Andhra Pradesh:కాకాణికి బిగిస్తున్న ఉచ్చు

Former Minister Kakani Govardhan Reddy

Andhra Pradesh:కాకాణికి బిగిస్తున్న ఉచ్చు:మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వరుసగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు.. నెల్లూరు జిల్లా వైసీపీలో అంతో ఇంతో యాక్టివ్‌గా ఉన్న కాకాణి చుట్టూ ఉచ్చు బిగుస్తుండటం పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది.. తాజాగా క్వార్ట్జ్‌ ఖనిజం కొల్లగొట్టిన కేసులో మాజీ మంత్రిపై కేసు నమోదు చేశారు. మరోవైపు ఒంగోలు పార్లమెంట్‌ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసిన కేసులో ప్రభుత్వం సిట్‌ను నియమించింది. ఎంపీ సంతకాల ఫోర్జరీ కేసులో సైతం కాకాణిని నిందితుడిగా చేర్చే సూచనలు కనిపిస్తున్నాయి.

కాకాణికి బిగిస్తున్న ఉచ్చు

నెల్లూరు, మార్చి 27
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వరుసగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు.. నెల్లూరు జిల్లా వైసీపీలో అంతో ఇంతో యాక్టివ్‌గా ఉన్న కాకాణి చుట్టూ ఉచ్చు బిగుస్తుండటం పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది.. తాజాగా క్వార్ట్జ్‌ ఖనిజం కొల్లగొట్టిన కేసులో మాజీ మంత్రిపై కేసు నమోదు చేశారు. మరోవైపు ఒంగోలు పార్లమెంట్‌ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసిన కేసులో ప్రభుత్వం సిట్‌ను నియమించింది. ఎంపీ సంతకాల ఫోర్జరీ కేసులో సైతం కాకాణిని నిందితుడిగా చేర్చే సూచనలు కనిపిస్తున్నాయి. సర్వేపల్లి రిజర్వాయర్‌లో గ్రావెల్‌ కుంభకోణం వెనుక కూడా కాకాణి హస్తం ఉన్నట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ పరిణామాలతో కాకాణికి కష్టకాలం తప్పదంటున్నారు.మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అరెస్టుకు రంగం సిద్దమైనట్లు జరుగుతున్న ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది . ఇప్పటివరకు జిల్లాలో ఇద్దరూ మాజీ మంత్రులు కాకాణి, సోమిరెడ్డిల మధ్య కొనసాగుతున్న మాటల యుద్దం పోలీసుల రికార్డులకు ఎక్కింది.

ఓ మైన్ ని కొల్లగొట్టి అక్రమంగా 250 కోట్ల రూపాయలకు పైగా దోచేసినట్లు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపణలు మేరకు మైనింగ్, పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే ఈ అభియోగంపై కేసులు కూడా నమోదు చేశారు. మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ కేసులో నాలుగో నిందితుడిగా చేర్చారు. ఈ నేపధ్యంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టు త్వరలోనే ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.వైసీపీ ప్రభుత్వ హయాంలో సైదాపురం మండలం పరిధిలో ఉన్న మైన్లలో భారీగా తవ్వకాలు జరిగాయి. ఆ క్రమంలోనే పొదలకూరు మండలంలోని రుస్తుం మైన్స్‌లో అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజం కొల్లగొట్టినట్లు కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. అక్కడ కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపద రాష్ట్ర సరిహద్దులు దాటింది. ఇతర దేశాల్లో ఆ ఖనిజానికి డిమాండ్ బాగా ఉండటంతో ధర కూడా బాగానే పలికిందంట. దాంతో మైనింగ్ నిర్వహించిన వారు కోట్లకు పడగలెత్తారు.అదంతా అక్రమమని గతంలోనే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాష్ట్ర మైనింగ్ శాఖతో పాటు కేంద్ర మైనింగ్ శాఖలకు కూడా ఫిర్యాదు చేశారు.

250 కోట్ల విలువైన ఖనిజ సంపాదన దోచుకున్నారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. అప్పట్లో ప్రభుత్వం వైసీపీది ఉండడంతో కాకాని గోవర్ధన్ రెడ్డి పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వైసిపి ప్రభుత్వంలో ఇదే రుస్తుం మైన్స్‌ వద్ద సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి క్వార్ట్జ్‌ ఖనిజం అక్రమంగా తరలిపోతుందని మూడురోజులపాటు సత్యాగ్రహ దీక్ష కూడా చేశారు. మైనింగ్‌ లోడ్లతో రవాణాకు సిద్ధంగా ఉన్న 40 లారీలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అప్పట్లో అది పెద్ద కలకలమే రేపింది.వైసీపీ ప్రభుత్వంలో న్యాయం జరగదని భావించిన సోమిరెడ్డి కేంద్ర మైనింగ్‌ శాఖకు ఫిర్యాదు చేశారు. కేంద్రం ఆదేశాలకు తోడు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ కేసుకు ప్రాణం వచ్చింది. ఇటీవల ఇదే అంశాన్ని ఆయన అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. తనపై హిజ్రాలతో దాడి చేపించారని చెప్పుకొచ్చారు. ఆ క్రమంలో తాజాగా ఈ మైన్స్ నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టి దోచుకున్నారంటూ మైన్స్ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.అప్పటి వరకు ఆ క్వారీ వైపు కన్నెత్తి కూడా చూడని మైనింగ్‌ శాఖ అధికారులు అక్కడికి వెళ్లి దోచుకుపోయిన క్వార్డ్జ్‌ విలువ రూ.250 కోట్లకు పైగా ఉంటుందని లెక్కలు కట్టారు.

పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మొదట ముగ్గురిపై కేసు కట్టారు. కాకాణి ప్రధాన అనుచరులు ముగ్గురి పేర్లతో తొలుత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే ఈ ముగ్గురు పోలీసులు తమ వద్దకు రాకముందే హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్‌ తెచ్చుకున్నారు. తాజాగా మరో ఏడుగురిని ఈ కేసులో చేర్చారు.ప్రస్తుతం ఈ అంశం నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రవ్యాప్తంగా వరుసగా వైసీపీ నేతలు అరెస్ట్ అవుతున్న నేపధ్యంలో కాకాణి అరెస్టు ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో కాకాణి ముందు వరుసలో ఉంటున్నారు. అందుకే కూటమి ప్రభుత్వం ఆయనపైన దృష్టి పెట్టిందంటున్నారు. మరోవైపు ఈ కేసు పై కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందిస్తూ.. కేసుల నమోదు కొత్త విషయం ఏమి కాదని.. కేసులు పెట్టి బెదిరిస్తే భయపడే ప్రసక్తే లేదంటుండటం విశేషం.ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని కాకాణి స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాలను గమనిస్తే మాజీ మంత్రి కాకాణి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఒంగోలు పార్లమెంట్‌ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసిన కేసులో ప్రభుత్వం సిట్‌ను నియమించింది. ఎంపీ సంతకాల ఫోర్జరీ కేసులో సైతం కాకాణిని నిందితుడిగా చేర్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ గమనిస్తే గత ప్రభుత్వంలో మంత్రిగా నెల్లూరు జిల్లాలో చక్రం తిప్పిన కాకాణికి జైలు గండం పొంచి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Read more:Andhra Pradesh: లిక్కర్ స్కామ్ డొంక కదులుతోంది

Related posts

Leave a Comment