతో పాటు సీఐ, ఎస్సై స్థాయి అధికారులు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు.గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో పని చేసిన నర్సింహులు అనే ఎస్సై తీరు తీవ్ర వివాదాస్పదమైంది. ఆనాటి పెద్దల అండ చూసుకుని రెచ్చిపోయాడని అంటారు. ఓ ఎన్నారైని అక్రమ అరెస్ట్ చేసి.. అతను విదేశాలకు వెళ్లకుండా అడ్డుకున్నాడని.. అతని నుంచి 3 లక్షలు బలవంతంగా వసూల్ చేశారనే ఆరోపణ ఉంది. ఓ భార్యాభర్తల గొడవలో జోక్యం చేసుకుని.. ఆ భార్యతో పుస్తెలతాడు అమ్మించి మరీ డబ్బులు లాగేసుకున్నాడని అంటారు. ప్రభుత్వం మారాక ఆ అరాచక ఎస్సై నర్సింహులుపై సస్పెన్షన్ వేటు పడింది. లేటెస్ట్ గా.. 264 మంది పోలీసుల బదిలీలతో.. పుంగనూరుతో పాటు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ ను ఆర్డర్ లో పెట్టే పని ప్రారంభించింది. ఈ బదిలీల వేటుతో పరోక్షంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనానికి చెక్ పెట్టినట్టేనని అంటున్నారు. రెడ్ బుక్ ఎఫెక్ట్ ఎట్టా ఉంటాదో ఇప్పటికైనా పెద్దిరెడ్డికి తెలిసొచ్చుంటుందిగా? పోలీసులు సరే.. మరి నెక్ట్స్ టార్గెట్ పెద్దాయనేనా?
Read more:Andhra Pradesh:సజ్జలకు జగన్ వార్నింగ్