Andhra Pradesh:శ్యామల ఔట్..?

Case registered against YSRCP spokesperson Anchor Shyamala in betting app promotion case

Andhra Pradesh:శ్యామల ఔట్..?:బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలపై కేసు నమోదైంది. సినీ సెలబ్రటీలతో పాటు శ్యామల పేరు కూడా నిందితుల జాబితాలో చేరింది.. కాసులకు కక్కూర్తిపడి బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసిన శ్యామల ఇప్పుడు అరెస్ట్ భయంతో కోర్టులని ఆశ్రయిస్తున్నారు.. శ్యామల బుక్ అవ్వడంతో ఆమెను అధికార ప్రతినిధిగా నియమించుకున్న వైసీపీ ఇరుకున పడింది.. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించిన కేసులో వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలపై కేసు నమోదవ్వడంతో రాజకీయ దుమారం రేగుతోంది.

శ్యామల ఔట్…?

విజయవాడ, మార్చి 24
బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలపై కేసు నమోదైంది. సినీ సెలబ్రటీలతో పాటు శ్యామల పేరు కూడా నిందితుల జాబితాలో చేరింది.. కాసులకు కక్కూర్తిపడి బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసిన శ్యామల ఇప్పుడు అరెస్ట్ భయంతో కోర్టులని ఆశ్రయిస్తున్నారు.. శ్యామల బుక్ అవ్వడంతో ఆమెను అధికార ప్రతినిధిగా నియమించుకున్న వైసీపీ ఇరుకున పడింది.. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించిన కేసులో వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలపై కేసు నమోదవ్వడంతో రాజకీయ దుమారం రేగుతోంది. అధికార కూటమి పార్టీలు అటు శ్యామలను, ఇటు వైసీపీని ఒక రేంజ్లో టార్గెట్ చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అధికార ప్రతినిధిగా శ్యామలను నియమించారు. అధికార ప్రతినిధిగా ప్రభుత్వ విధానాలపై ప్రెస్‌ మీట్‌లు పెడుతున్న శ్యామల విలువలు, ప్రజాసమస్యల గురించి గొప్పగొప్ప స్పీచ్‌లు ఇస్తుంటారు. ఇప్పుడామే జనాన్ని అడ్డంగా దోచుకునే దందాకు ప్రమోటర్‌గా కేసులో ఇరుక్కోవడం తీవ్ర విమర్శల పాలవుతోంది.. అటు కూటమి పార్టీలతో పాటు ఆమె వ్యవహారం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది.ఏపీ రాజకీయాల్లో శ్యామల ఎపిసోడ్ హాట్‌ టాపిక్‌గా మారింది.. తెలంగాణ పోలీసులు శ్యామలతో పాటు పలువురు బుల్లితెర నటులు, యూట్యూబర్లపై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

దీంతో శ్యామల అంశం రాజకీయంగా వైసీపీని ఇరుకున పడేసింది. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ అమాయకుల జీవితాలతో ఆడుకుంటూ.. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నాయి.వైసీపీ అధికార ప్రతినిధిగా శుద్దపూస కబుర్లు చెప్పిన శ్యామల చేస్తుంది ఏంటని టీడీపీ,జనసేన, బీజేపీ అభిమానులు ఆమెతో పాటు వైసీపీని కూడా ఒక రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు.. శ్యామల ఇష్యూ చర్చల్లో నలుగుతూ తీవ్ర దుమారం రేపుతుండటంతో .. దానిపై వైసీపీ సమాధానం చేప్పుకోవాల్సిన పరిస్ధితి తలెత్తింది. అయితే వైసీపీ నాయకులు ఎవరూ దానిపై నోరు మెదపడం లేదు.బెట్టింగ్ క్వీన్ అంటూ మీమ్స్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైసీపీ అంటే విలాసవంతమైన బెట్టింగ్ పార్టీ అని కొందరు ట్వీట్లు చేస్తూ ఫ్యాన్‌ పార్టీ ఇమేజ్‌ను మరింత డ్యామేజ్ చేస్తున్నారు. టీడీపీతో పాటు జనసైనికులు శ్యామలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ను ఓడిస్తామని ఎగిరెగిరిపడ్డ శ్యామల ఇప్పుడు బెట్టింగ్‌ కేసులో బుక్కై ఓడిపోయిందని జనసేన శ్రేణులు ట్రోల్స్‌ చేస్తున్నారు.బీజేపీ సోషల్ మీడియా వర్గాలు కూడా ఆ మాజీ యాంకర్‌ని ఆడుకునే పనిలో పడ్డాయి. బెట్టింగ్ యాప్‌లతో పేదల డబ్బు దోచుకుని కోట్లు కూడబెట్టడం వైసీపీ నేతలకు అలవాటేనని బీజేపీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారట.

