Andhra Pradesh:మైనింగ్ అక్రమాలపై 76 పేజీల నివేదిక

76-page report on mining irregularities

Andhra Pradesh:మైనింగ్ అక్రమాలపై 76 పేజీల నివేదిక:వైసీపీ హయంలో ఆంధ్రప్రదేవ్‌ డిజిటల్ కార్పొరేషన్‌లో భారీగా అక్రమాలు జరిగినట్టు విజిలెన్స్‌ శాఖ విచారణలో గుర్తించారు. దర్యాప్తు నివేదిక ప్రభుత్వానికి చేరింది. అక్రమాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు చట్టపరమైన చర్యలకు ఉపక్రమించాలని విజిలెన్స్‌ సిఫార్సు చేసింది.వైసీపీ ప్రభుత్వ హయంలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్‌‌లో జరిగిన అక్రమాలపై విజిలెన్స్‌ నివేదిక ప్రభుత్వానికి చేరింది.

మైనింగ్ అక్రమాలపై 76 పేజీల నివేదిక

కర్నూలు, మార్చి 27
వైసీపీ హయంలో ఆంధ్రప్రదేవ్‌ డిజిటల్ కార్పొరేషన్‌లో భారీగా అక్రమాలు జరిగినట్టు విజిలెన్స్‌ శాఖ విచారణలో గుర్తించారు. దర్యాప్తు నివేదిక ప్రభుత్వానికి చేరింది. అక్రమాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు చట్టపరమైన చర్యలకు ఉపక్రమించాలని విజిలెన్స్‌ సిఫార్సు చేసింది.వైసీపీ ప్రభుత్వ హయంలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్‌‌లో జరిగిన అక్రమాలపై విజిలెన్స్‌ నివేదిక ప్రభుత్వానికి చేరింది. నాటి వీసీ ఎండీ వాసుదేవరెడ్డితో పాటు అక్రమాలకు బాధ్యులైన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వానికి నష్టం కలిగించిన వారిపై న్యాయపరమైన చర్యలతో పాటు క్రమశిక్షణ చర్యలకు కమిషన్ సిఫార్సు చేసింది.ఏపీ డిజిటల్ కార్పోరేషన్‌లో లేని ఉద్యోగులకు జీతాల చెల్లింపు మొదలుకుని ప్రతి వ్యవహారంలో అక్రమాలు జరిగినట్టు విజిలెన్స్‌ గుర్తించింది. ఫలితంగా నాలుగేళ్లలో దాదాపు రూ.171 కోట్ల రుపాయల దుర్వినియోగం అయ్యాయని వాటిలో రూ.139 కోట్ల రుపాయలు ఇప్పటికే చెల్లింపులు జరిపినట్టు నివేదికలో పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై సీఐడీ, ఏసీబీతో దర్యాప్తు జరపాలని విజిలెన్స్‌ నివేదిక పేర్కొంది.ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌లో కోట్లాది రుపాయల దుర్వినియోగమైనట్టు తేలడంతో ఏపీ డిజిటల్ కార్పొరేషన్‌ వీసీ ఎండీగా వ్యవహరించిన చిన్న వాసుదేవరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా విజిలెన్స్‌ సిఫార్సు చేసింది.వీడియో కంటెంట్ తయారీ పేరుతో భారీగా డబ్బు దుర్వినియోగం చేశారని ఇందుకు బాధ్యులైన ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్‌ సిఫార్సు చేసింది. డేటా మోటిఫ్ డిజిటల్ మీడియా, జిపిఆర్‌ పబ్లికేషన్స్‌, డెక్కన్ మీడియా, సాయి నందిని టెక్నో క్రియేషన్స్‌, షాలోక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, అవిసా మీడియా ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ సాయి అడ్వర్‌టైజింగ్‌, ఆర్‌ఆర్ మీడియా అడ్వర్‌టైజింగ్‌, త్రీ అటమ్‌ లీవ్స్‌ సంస్థలు మోస పూరితంగా ప్రభుత్వానికి నష్టం వాటిల్లేలా చేశారని విజిలెన్స్‌ నివేదిక ఆరోపించింది.డెక్కన్‌ మీడియా, త్రీ అటమ్‌ లీవ్స్‌ స్టోరీ టెల్లింగ్ సంస్థలు జిఎస్టీ ఎగవేతలకు పాల్పడ్డారని, నగదు చెల్లింపుల్లో జరిగిన అక్రమాలను సరి చేయాలని విజిలెన్స్‌ నివేదికలో సిఫార్సు చేశారు.

