Andhra Pradesh:విశాఖ మేయర్ పై అవిశ్వాసం.. ?:గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం కైవసం చేసుకోవడానికి కూటమి నేతలు స్కెచ్ వేశారు. కలెక్టర్ ను కలిసి మేయర్ హరి కుమారిపై అవిశ్వాస నోటీసు ఇచ్చిన కూటమి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. వైసీపీ తరపున మేయర్ గా ఉన్న గొలగాని వెంకట హరికుమారిపై అవిశ్వాసం పెట్టేందుకు కూటమి కార్పొరేటర్లు కొంత కాలంగా సన్నాహాలు చేసుకుంటున్నారు. వైసీపీకి చెందిన కనీసం ముఫ్పై మంది కార్పొరేటర్లు ఇప్పటికే పార్టీ ఫిరాయించారు.
విశాఖ మేయర్ పై అవిశ్వాసం.. ?
విశాఖపట్టణం, మార్చి 24
గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం కైవసం చేసుకోవడానికి కూటమి నేతలు స్కెచ్ వేశారు. కలెక్టర్ ను కలిసి మేయర్ హరి కుమారిపై అవిశ్వాస నోటీసు ఇచ్చిన కూటమి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. వైసీపీ తరపున మేయర్ గా ఉన్న గొలగాని వెంకట హరికుమారిపై అవిశ్వాసం పెట్టేందుకు కూటమి కార్పొరేటర్లు కొంత కాలంగా సన్నాహాలు చేసుకుంటున్నారు. వైసీపీకి చెందిన కనీసం ముఫ్పై మంది కార్పొరేటర్లు ఇప్పటికే పార్టీ ఫిరాయించారు. మొత్తం 99 మంది కార్పొరేటర్లు ఉన్న కార్పొరేషన్ లో ఇప్పుడు వైసీపీకి పాతిక మంది కార్పొరేటర్లు కూడా లేరు. అయినా మేయర్ పీఠాన్ని నిలబెట్టుకుంటామని కొత్త ఇంచార్జ్ కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధీమాగా ఉన్నారు. మున్సిపల్ చట్టం ప్రకారం మొదటి సారి ఎన్నికైన తర్వాత నాలుగేళ్ల వరకూ అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేదు. ఇప్పుడు మేయర్ పదవి కాలం నాలుగేళ్లు పూర్తయింది ఇప్పటికే పార్టీలో చేరిన వారు.. కూటమి కార్పొరేటర్లు కలిసి మేయర్ ను దింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుత మేయర్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. మేయర్ అభ్యర్థిగా కూటమి తరపున ఎవరిని ఖరారు చేయాలన్నదానిపై చర్చలు జరుపుతున్నారు. విశాఖ మేయర్ పీఠం వైసీపీ నుంచి జారిపోవడం ఖాయంగా ఉంది.
అయితే అమర్నాథ్, కన్నబాబులకు పార్టీ హైకమాండ్ మాత్రం వార్నింగ్ ఇచ్చింది. కార్పొరేటర్లను జారిపోకుండా చూసుకుని కూటమికి షాక్ ఇవ్వాలని ఆదేశించింది. దాంతో వారిద్దరూ తమ శక్తికి మించి ప్రయత్నిస్తున్నారు. కానీ వారి మాటల్ని కార్పొరేటర్లు వినే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తు బలం ప్రకారం శాఖపట్నం, అనకాపల్లి కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కలుపుకుని 109 ఓట్లకుగాను, కూటమి బలం 73కు చేరింది. సీపీఐకి చెందిన స్టాలిన్, ముత్తంశెట్టి కూతురు కూటమికే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.విశాఖలో వైసీపీకి ముఖ్య నేతలు ఉన్నారు. మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ ఇంచార్జ్ గా లేకపోయినా ఉత్తరాంధ్ర సీనియర్ నేతగా… విశాఖ ఎంపీ స్థానానికి ఆయన భార్యతో పోటీ చేయించిన వ్యక్తిగా ఆయన బాధ్యత తీసుకుని మేయర్ పీఠం చేజారకుండా చేయాల్సి ఉంది. అలాగే విజయసాయిరెడ్డి రాజీనామాతో కొత్తగా ఇంచార్జ్ గా నియమితులైన మాజీ మంత్రి కన్నబాబు కూడా ప్రయత్నిస్తున్నారు. గుడివాడ అమర్నాథ్ .. పార్టీ మారిన కార్పొరేటర్లతోనూ చర్చలు జరుపుతున్నారు. వీరి ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాల్సి ఉంది. వచ్చే వారం కౌన్సిల్ సమావేశం నిర్వహించి అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ పెట్టే అవకాశాలు ఉన్నాయి.
