Andhra Pradesh:పవన్ ప్లాన్ పక్కాగానే ఉందే.

Pawan's plan is perfect.

Andhra Pradesh:పవన్ ప్లాన్ పక్కాగానే ఉందే.ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యూహం అదేనా? పదే పదే చంద్రబాబు నాయుడును పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పడం వెనక కారణమేమై ఉంటుందన్న దానిపై ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఒక స్ట్రాటజీ ప్రకారమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, ముందుచూపుతోనే ఈ కామెంట్స్ తరచూ చేయడం వెనక కూడా దూరదృష్టి ఉందని అంటున్నారు.

పవన్ ప్లాన్ పక్కాగానే ఉందే.

ఏలూరు, మార్చి 25
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యూహం అదేనా? పదే పదే చంద్రబాబు నాయుడును పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పడం వెనక కారణమేమై ఉంటుందన్న దానిపై ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఒక స్ట్రాటజీ ప్రకారమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, ముందుచూపుతోనే ఈ కామెంట్స్ తరచూ చేయడం వెనక కూడా దూరదృష్టి ఉందని అంటున్నారు. చంద్రబాబు నాయుడు పట్ల తనకున్న అభిమానాన్ని పవన్ కల్యాణ్ చెబుతుంటే భవిష్యత్ లో తనకు టీడీపీ అనుకూలురు మద్దతు కూడా లభిస్తుందన్న కారణంతోనే చంద్రబాబు పదిహేనేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలని పదే పదే కోరుతున్నారని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఒక రకంగా టీడీపీ శ్రేణులకు, నేతలకు కూడా కొంత ఇబ్బందికరంగా మారాయని చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు తమ అధినేత అయినప్పటికీ వారంతా నారా లోకేశ్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. నారా లోకేశ్ ను ఉప ముఖ్యమంత్రిగా చేయాలన్న డిమాండ్ ఇటీవల కాలంలో ఊపందుకుంది.

చిన్న స్థాయి నేతల నుంచి సీనియర్ నేతల వరకూ నారా లోకేశ్ ను ఉప ముఖ్యమంత్రిగా చేయాలని అంటున్నారు. అయితే అందుకు జనసేన క్యాడర్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నారా లోకేశ్ కు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి ఇవ్వడమేంటని సోషల్ మీడియాలో ప్రశ్నించారు.అయితే చంద్రబాబును పదే పదే పొగడటంతో పాటు ఆయనే పదిహేనేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకోవడం వెనక కూడా పవన్ కల్యాణ్ వ్యూహమేనంటున్నారు. తన వ్యాఖ్యలతో నారా లోకేశ్ డిప్యూటీ సీఎం పదవికి చెక్ పెట్టడమే కాకుండా, దరిదాపుల సమయంలో నారా లోకేశ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపించకూడదనే పవన్ కల్యాణ్ ఇలా చంద్రబాబును సీఎంగా కొనసాగాలంటున్నారన్న రాజకీయ విశ్లేషణలు మొదలయ్యాయి.

దీనివల్ల టీడీపీ సానుభూతి పరులతో పాటు ఆ ఓటు బ్యాంకు కూడా తనకు భవిష్యత్ లో అండగా నిలుస్తుందన్న భావన ఆయనలో ఉందన్నారు. అందుకే చంద్రబాబు నాయుడుప పదిహేనేళ్ల సీఎం అంటూ పదే పదే వ్యాఖ్యలు చేస్తూ పవన్ టీడీపీలో కొందరి మైండ్స్ ను బ్లాంక్ చేస్తున్నారంటున్నారు. చంద్రబాబు నాయుడు కూడా పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలకు ఖుషీ అవుతున్నారు. తనకు అండగా పవన్ కల్యాణ్ ఉంటారన్న నమ్మకంతో ఆయన జనసేనకు కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలున్నాయి. అదే సమయంలో నేతలు అక్కడకక్కడా ఇబ్బంది పెట్టినా పవన్ కల్యాణ్ అండ తనకు అవసరమని భావిస్తున్న చంద్రబాబు పవన్ కల్యాణ్ విషయంలోనూ భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్టీ పరంగా చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. దీంతో పాటు బీజేపీని కూడా టీడీపీతో కలసి ప్రయాణం చేసేందుకు పవన్ కల్యాణ్ ఉపయోగపడతారని, కూటమి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వీలవుతుందన్న అంచనాల్లో చంద్రబాబు ఉన్నారని చెబుతున్నారు.

