Andhra Pradesh:మాజీ ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ

Mutual accusations are rife in Chilakaluripet between former minister Vidadala Rajani and Narasaraopet TDP MP Lavu Krishnadevaraya.

Andhra Pradesh:మాజీ ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ:చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజని, నరసరావుపేట టిడిపి ఎంపీ లావు కృష్ణదేవరాయలు మధ్య పరస్పర ఆరోపణలు జోరుగా సాగుతున్నాయి. వైసీపీలో హయాంలో ఆరోగ్యశాఖ మంత్రిగా మొన్న విడదల రజిని తన నియోజకవర్గంలో స్టోన్ క్రషర్స్ యజమానుల నుంచి డబ్బులు వసూలు చేశారంటూ ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ACB కేసులు నమోదు చేసింది. రేపో మాపో విడదల రజని అరెస్టు తప్పదు అంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై భగ్గుమన్న రజని టిడిపి నేతలపై ఆరోపణలు చేస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ

గుంటూరు, మార్చి 25
చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజని, నరసరావుపేట టిడిపి ఎంపీ లావు కృష్ణదేవరాయలు మధ్య పరస్పర ఆరోపణలు జోరుగా సాగుతున్నాయి. వైసీపీలో హయాంలో ఆరోగ్యశాఖ మంత్రిగా మొన్న విడదల రజిని తన నియోజకవర్గంలో స్టోన్ క్రషర్స్ యజమానుల నుంచి డబ్బులు వసూలు చేశారంటూ ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ACB కేసులు నమోదు చేసింది. రేపో మాపో విడదల రజని అరెస్టు తప్పదు అంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై భగ్గుమన్న రజని టిడిపి నేతలపై ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుత నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు తనపై కక్ష కట్టారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. స్థానికంగా ఉన్న స్టోన్ క్రషర్ యజమాని నుండి రెండు కోట్లకు పైగా డబ్బులు వసూలు చేశారనేది ఆమెపై ఉన్న ఆరోపణ.మాజీ మంత్రి విడదల రజని చేసిన ప్రధాన ఆరోపణ తన కుటుంబాన్ని ప్రస్తుత ఎంపీ లావు కృష్ణదేవరాయులు టార్గెట్ చేశారని తన ఫోన్ కాల్ డేటాను సేకరించే ప్రయత్నం కూడా గతంలోనే చేశారని జర్మనీలో ఉంటున్న తన మరిది ని కూడా కేసుల్లో ఇరికించే కుట్ర జరుగుతుందని.

నిజానికి ఒకప్పుడు కృష్ణదేవరాయలు కూడా వైసిపి ఎంపిగానే ఉండేవారు. అప్పటినుంచే వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. 2020లో గురజాల పోలీస్ స్టేషన్లో తనకు అవమానం జరిగిందని దాని వెనక అప్పటి వైసీపీ ఎంపీ కృష్ణదేవరాయల అధికార దుర్వినియోగం ఉందని రజని ఆరోపించారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు నేపథ్యంలో కృష్ణదేవరాయలు టిడిపిలోకి రావడం నరసరావుపేట ఎంపీగా గెలుపొందడం జరిగిపోయింది. మరోవైపు వైసీపీ ఓటమి పాలయ్యింది. అప్పటినుంచి తనను కేసుల్లో ఇరికించే కుట్రలు ఎక్కువ అవుతున్నాయని విడదల రజని ఆరోపిస్తున్నారు. తనపై విడదల రజని చేసిన ఆరోపణలకు ఢిల్లీలో ఎంపీ లావు కృష్ణ దేవరాయలు కౌంటర్ ఇచ్చారు. తనకు బూతులు రావని, మాజీ మంత్రి రజినీలా అబద్దాలు ఆడడం రాదని ఆయన అన్నారు. రజిని కాల్ డేటా సేకరించి ప్రయత్నం తాను చేయలేదని తన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారని వాళ్ళకో న్యాయం రజనీ కో న్యాయం అంటూ ఉండదని చెప్పుకొచ్చారు.

రజినీ మాటలు వెనక ఎవరున్నారో తనకు తెలుసని చెప్పిన కృష్ణదేవరాయలు ఎవరో స్టోన్ క్రషర్ యజమాని ఇచ్చిన కంప్లైంట్ కు తనకు సంబంధం ఏంటని అన్నారు. తమ చాలా ఏళ్లుగా విద్యాసంస్థలు నడుపుతున్న ప్రభుత్వం నుంచి భూమిని తీసుకున్న సందర్భమే లేదని అన్నారు. పది రోజుల క్రితం విడదల రజని ఒక మధ్యవర్తి ద్వారా కేసులు నుంచి తనని తప్పించమని రాయబారం నడిపిన మాట వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. స్టోన్ క్రషర్ యజమాని నుండి తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పిన మాట నిజమో కాదో రజిని చెప్పాలని ఆయన అన్నారు.చేసిందంతా చేసి ఇప్పుడు ఇలా తనపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదని చట్టం తన పని తాను చేసుకు పోతుందని కృష్ణదేవరాయలు మాజీ మంత్రికి కౌంటర్ ఇచ్చారు. తను వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎవ్వరి పైనా ఎలాంటి విమర్శలు చేయలేదని తనను అనవసరంగా రెచ్చగొట్టొద్దని ఆయన స్పష్టం చేశారు. మరి రానున్న రోజుల్లో ఈ వివాదం ఇంకెన్ని టర్న్స్ తీసుకుంటుందో చూడాలి.