Read also:స్వామి వారితో పెట్టుకుంటే అంతే
అనంతపురం, మార్చి 24
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో ఉన్న పెన్నహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సిబ్బంగదిచేతివాటం ప్రదర్శించారు. భక్తులు హుండీలో వేసిన నగల మూటను తస్కరించే ప్రయత్నం చేశారు. అయితే వారి ప్లాన్ బెడిసి కొట్టి.. నగలమూటను తిరిగి హుండీలో వేయాల్సి వచ్చింది. ఈ ఘటన కలకలం రేపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వేలూరు రంగయ్య అనే వ్యక్తి భార్యతో కలిసి పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామిని గతేడాది దర్శించుకున్నారు. డిసెంబర్ ఏడో తేదీన లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న వేలూరు రంగయ్య దంపతులు.. మొక్కులు చెల్లించుకున్నారు. రూ.8లక్షల విలువైన నగలను మూట కట్టి ఆలయ హుండీలో వేశారు.అయితే పెన్నహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అధికారులు ఇటీవల హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. మార్చి 18వ తేదీన ఈవో రమేష్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. ఈ సమయంలో కొంతమంది సిబ్బంది.. హుండీలోని ఈ నగలమూటను గుర్తించారు. నగలను కాజేయాలనే దుర్బుద్ధితో మూటను దాచి పెట్టారు. మొత్తం హుండీ లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యాక.. ఈ నగల మూటను పంచుకోవాలని ఆలయ సిబ్బంది పక్కాగా ప్లాన్ వేసుకున్నారు.
అయితే కథ అడ్డం తిరిగింది.పంపకాల్లో తేడా రావటంతో సీన్ రివర్సైంది.ఈలోపే నగల మూట మాయమైందనే విషయం బయటకు వచ్చింది. వేలూరు రంగయ్య దంపతులు ఆలయ పూజారి ఎదుటే హుండీలో నగల మూట వేశారు. అయితే లెక్కించేటప్పుడు నగలమూట కనిపించకపోవటంతో నగలు మాయమయ్యాయనే విషయం బయటకు వచ్చింది. దీనికి తోడు పంపకాల సమయంలో తేడా రావటంతో.. ఏం చేయాలో పాలుపోక సిబ్బంది బుధవారం రాత్రి నగల మూటను తీసుకువచ్చి తిరిగి హుండీలో వేశారు. గురువారం ఆలయ అధికారులు ఈ విషయాన్ని గుర్తించారు. ఆలయ హుండీలో వేసిన నగల మూటను చోరీ చేసేందుకు యత్నించడంపై భక్తులు మండిపడుతున్నారు.ఈ ఘటనపై ఏపీ దేవాదాయశాఖ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.పెన్నహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పెన్నా నది ఒడ్డున కొలువై ఉంది. ఈ ఆలయానికి ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ఐదు అడుగుల మూడు అంగుళాల లక్ష్మీ నరసింహస్వామి పాదముద్రపై ఈ ఆలయాన్ని నిర్మించారు. ఏటా ఏప్రిల్ నెలలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఈ ఆలయం వివాహ వేడుకలకు ప్రసిద్ధి చెందింది.
Read more:Andhra Pradesh:ఇక నో బ్యాగ్ డే