ఏపీడీసీ కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో సీఐడీ, ఏసీబీ దర్యాప్తు జరపాలని విజిలెన్స్‌ నివేదిక అభిప్రాయపడింది.ఏపీడీసీలో జరిగిన అక్రమాలకు అప్పటి వీసీ ఎండీ చిన్న వాసుదేవరెడ్డి బాధ్యుడని విజిలెన్స్‌ నివేదిక పేర్కొంది. ఐ డ్రీమ్‌ వ్యవస్థాపకుడైన చిన వాసుదేవరెడ్డి ఐపాక్‌, ఐ డ్రీమ్‌ ఉద్యోగులను ఏపీడీసీలో ఉద్యోగులుగా చూపినట్టు విజిలెన్స్‌ నివేదిక పేర్కొంది. అనుభవం, అర్హతలు లేని వారిని ఉద్యోగులుగా నియమించడంలో వాసుదేవ రెడ్డి కీలకంగా వ్యవహరించారని విజిలెన్స్ ఆరోపించింది. లేని సంస్థలకు చెల్లింపులు జరపడం ద్వారా రూ. 37.20కోట్లను ఖర్చు చేసి ప్రభుత్వానికి నష్టం కలిగించారని పేర్కొంది. డేటా మోటిఫ్‌, జిపిఆర్‌ పబ్లికేషన్స్‌, డెక్కన్‌ మీడియా, సాయి నందిని క్రియేషన్స్‌, త్రీ ఆటమ్‌ లీవ్స్‌, అవిసా మీడియా, సాయి అడ్వర్టైజింగ్‌, షాలోక్‌ ఎంటర్‌టైన్‌మెంట‌్, ఆర్‌ఆర్‌ మీడియా సంస్థలకు లబ్ది చేకూర్చినట్టు పేర్కొన్నారు.ఏపీడీసీలో అక్రమాలను చూసి చూడనట్టు వదిలేసినందుకు, అర్హత లేని వారిని ఉద్యోగాల్లో నియమించినందుకు..

సెలక్షన్‌ కమిటీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై లీగల్‌ యాక్షన్‌తో పాటు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు.వీరిలో ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ రెడ్డి, ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ సభ్యుడు ఐఆర్‌ఏఎస్‌ అధికారి మధుసూదన్‌ రెడ్డి, కె.హేమచంద్రారెడ్డి, పి.ప్రతాప్‌, ఐ అండ్ పీఆర్‌ సీఈ ఓ.మధుసూదన, చీఫ్‌ డిజిటల్ డైరెక్టర్‌ బ్రహ్మానంద పాత్ర, ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ ఉద్యోగి మోతీలాల్ నాయక్‌, బి.నాగేశ్వరరావు. రాధాకృష్ణ, రామసుబ్బయ్య, జి.వి రామకృష్ణా రావు, ఏవీసుబ్బారెడ్డి, భూమిరెడ్డి శ్రీ వర్ధన్ రెడ్డి, పాలేశ్వరరావు, గంగవరపు సుధీర్‌ కుమార్‌, దీపిక పొన్నకంటి, శశికృష్ణ పొన్నకంటి, తాడుక అరవింద్, చెన్ను మౌనిక, నాగ భూషన్ రెడ్డి, త్రీ అటామ్ లీవ్స్ సంస్థలపై న్యాయపరమైన చర్యలకు సిఫార్సు చేశారు.

76 పేజీల నివేదిక…

డిజిటల్ కార్పోరేషన్ పేరుతో రూ.171.9 కోట్లను ఖర్చు చేయగా వాటిలో రూ.139.28కోట్లను విడుదల చేశారు. ఏపీడీసీలో జరిగిన అక్రమాలపై 76 పేజీల నివేదికను విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ ప్రభుత్వానికి అందచేసింది. యాత్ర 2 సినిమాలో నటించిన మళయాళ నటుడు మమ్ముట్టికి కూడా రూ.50లక్షల రుపాయలు ఏపీడీసీ నుంచి చెల్లింపులు జరిపినట్టు విజిలెన్స్‌ నివేదికలో పేర్కొన్నారు. వీడియో కంటెంట్‌ తయారీ పేరుతో భారీగా నిధులను మళ్ళించారు. తాత్కలిక ఉద్యోగులుగా చేరిన వారిలో కొందరికి అనూహ్య ప్రయోజనాలు చేకూర్చినట్టు నివేదిక పేర్కొంది. న్యాయమూర్తులను దూషించిన కేసులో సీబీఐ అరెస్ట్‌ చేసిన నిందితులకు కూడా ఏపీడీసీలో ఉద్యోగులుగా కొనసాగినట్టు విజిలెన్స్‌ గుర్తించింది.

Related posts

Leave a Comment