Read also: శాపంగా మారిన సిన్సియారిటీ..

గుంటూరు, మార్చి 25
సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణకు ఇక మంత్రి పదవి దక్కే అవకాశాలు లేవు. ఎందుకంటే ఇప్పటికే కాపు సామాజికవర్గం కోటాలో అనేక మంది ఉండటంతో ఆయనకు ఈ టర్మ్ లో మంత్రిపదవి దక్కడం అనేది అసంభవమేనని చెప్పాలి. ఇటు జనసేన, అటు బీజేపీ, మరొకవైపు టీడీపీలోనూ కాపు సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎమ్మెల్సీ పదవుల విషయంలోనూ, మంత్రి పదవుల విషయంలోనూ కాపులకే ఈ మూడు పార్టీలు ఇప్పటికే ప్రాధాన్యత ఇచ్చాయి. దీంతో కన్నా లక్ష్మీనారాయణకు ఒకవేళ విస్తరణ జరిగినా మంత్రి పదవి దక్కే అవకాశం దాదాపు శూన్యమనే చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు కేబినెట్ లో ఇప్పటికే నలుగురు కాపు సామాజికవర్గానికి చెందిన వారుండటంతో పాటు నాగబాబుకు కూడా మంత్రి పదవి ఇస్తే ఐదుగురు అవుతారు. పవన్ కల్యాణ్, కందుల దుర్గేశ్ జనసేన నుంచి మంత్రి వర్గంలో ఉండగా, నిమ్మల రామానాయుడు, పొంగూరు నారాయణ టీడీపీ నుంచి ఉన్నారు. ఇటీవల ఎమ్మెల్సీ పోస్టుల్లోనూ జనసేన నాగబాబుకు అవకాశమివ్వగా, బీజేపీ అదే సామాజికవర్గానికి చెందిన సోము వీర్రాజుకు ఇచ్చింది.

ఇక కేబినెట్ లో ఉన్న నిమ్మల రామానాయుడు,నారాయణలు ఇద్దరూ చంద్రబాబుకు అత్యంత ఇష్టులు.నమ్మకమైన నేతలు. వారిని కాదని మరొక కాపు సామాజికవర్గం నేతకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదు. అందుకే కన్నా లక్ష్మీనారాయణ కు మంత్రి పదవి దక్కే అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్లేనని ఏపీ పాలిటిక్స్ తెలిసిన వారు ఎవరైనా చెప్పక తప్పదు. సీనియర్ మోస్ట్ నేత అయిన కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ లో ప్రభుత్వం ఏర్పడినప్పుడల్లా గుంటూరు జిల్లా కోటా కింద మంత్రి అయ్యే వారు. సీనియారిటీ మాత్రమే కాకుండా సామాజికవర్గం కూడా అదనపు బలం అయి కన్నా లక్ష్మీనారాయణకు ప్రతిసారీ మంత్రి పదవి దక్కేది. కానీ ఈసారి పార్టీలు మారినా, అధికారంలోకి వచ్చినా ఫలితం కనిపించడం లేదు. కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర విభజనకు ముందు కూడా మంత్రివర్గంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కానీ రెండేళ్ల తర్వాత ఆయనను పదవి నుంచి తొలగించడంతో మనస్తాపం పొందిన కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరారు. కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరతారని అనుకున్నా అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరారు.

కోడెల కుటుంబాన్ని కాదని సత్తెనపల్లి టిక్కెట్ ఇచ్చారు. ఇక అధికారంలోకి రాగానే తనకు మంత్రి పదవి గ్యారంటీ అనుకున్నారు. జిల్లా కోటాలోనూ… కానీ టీడీపీ కోటాలో దక్కించుకున్న ఇద్దరిలో నిమ్మల రామానాయుడు కాపు సామాజికవర్గమైనా మూడుసార్లు గెలిచి పార్టీకోసం అత్యంత నమ్మకంగా పనిచేశారు. పొంగూరు నారాయణను చంద్రబాబును వేరు చేసిచూడలేం. కాపు సామాజికవర్గంలో ఎక్కువ మంది నేతలుండటం వల్ల కన్నా లక్ష్మీనారాయణకు మంత్రి పదవి దూరమయిందనే అనుకోవాలి. ఆయన కూడా ఇక మంత్రి పదవి పై ఆశలు వదులుకున్నట్లే కనిపిస్తుంది. అందుకే పెద్దగా పార్టీలోనూ యాక్టివ్ గా ఈ మధ్యకాలంలో కనిపించడం లేదు. దీంతోపాటు గుంటూరు జిల్లా నుంచి నాదెండ్ల మనోహర్, నారా లోకేశ్ కేబినెట్ లో ఉండటంతో జిల్లా కోటాలోనూ అసాధ్యమనే చెప్పాలి. అందుకే కన్నాకు పాపం.. సీనియారిటీ కంటే సిన్సియారిటీ శాపంగా మారిందనే చెప్పాలి.

Read more:Andhra Pradesh:ఆ ఊరికి ఏమైంది.. గ్రామంలో ప్రతి ఇంటిలో క్యాన్సర్ పేషంట్

Related posts

Leave a Comment