Andhra Pradesh:రుషికొండ బీచ్‌కు ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపు:రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపును పునరుద్ధరించారు. ఇటీవల విధించిన తాత్కాలిక ఉపసంహరణ ఆదేశాలను ఎత్తివేస్తున్నట్లు.. బ్లూ ఫ్లాగ్ ఇండియా అధికారులు ప్రకటించారు. విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌కు బ్లూ ఫ్లాగ్‌ను జ్యూరీ సభ్యులు అందించారు. దీనిపై విశాఖ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌కు ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపును ఇటీవల ఉపసంహరించారు.
రుషికొండ బీచ్‌కు ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపు
విశాఖపట్టణం, మార్చి 24
రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపును పునరుద్ధరించారు. ఇటీవల విధించిన తాత్కాలిక ఉపసంహరణ ఆదేశాలను ఎత్తివేస్తున్నట్లు.. బ్లూ ఫ్లాగ్ ఇండియా అధికారులు ప్రకటించారు. విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌కు బ్లూ ఫ్లాగ్‌ను జ్యూరీ సభ్యులు అందించారు. దీనిపై విశాఖ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌కు ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపును ఇటీవల ఉపసంహరించారు. బీచ్ పరిసరాల్లో వ్యర్థాలు పేరుకుపోవడం, బట్టలు మార్చుకునే గదుల దగ్గర శుభ్రత లోపించడం, నడక దారి ధ్వంసం అవ్వడం, రుషికొండ బీచ్‌లోకి శునకాలు రావడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, పార్కింగ్ సదుపాయాన్ని దుర్వినియోగం చేయడం, మౌలిక వసతులు కొరవడడం వంటి కారణాలతో ఉపసంహరించారు..బ్లూ ఫ్లాగ్ అనేది బీచ్‌లకు ఇచ్చే ఒక అంతర్జాతీయ పర్యావరణ గుర్తింపు. ఈ గుర్తింపు పొందిన బీచ్‌లు పర్యాటకులను ఆకర్షిస్తాయి. రుషికొండ బీచ్‌కు 2020లో బ్లూ ఫ్లాగ్ గుర్తింపు లభించింది.బ్లూ ఫ్లాగ్ గుర్తింపును పునరుద్ధరించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లా యంత్రాంగం బ్లూ ఫ్లాగ్ కమిటీకి లేఖ రాసి పరిశీలనకు రావాలని, గుర్తింపును పునరుద్ధరించాలని కోరింది. బ్లూ ఫ్లాగ్ బృందం రుషికొండ బీచ్‌ని పరిశీలించింది.
రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపును పునరుద్ధరిస్తున్నట్టు.. బ్లూఫ్లాగ్ ఇండియా నేషనల్ ఆపరేటర్ డాక్టర్ శ్రీజిత్ కురూప్ వెల్లడించారు.రుషికొండ బీచ్ విశాఖపట్నం నగరంలోని ఒక అందమైన బీచ్. దీనిని “తూర్పు తీరపు రత్నం” అని కూడా పిలుస్తారు. ఈ బీచ్‌కు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ బీచ్ బంగారు ఇసుక, స్పష్టమైన నీలిరంగు నీటితో చాలా అందంగా ఉంటుంది. చుట్టూ కొండలు, పచ్చని ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి.రుషికొండ బీచ్‌లో స్కూబా డైవింగ్, సర్ఫింగ్, వాటర్ స్కీయింగ్, కయాకింగ్ వంటి అనేక నీటి క్రీడలు అందుబాటులో ఉన్నాయి. ఇతర బీచ్‌లతో పోలిస్తే, రుషికొండ బీచ్ ప్రశాంతంగా ఉంటుంది. ఇది విశ్రాంతి తీసుకోవడానికి, ప్రకృతిని ఆస్వాదించడానికి అనువైన ప్రదేశంరుషికొండ బీచ్ ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. రుషికొండ బీచ్‌కు 2020 సంవత్సరంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ లభించింది. ఆ తర్వాత పర్యాటకుల తాకిడి మరింత పెరిగింది. దీని అభివృద్ధికి గత, ప్రస్తుత ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకున్నాయి..బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన బీచ్‌లు పర్యావరణపరంగా స్థిరమైనవిగా పరిగణించబడతాయి. తద్వారా పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాయి. బ్లూ ఫ్లాగ్ అనేది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అవార్డు. ఇది బీచ్‌ల ప్రతిష్టను పెంచుతుంది.
Read alsp:27న పోలవరానికి చంద్రబాబు..
ఏలూరు, మార్చి 24
ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే పోలవరం పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి పోలవరం వద్ద పర్యటించనున్నారు. ఈ నెల 27న అంటే గురువారం నాడు పోలవరం వెళ్లి అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులతో అక్కడే సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత రెండోసారి అధికారులకు వచ్చిన కూటమి ప్రభుత్వం పోలవరంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది . ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ టర్మ్ పూర్తయ్యే లోపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఒక తీరానికి చేర్చాలని చంద్రబాబు ప్రభుత్వం పట్టుదలగా పని చేస్తుందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పదే పదే చెబుతున్నారు.రెండోసారి అధికారం లోకి వచ్చిన తర్వాత ఇప్పటికే పలుమార్లు పోలవరం వద్ద పర్యటించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని దగ్గర నుంచి మరోసారి పరిశీలించనున్నట్టు ఏపీ సీఎంవో చెబుతోంది. గురువారం నాడు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 వరకు పోలవరంలో చంద్రబాబు టూరు జరగనుంది.
మరోవైపు ఇటీవల పార్లమెంట్లో పోలవరం నిర్మాణాన్ని వచ్చే ఏడాది కల్లా పూర్తి చేస్తామని కేంద్ర జల శక్తి మంత్రి CR పాటిల్ స్పష్టం చేశారు. గతంలో చాలా ప్రభుత్వాలు మారినా పోలవరం కి ఏమీ చేయలేదని కానీ NDA అధికారులకు వచ్చిన తర్వాత ప్రధాని మోదీ ఇంతవరకు పోలవరం కోసం 15 వేల కోట్లు కేటాయించారని ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ కేంద్ర జలశక్తి మంత్రి స్పష్టం చేసారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా 12 వేల కోట్లు కేటాయించారని నెక్స్ట్ ఇయర్ కల్లా పోలవరం నిర్మాణాన్ని ఓ దరికి చేరుస్తామని లోక్ సభ లో ప్రస్తావించారు.పోలవరం పూర్తయితే సుమారు మూడు లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని 28 లక్షల మందికి పైగా ప్రత్యక్ష లబ్ధి చేకూరుతుందని అదనంగా మరో 540 గ్రామాలకు శాశ్వతంగా త్రాగునీరు లభిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఇక పోలవరం ఏపీకి జీవనాడి లాంటిదని ఎప్పటినుంచో చెప్పుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీఏ పై పట్టు చిక్కిన నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ నిధులను సాధించి పోలవరం నిర్మాణం పూర్తి చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు గురువారం చేపట్టిన పోలవరం టూర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది