Andhra Pradesh:సౌత్ సోమ్ముతో నార్త్ ఎంజాయ్ చేస్తారా

AP Congress chief YS Sharmila said that the southern states' issue over the delimitation process is not about politics, but about fighting for the rights of the people.

Andhra Pradesh:సౌత్ సోమ్ముతో నార్త్ ఎంజాయ్ చేస్తారా:డీలిమిటేషన్ ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాలది రాజకీయం కాదని, ప్రజల హక్కుల కోసం చేసే పోరాటం అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల సీట్లను విభజిస్తే కనుక దక్షిణాదికి జరిగేది తీరని నష్టమే. ఉత్తరాది రాష్ట్రాల ప్రాబల్యం మరింతగా పెరిగి.. దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యతతో ఏ పనిలేకుండా పోతుందన్నారు. చెన్నైలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో ఎన్డీయేతర విపక్షాల సమావేశం జరుగుతోంది.

సౌత్ సోమ్ముతో నార్త్ ఎంజాయ్ చేస్తారా

విజయవాడ, మార్చి 22
డీలిమిటేషన్ ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాలది రాజకీయం కాదని, ప్రజల హక్కుల కోసం చేసే పోరాటం అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల సీట్లను విభజిస్తే కనుక దక్షిణాదికి జరిగేది తీరని నష్టమే. ఉత్తరాది రాష్ట్రాల ప్రాబల్యం మరింతగా పెరిగి.. దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యతతో ఏ పనిలేకుండా పోతుందన్నారు. చెన్నైలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో ఎన్డీయేతర విపక్షాల సమావేశం జరుగుతోంది. ఈ కీలక సదస్సుకు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు పంజాబ్, ఒడిశా రాష్ట్రాల విపక్ష నేతలు హాజరై దక్షిణాదికి జరగబోయే అన్యాయంపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలో డిలిమిటేషన్‌పై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అప్పుడు సొమ్ము సౌత్ ది..సోకు నార్త్ ది అనే పరిస్థితి ఎదురుకాక తప్పదు. కనుక డీలిమిటేషన్ పేరుతో లిమిటేషన్ ఫర్ సౌత్‌లా చేస్తామంటే ఊరుకునేది లేదు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనను అంగీకరించం. కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత విధానంతో ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 143 సీట్లకు పెరిగితే… దక్షిణాదిలోని తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ లాంటి ప్రధాన రాష్ట్రాల్లో పెరిగే సీట్లు 49+41+54 = 144 అవుతాయి.

ఇది కాదా వివక్ష చూపడం అంటే ? యూపీ, బీహార్ రెండు రాష్ట్రాలు కలిపితే ఏకంగా 222 సీట్లు పెరిగితే.. దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం తిప్పి కొట్టినా 192 సీట్లకే పరిమితం అవుతాం. దక్షిణ భారతదేశానికి జరిగే అన్యాయం ఇదేనని’ షర్మిల పేర్కొన్నారు.డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల పోరాటానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఐక్యంగా పోరాటం చేస్తే తప్పా నియంత ప్రధాని నరేంద్ర మోడీకి బుద్ధి రాదని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మోదీ ఎన్డీయే పక్షం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మౌనం వహించడం రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్లే అన్నారు. ఇది ప్రజల హక్కులను ప్రభుత్వం కాలరాసినట్లేనని.. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సైతం నోరు విప్పకపోవడం మోదీకి పరోక్ష మద్దతు తెలిపినట్లే అన్నారు. డీలిమిటేషన్ పై రాజకీయాలు పక్కన పెట్టీ టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీ లు ముందుకు రావాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల పిలుపునిచ్చారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పోరాడే సమయం ఆసన్నమైందన్నారు.

Read also:ఇన్స్పైరింగ్ బిజినెస్ మెన్ అవార్డు అందుకున్న డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి.

ఈటి ఇండస్ట్రీ అచీవర్స్ అవార్డులను ప్రకటించిన ద టైమ్స్ ఆఫ్ ఇండియా
తిరుపతి :డాలర్స్ గ్రూప్ అధినేత డాక్టర్ సి దివాకర్ రెడ్డిని మరో అత్యున్నత పురస్కారం వరించింది. ద టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ టి ఇండస్ట్రీ ఎచీవర్స్ పేరుతో ప్రతి ఏడాది రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తున్న వ్యాపారవేత్తలను పలు అవార్డులతో సత్కరిస్తుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ వేదికగా శుక్రవారం జరిగిన అవార్డుల మహోత్సవంలో రియల్ ఎస్టేట్ మగధీరుడు, ప్రజల పక్షపాతి డాలర్స్ గ్రూప్ అధినేత డాక్టర్ సి దివాకర్ రెడ్డికి ఆ సంస్థ ఇన్స్పైరింగ్ బిజినెస్ మాన్ ఇన్ రియల్ ఎస్టేట్ ఇన్ ఓవరాల్ ఆంధ్ర ప్రదేశ్ అవార్డుతో ఘనంగా సత్కరించింది. ఆనతికాలములో అంచలంచలుగా ఎదుగుతూ కాకలు తీరిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలను సైతం మెప్పించే విధంగా పలు రాష్ట్రాలలో డాలర్స్ గ్రూప్ సామ్రాజ్యాన్ని విస్తరించారు. పేద మధ్యతరగతి సామాన్య ప్రజల సొంతింటి కలలను నెరవేరుస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

0 నుంచి 1000 కోట్ల వరకు వ్యాపార రంగంలో రాణించారంటే ఆయన పట్టుదల, శ్రమ, కఠోర దీక్ష ఈ స్థాయికి ఆయనను చేర్చింది. వ్యాపార రంగాన్ని విస్తరిస్తూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏనాడు విస్మరించలేదు. ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాలకు పలు రకాల సేవా కార్యక్రమాలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. ఇలాంటి యుగపురుషునికి టైమ్స్ ఆఫ్ ఇండియా సముచిత స్థానం కల్పించి అవార్డును ప్రధానం చేయడం హర్షణీయమని అభిమానులు, డాలర్స్ గ్రూప్ కస్టమర్ దేవుళ్ళు, సహచర వ్యాపారవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. అవార్డు స్వీకరించిన అనంతరం డాలర్స్ గ్రూప్ అధినేత డాక్టర్ సి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ అవార్డు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, డాలర్స్ గ్రూప్ కస్టమర్ దేవుళ్లకు అంకితమని నిగర్వంగా చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా డాలర్స్ గ్రూప్ సంస్థను విస్తరించి మరింత మంది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలని అభిప్రాయపడ్డారు

Read more:Hyderabad:దక్షినాది రాష్ట్రాలపై వివక్ష పెరిగింది..డిలిమిటేషన్ తో అనేక నష్టాలు

Related posts

Leave a Comment