Read also:నల్లమల్లలో అలా నడుచుకుంటూ..

కర్నూలు, మార్చి 25
నంద్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ఈనెల 27 నుంచి 31 వరకు వైభవంగా జరగనున్నాయి ఈ నేపథ్యంలో దేవాదిదేవుడిని తనివితీరా దర్శించుకునేందుకు నల్లమల అడవి మార్గం గుండా కాలినడకన పాదయాత్రగా కన్నడ భక్తులు వేలాది తరలివస్తున్నారు. నల్లమల అంతా ఓంకారనాదంతో ప్రతిధ్వనిస్తోంది. ఉగాది పర్వదినం సమీపిస్తుండటంతో శ్రీ గిరి మల్లయ్యను ధ్యాన మల్లన్న తండ్రి అదుకో అంటూ ఆర్తితో పిలుస్తూ శ్రీగిరి కొండకు చేరుకుంటున్నారు. నల్లమల అరణ్యం గుండా కాలినడకన వస్తున్న వారికి దేవస్థానం పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించింది. ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురం గ్రామం వద్ద మంచినీటి సౌకర్యం గతం కంటే బాగుందని అయితే అటవీ మార్గం మధ్యలో కొద్దిగా ఇబ్బంది ఉన్న ఏర్పాట్లు బాగున్నాయని కన్నడ భక్తులంటున్నారు. నల్లమల బాటలన్నీ మల్లన్న సన్నిధి వైపే కన్నడ భక్తుల భజనలతో మార్మోగుతున్న శ్రీశైలం మరోపక్క వైద్య సదుపాయాలు బాగున్నాయని అడవి మార్గంలో బీమకొలను మీదుగా కొండెక్కి కన్నడిగులు పాదయాత్రగా నడుచుకుంటూ వస్తున్న నేపద్యంలో దేవస్థానం అధికారులు లక్షలు ఖర్చుపెట్టి కాలినడకన నల్లమల నుంచి వచ్చే కన్నడ భక్తులకు వైద్య సౌకర్యాలు కల్పించారు.

పాదయాత్ర భక్తుల కోసం అడవిమార్గంలో రాళ్లు రప్పలు లేకుండా కాలినడకన వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రహదారి వెంట ట్రాక్టర్లతో నీరు చల్లుతున్నారు. భక్తులకు మార్గమధ్యలో దేవస్థానం సహకారంతో స్వచ్చంద సేవకర్తలతో అన్నదాన ఏర్పాటు చేశారు. కన్నడ భక్తులు శ్రీశైలం శ్రీ భ్రమరాంబికాదేవిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి ఆడపడుచును తనివితీరా చూసేందుకు ఎండను సైతం లెక్కచేయకుండా మండుటెండలో ఎంతో భక్తి శ్రద్ధలతో వెంకటాపురం నుంచి దట్టమైన అటవీప్రాంతంలో సుమారు 40 కిలోమీటర్లు నడుచుకుంటున్న వస్తున్నారు. పాదయాత్రగా వస్తున్న కన్నడ భక్తుల కోసం పలువురు దాతలు మజ్జిగ, పండ్లు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. భక్తుల సౌకర్యాలపై దేవస్థానం ఈవో శ్రీనివాస రావు ప్రత్యేక దృష్టి పెట్టడం సంతోషంగా ఉందని పలువురు కన్నడ భక్తులు తెలిపారు.

Read more:Andhra Pradesh:మాజీ ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ

Related posts

Leave a Comment