Andhra Pradesh:సిద్థార్ధరెడ్డికి యువజన బాధ్యతలు

Siddhartha Reddy gets youth responsibilities

Andhra Pradesh:సిద్థార్ధరెడ్డికి యువజన బాధ్యతలు:వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక నియామకాలు చేపడుతున్నారు. పార్టీకి వరుసగా నేతలు గుడ్ బై చెబుతున్న తరుణంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీలో కొనసాగుతున్న వారికి బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. పార్టీ అనుబంధ విభాగాల బలోపేతమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కీలక బాధ్యతలు కట్టబెట్టారు. కొంతమంది సీనియర్లతో పాటు మహిళా నేతలకు కూడా ప్రాధాన్యమిస్తూ అనుబంధ విభాగాలను ప్రకటించారు.

సిద్థార్ధరెడ్డికి యువజన బాధ్యతలు

కర్నూలు, మార్చి 28
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక నియామకాలు చేపడుతున్నారు. పార్టీకి వరుసగా నేతలు గుడ్ బై చెబుతున్న తరుణంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీలో కొనసాగుతున్న వారికి బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. పార్టీ అనుబంధ విభాగాల బలోపేతమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కీలక బాధ్యతలు కట్టబెట్టారు. కొంతమంది సీనియర్లతో పాటు మహిళా నేతలకు కూడా ప్రాధాన్యమిస్తూ అనుబంధ విభాగాలను ప్రకటించారు. త్వరలో జగన్ జిల్లాల పర్యటన ఉంటుందన్న నేపథ్యంలో ఈ నియామకాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.పార్టీలో క్రమశిక్షణ కమిటీని పునరుద్ధరించారు జగన్మోహన్ రెడ్డి. పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా శెట్టిపల్లి రఘురామిరెడ్డి నియమించారు. సభ్యులుగా రెడ్డి శాంతి, తానేటి వనిత, కైలే అనిల్, విశ్వేశ్వర్ రెడ్డి నియమితులయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి బాధ్యతలు కట్టబెట్టారు జగన్. రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడిగా కాకుమాను రాజశేఖర్ నియమితులయ్యారు. అయితే వీరి నియామకం వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో జిల్లాల పర్యటనకు జగన్మోహన్ రెడ్డి సిద్ధపడుతున్న తరుణంలో.. ఈ నియామకాలు జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీ దారుణంగా ఓడిపోయింది. 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ఎన్నికల ఫలితాల తర్వాత నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు. పార్టీలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి సైతం పదవులతో పాటు పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి వచ్చిన నేతలు సైతం బయటకు వెళ్లిపోయారు. అందుకే అనుబంధ విభాగాలను మరింత బలోపేతం చేయాలని భావించారు జగన్మోహన్ రెడ్డి. పార్టీ నుంచి బయటకు వెళ్లిన నేతల స్థానంలో కొత్తవారిని నియమిస్తున్నారు. అయితే గత 10 ఏళ్లలో కనిపించని అనుబంధ విభాగాలను బలోపేతం చేయాలని భావిస్తుండడం విశేషం.గత కొంతకాలంగా రాజకీయంగా సైలెంట్ గా ఉన్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్ గా పని చేశారు. పార్టీ అధికారంలోకి రావడంతో జగన్మోహన్ రెడ్డి ఆయనకు శాప్ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సైలెంట్ కావడంతో ఆయన పార్టీ మారతారని ప్రచారం జరిగింది. కానీ ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఏకంగా రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించడం విశేషం.

Read also తెరపైకి పీ 5 పాలసీ:

గుంటూరు, మార్చి
ఏపీలోవిప్లవాత్మక పాలన అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2047 నాటికి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చాలని భావిస్తోంది. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా పావులు కదుపుతోంది ఏపీ ప్రభుత్వం. ఉగాది నుంచి పి ఫోర్ పాలసీని ప్రారంభిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అమరావతిలో రెండు రోజులపాటు కలెక్టర్ల సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. పేదరికం లేని ఏపీ కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.కాగా కలెక్టర్ల సదస్సులో ఈసారి పి ఫోర్ అంశమే ప్రాధాన్యంగా నిలిచింది. ‘ పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ ఫార్చునర్ షిప్’.. ఇలా పి ఫోర్ గా తీసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అదే విషయాన్ని కలెక్టర్ల సదస్సులో వివరించి ప్రయత్నం చేశారు. ఇప్పటికే స్వర్ణాంధ్ర 2047 టార్గెట్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. అందులో పది సూత్రాలను పరిగణలోకి తీసుకున్నారు. అందులో 0 పేదరికం ఒకటి. ఆర్థిక అంతరాలు తగ్గించేందుకు అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు చంద్రబాబు.పేదరికం నిర్మూలన అంటే ఆర్థికపరమైన అంశమే కాదు.

పేద కుటుంబాలకు గృహ స్థలాలు, ఇల్లు, మరుగుదొడ్లు, తాగునీటి కనెక్షన్లు, గ్యాస్ కనెక్షన్లు, నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు సౌర విద్యుత్ ఏర్పాటుకు ప్రోత్సాహకాలు, హై స్పీడ్ ఇంటర్నెట్ వంటి సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ప్రతి కుటుంబం అభివృద్ధి చెంది పేదరికం అనేది తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తోంది.అయితే పేదరిక నిర్మూలన విషయంలో దాతల సహకారం తీసుకోవాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. అందులో భాగంగానే సున్నా పేదరికం అమలు చేయాలని చూస్తోంది. ఈ పథకంలో లబ్ధిదారులను బంగారు కుటుంబాలుగా.. సహాయం చేసే ఆర్థికంగా బలమైన వారిని మార్గదర్శిగా పిలవనున్నారు. ఈ పేర్లను ప్రజల సూచనల మేరకు ఖరారు చేశారు. ఆర్థికంగా అండగా నిలిచి మార్గదర్శిలు తమకు తోచిన విధంగా నిధులతో పాటు సమయం ఉన్నవారు ఆర్థిక విషయాల్లో సలహాలు, కెరీర్ గైడెన్స్, ఉద్యోగ అవకాశాలు, విద్యా ఖర్చులకు సహాయం, వ్యాపారాలకు పెట్టుబడి వంటి సహాయం కూడా అందించే అవకాశం కల్పించనుంది ఏపీ ప్రభుత్వం.

Read more:Andhra Pradesh:తిరుమలలో సేంద్రియ ఉత్పత్తుల బండారం

Related posts

Leave a Comment