Andhra Pradesh:పొసాని ఎక్కే గుమ్మం.. దిగే గుమ్మం:పోసాని కృష్ణమురళికి బెయిల్ లభించింది. కానీ ఆ ఆనందం ఆయనకు ఎక్కువ రోజులు నిలవలేదు. ప్రతి సోమవారం తో పాటు గురువారం సిఐడి కార్యాలయానికి వచ్చి సంతకాలు చేయాల్సి ఉంది. సిఐడి కోర్టు బెయిల్ ఇచ్చినప్పుడే ఈ షరతు పెట్టింది. దీంతో పోసాని కృష్ణ మురళికి బెయిల్ అయితే లభించింది కానీ.. కేసుల నుంచి విముక్తి కలిగేలా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. గత నెల 26న ఆయన అరెస్ట్ అయ్యారు. కేసుల మీద కేసులు నమోదయ్యాయి.
పొసాని ఎక్కే గుమ్మం.. దిగే గుమ్మం.
విజయవాడ, మార్చి 26
పోసాని కృష్ణమురళికి బెయిల్ లభించింది. కానీ ఆ ఆనందం ఆయనకు ఎక్కువ రోజులు నిలవలేదు. ప్రతి సోమవారం తో పాటు గురువారం సిఐడి కార్యాలయానికి వచ్చి సంతకాలు చేయాల్సి ఉంది. సిఐడి కోర్టు బెయిల్ ఇచ్చినప్పుడే ఈ షరతు పెట్టింది. దీంతో పోసాని కృష్ణ మురళికి బెయిల్ అయితే లభించింది కానీ.. కేసుల నుంచి విముక్తి కలిగేలా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. గత నెల 26న ఆయన అరెస్ట్ అయ్యారు. కేసుల మీద కేసులు నమోదయ్యాయి. కస్టడీల మీద కస్టడీలు కొనసాగాయి. చివరకు 24 రోజుల అనంతరం ఆయన జైలు నుంచి విముక్తి పొందారు.వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు పోసాని కృష్ణ మురళి. ఫోటో మార్ఫింగ్ చేసి సైతం ఆయన కామెంట్స్ చేశారన్నది ప్రధాన ఆరోపణ. తొలుత ప్రకాశం జిల్లా పోలీసులు గత నెల 26న హైదరాబాదులో కృష్ణ మురళిని అదుపులోకి తీసుకున్నారు. అది మొదలు ఆయనపై కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.
ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లా జైలులకు తరలిస్తూ ఆయన కస్టడీ 24 రోజులు పాటు కొనసాగింది. కొద్ది రోజుల కిందట అన్ని కేసులలో ఆయనకు బెయిల్ లభించింది. కానీ ఇంతలో సిఐడి పీటి వారెంట్ ఇచ్చింది. దీంతో పోసానిని కర్నూలు నుంచి గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. అయితే న్యాయస్థానంలోనే తనకు ఆరోగ్యం బాగా లేదంటూ పోసాని కృష్ణ మురళి కన్నీటి పర్యాంతం అయ్యారు. అయినా సరే అప్పట్లో న్యాయస్థానం ఆయన రిమాండ్ ను కొనసాగించింది.ఈ నెల 21న పోసాని కృష్ణ మురళి సిఐడి కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. మద్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. దీంతో కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. రెండు లక్షల పూచికత్తుతో ఆయనకు బెయిల్ ఇచ్చింది కోర్టు. ప్రతి సోమ, గురువారాల్లో సిఐడి కార్యాలయానికి వచ్చి సంతకం చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. మీడియాతో కేసుల గురించి అస్సలు మాట్లాడకూడదు అని సూచించింది. అదే సమయంలో పోసాని కృష్ణ మురళికి సిఐడి విచారణకు సహకరించాలని కూడా ఆదేశాలు ఇచ్చింది.
దీంతో పోసాని కృష్ణ మురళికి ఉపశమనం దక్కలేదని తేలిపోయింది. తదుపరి కొనసాగింపు కూడా ఉంటుందని స్పష్టమైంది.కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పోసాని కృష్ణ మురళి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కాస్త యాక్టివ్ గానే కనిపించారు. అయితే ఉన్నట్టుండి ఆయన ఓ రోజు కీలక ప్రకటన చేశారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని తేల్చేశారు. ఇకనుంచి రాజకీయాలు మాట్లాడనని కూడా చెప్పుకొచ్చారు. అయితే గతంలో పోసాని కృష్ణ మురళి చేసిన కామెంట్స్ ను టిడిపి, జనసైనికులు మరిచిపోలేదు. అందుకే పాత కేసులు తెరపైకి వచ్చాయి. పోసాని అరెస్టు జరిగింది. ఆయనకు బెయిల్ లభించింది. అయితే అది మనశ్శాంతి లేని బెయిల్ అని తేలిపోయింది. సో మున్ముందు పోసాని వ్యవహార శైలి బట్టి కేసుల తీవ్రత ఉంటుందని విశ్లేషకులు సైతం తేల్చి చెబుతున్నారు.
