Andhra Pradesh:తొలి ఉచిత గ్యాస్ సిలిండర్:ప్రతి పేద ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని, దీపం-2 పథకంలో తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.ఇప్పటి పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలన్నారు ఇప్పటివరకు 98 లక్షల మంది తొలి ఉచిత సిలిండర్ వినియోగించుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు.01నవంబర్ 2024న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా దీపం 2 పథకానికి శ్రీకారం చుట్టారు.
– తొలి ఉచిత గ్యాస్ సిలిండర్
– మార్చి 31 వరకే అవకాశం
-ఇప్పటివరకు పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలి
– ఆహారం, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
విజయవాడ
ప్రతి పేద ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని, దీపం-2 పథకంలో తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.ఇప్పటి పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలన్నారు ఇప్పటివరకు 98 లక్షల మంది తొలి ఉచిత సిలిండర్ వినియోగించుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు.01నవంబర్ 2024న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా దీపం 2 పథకానికి శ్రీకారం చుట్టారు. దీపం -2 పథకంతో ప్రతి పేద వాడి ఇంట్లో దీపపు కాంతులు విరాజిల్లుతున్నాయి.కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా దీపం-2 పథకం రూపొందించడం జరిగింది.దీపం-2 పథకానికి రూ.2,684 కోట్లు కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.ఉచిత సిలిండర్ కావాల్సిన వారు సాధారణ పద్ధతిలో ముందుగా సొమ్ము చెల్లించవలసి ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లోబుక్ చేసిన 24 గంటల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల లోపు గ్యాస్ డెలివరీ ఇస్తారు.ఆ తర్వాత సిలెండర్ డెలివరీ అయిన 48 గంటల్లోపు చెల్లించిన పూర్తి సొమ్మును లబ్దిదారుల ఖాతాల్లో తిరిగి జమ అవుతుందన్నారు ఒక సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు ఇలా ఉచితంగా పంపిణీ చేస్తారు. అయితే వీటిని ఒకేసారి కాకుండా నాలుగు నెలలకు ఒకసారి బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.
ప్రతి ఏడాది ఏప్రిల్ – జూలై (01), ఆగష్టు –నవంబర్ (01), డిసెంబర్ –మార్చి (01) మధ్య ఉచిత గ్యాస్ సిలెండర్ బుక్ చేసుకోవచ్చని అయన వెల్లడించారు.
Read more:Andhra Pradesh:భవిష్యత్తు అంతా టూరిజమే