శ్యామల వ్యవహారంపై అధికార పక్షం నుంచి విమర్శలు దాడి పెరగడంతో వైసీపీ పూర్తిగా డిఫెన్స్‌‌లో పడ్డట్లైంది. అధికార ప్రతినిధిగా ఉన్న శ్యామల బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌ కేసుల్లో ఇరుక్కోవడంతో వైసీపీలో కూడా పెద్ద చర్చే జరుగుతోందంట.శ్యామల ప్రభావం పార్టీ ఇమేజ్‌ను మరింత దెబ్బతీసే అవకాశం ఉందని వైసీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన శ్యామలను అధికార ప్రతినిధిగా నియమించడాన్ని కొందరు నేతలు తప్పుపుడుతున్నారంట. ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా, పార్టీకి ఎలాంటి సేవ చేయకుండా.. బుల్లితెర మీద నుంచి డైరెక్ట్‌గా పార్టీలోకి వచ్చిన శ్యామలకు అంత ప్రయారిటీ ఇచ్చి.. సెల్ఫ్‌గోల్ చేసుకున్నామని వైసీపీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయంట.పార్టీ అధ్యక్షుడు జగన్‌కి తెలిసే శ్యామలను అధికార ప్రతినిధిగా ప్రకటించారా.. లేదా కోటరీ హస్తం ఉందా అనే సందేహాలను కొందరు నాయకులు వ్యక్తం చేస్తున్నారట. శ్యామలను అధికార ప్రతినిధిగా నియమించడం వెనక పార్టీలోని కోటరీ హస్తం ఉందనే అంశాన్ని తెరపైకి తీసుకువస్తున్నారట.

కూటమి పార్టీలన్నీ శ్యామల విషయంలో వైసీపీని టార్గెట్ చేస్తుండటంతో ఆ పార్టీలోనే శ్యామలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.బెట్టింగ్ కేసులో పార్టీ అధికార ప్రతినిధి ఇరుక్కోవడం పొలిటికల్‌గా పెద్ద డ్యామేజే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఎలా స్పందించాలో తెలియక పార్టీ అధినాయకత్వం తర్జనభర్జనలు పడుతందంట. శ్యామల ఎపిసోడ్‌పై అధినేత జగన్మోహన్ రెడ్డి ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే, పార్టీలో జరుగుతున్న అంతర్గత చర్చల్లో శ్యామల అంశంపై ఎలా స్పందించాలనే చర్చ నడుస్తోందట. ఈ కేసుకు పార్టీకి ఏం సంబంధమనే చర్చను కొందరు నాయకులు తీసుకువస్తున్నారట. బెట్టింగ్ యాప్‌ ప్రయోషన్‌ అంతా శ్యామల వ్యక్తిగత అంశంగా చూడాలని అంటున్నారట.తాము సమాజ హితాన్ని కాంక్షిస్తూ, నైతిక విలువలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా కనిపించడానికి వైసీపీ శ్యామలపై వేటు వేసే అవకాశం ఉన్నదని పలువురు అంచనా వేస్తున్నారు. బెట్టింగ్ యాప్‌ల ప్రమోటర్స్ వ్యవహారం బయటపడగానే.. వైసీపీ మీడియా ఒక స్పెషల్ ప్రోగ్రాం చేసింది. సమాజం పట్ల మీకు బాధ్యత లేదా అని వారిని నిలదీస్తూ.. నిందిస్తూ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు.

ఈ కేసుల్లో ఇరుక్కున్న అనేకమంది ఫోటోలతో ప్రోమోను కూడా రిలీజ్ చేసింది. అయితే అందులో వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల, ప్రకాష్ రాజ్ ల ఫొటోలు మాత్రం కనిపించలేదు.స్టార్స్ కాదు సెలబ్రెటీల ముసుగులో ఉన్న చీడ పురుగులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కాదు.. యాంటీ సోషల్ ఎలిమెంట్స్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న చీటర్స్, తమను ఆరాధించే అభిమానుల కుటుంబాలను రోడ్డున పడేస్తోన్న దుర్మార్గులు.. అంటూ సమాజ హితాన్ని కాంక్షిస్తూ బోల్డు వ్యాఖ్యలు చేసింది. మరి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై ఆ స్ధాయిలో ధ్వజమెత్తిన వైసీపీ మీడియా ఇదే కేసుల్లో నిందితురాలిగా ఉన్న తమ పార్టీ నాయకురాలు శ్యామలపై ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Read more:Andhra Pradesh:రుషికొండ బీచ్‌కు ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపు

Related posts

Leave a Comment