ఇక పీకల్లోతు కష్టాల్లో బోరుగడ్డ:
బోరుగడ్డ అనిల్ కుమార్(విషయంలో హైకోర్టు తీవ్ర వ్యాఖ్యానాలు చేసింది. ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో బోరుగడ్డ మరోసారి కేసుల ఉచ్చులో పడాల్సి వచ్చింది. గత వైసిపి ప్రభుత్వంలో కూటమినేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు బోరుగడ్డ. వ్యక్తిగత కామెంట్లకు సైతం వెనుకడుగు వేసే వారు కాదు. చాలా రకాలుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ లపై వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబ పరంగా కూడా విమర్శలు చేశారు. అనుచిత వ్యాఖ్యలు కొనసాగించారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు చుక్కలు కనిపిస్తున్నాయి. తాజాగా కోర్టు ధిక్కరణ కింద కూటమి ప్రభుత్వానికి ఆయన అస్త్రం అందించారు. దానిపైనే కేసులు నమోదు కావడంతో ఆయన హైకోర్టు ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది.రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండేవారు బోరుగడ్డ. ఆ సమయంలో తన తల్లికి అనారోగ్యం ఉందంటూ ఆయన మద్యంతర బెయిల్ పొందారు.
అయితే సకాలంలో రాజమండ్రి జైల్లో తిరిగి లొంగిపోలేదు. అదే ఇప్పుడు ఆయనకు ఇబ్బందికరంగా మారింది. పోలీసులు అనిల్ కుమార్ పై హైకోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు బోరుగడ్డ ఎందుకు సకాలంలో జైల్లో లొంగి పోలేదని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో బోరుగడ్డ ఇరకాటంలో పడినట్లు అయ్యింది. వాస్తవానికి బోరుగడ్డ లొంగి పోవాల్సింది ముందు రోజు సాయంత్రం. కానీ ఆయన తరువాత రోజు ఉదయం రాజమండ్రి జైలుకు వచ్చి సరెండర్ అయ్యారు. దీంతో రాజమండ్రి జైలు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. బోరుగడ్డకు నోటీసులు జారీ చేసింది.బోరుగడ్డ లొంగిపోవడం వెనుక పెద్ద ఎపిసోడ్ నడిచింది. తన తల్లి అనారోగ్యానికి సంబంధించి సమర్పించిన డాక్టర్ ధృవీకరణ పత్రం ఫేక్ అని పోలీసులు గుర్తించారు. వెంటనే వారు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ విచారణలో ఉండగానే.. బెయిల్ గడువు ముగిసింది. ఇంతలోనే తనకు బెయిల్ పొడిగించాలని మరోసారి బోరుగడ్డ కోర్టును ఆశ్రయించారు. దీనిపై సైతం కోర్టు విచారణ చేసింది. కానీ పోలీసులు బలమైన ఆధారాలు సమర్పించడంతో బెయిల్ పొడిగించడం కుదరదని తేల్చి చెప్పింది. అంతేకాదు ఎక్కడున్నా సరే.. అత్యవసరంగా వచ్చి అధికారుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో జైలు అధికారుల ముందు లొంగిపోయారు బోరుగడ్డ. కానీ ఆయనపై పోలీసులు నమోదు చేసిన నకిలీ డాక్టర్ సర్టిఫికేట్ కేసు సహా.. హైకోర్టును తప్పుదోవ పట్టించారన్న కేసులు మాత్రం విచారణలో ఉన్నాయి. తాజాగా వీటిపై విచారణ జరిపిన కోర్టు.. బూరుగడ్డ వంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదకరమని.. ఇలాంటి వారిని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.ప్రధానంగా తప్పుడు డాక్టర్ సర్టిఫికెట్ సమర్పించి మద్యంతర బెయిల్ పొందిన వైనంపై విచారణ నివేదికలను సీల్డ్ కవర్లో కోర్టు ముందు ఉంచాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. నిర్దేశించిన సమయంలోపు జైలు అధికారుల ముందు ఎందుకు హాజరు కాలేదు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీచేసింది కోర్టు. దీనిపై ప్రత్యేకంగా పిటిషన్ వేయాలని.. కేసు నమోదు చేయాలని ఆదేశించడం గమనార్హం.
Read more:Andhra Pradesh:ఆర్వోబీలతో మహార్ధశ