Andhra Pradesh:ఇక నో బ్యాగ్ డే:ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పుస్తకాల మోతకు స్వస్తి పలికేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు ప్రస్తుతం ప్రతి నెల మూడో శనివారం నో బ్యాగ్ డే అమలు చేస్తుండగా… ఇకపై దీనిని ప్రతి శనివారం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి శనివారం నో బ్యాగ్ డేను అమలు చేయనున్నారు.
ఇక నో బ్యాగ్ డే
విజయవాడ, మార్చి 24
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పుస్తకాల మోతకు స్వస్తి పలికేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు ప్రస్తుతం ప్రతి నెల మూడో శనివారం నో బ్యాగ్ డే అమలు చేస్తుండగా… ఇకపై దీనిని ప్రతి శనివారం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి శనివారం నో బ్యాగ్ డేను అమలు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా వెల్లడించారుప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సమగ్ర వికాసమే లక్ష్యంగా ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అందులో భాగంగానే ‘నో బ్యాగ్ డే’ అమలు చేస్తోంది. ఆ రోజు విద్యార్థులకు క్విజ్లు, సమకాలీన అంశాలపై డిబేట్లు, సదస్సులు, క్రీడలు, వివిధ పోటీలు నిర్వహిస్తామని లోకేశ్ తెలిపారు.
నో బ్యాగ్ డే వల్ల విద్యార్థులకు కలుగుతున్న ప్రయోనాలపై వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తెలిపిన విశేషాలతో కూడిన వీడియోను లోకేశ్ షేర్ చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని పలువురు నెటిజన్లు సైతం అభినందిస్తున్నారు. ఇదిలాఉండగా.. ప్రస్తుతం నెలలో మూడో శనివారం నో బ్యాగ్ డేగా అమలు చేస్తున్నారు. అయితే కొన్నిచోట్ల అది సరిగా అమలు కావడం లేదనే విమర్శ ఉంది. ఈ ఏడాది జనవరిలో మంత్రి నారా లోకేష్ పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై జరిగిన సమీక్షలో పాఠశాలల్లో ప్రతి శనివారం నో బ్యాగ్ డే అమలు చేయాలని నిర్ణయించారు. విద్యార్థుల కోసం కో కరిక్యులమ్ రూపొందించాలని కూడా మంత్రి నారా లోకేష్ అధికారులను కోరారు.
విద్యార్థుల మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థుల మానసిక ఒత్తిడిని తగ్గించడం, బడి అంటే భయాన్ని పోగొట్టడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న మంత్రి నారా లోకేష్ జనవరి నెలలో కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రతి శనివారం నో బ్యాగ్ డే గా ప్రకటించి విద్యార్థులకు కో కరిక్యులం యాక్టివిటీస్ రూపొందించాలని సంబంధిత విద్యాశాఖ అధికారులను మంత్రి అప్పుడు ఆదేశించారు. ఈ ఆదేశాలు అమలైతే ప్రతి శనివారం విద్యార్థులు పాఠశాలకు పుస్తకాల బరువులతో వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఉన్నత పాఠశాల స్థాయి చదువుల కోసం విద్యార్థులు పుస్తకాల రూపంలో అధిక బరువులను మోస్తున్న పరిస్థితి. వారంలో ఆరు రోజులు విద్యార్థులకు ఏకధాటిగా తరగతులు నిర్వహిస్తారు. ఆదివారం రోజు సెలవు దినం కావడంతో, ఆరోజున విద్యార్థులు తమకు అప్పగించిన హోంవర్క్ పూర్తి చేసే పనిలో ఉంటారని చెప్పవచ్చు. అలాగే తమకు దొరికిన కొద్ది సమయంలో ఆటపాటలకు సమయాన్ని కేటాయిస్తారు. ఇటువంటి పరిస్థితులను అర్థం చేసుకున్న కూటమి ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
Read also:దండు మారెమ్మ జాతరలో అశ్లీలం..
తిరుపతి, మార్చి
ఏదైనా పండుగలు, జాతరలు, తిరునాళ్లు సమయంలో పల్లెల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో సాంస్కృతిక కార్యక్రమాలు పేరుతో గ్రామాల్లో రికార్డింగ్ డాన్స్‌లు నిర్వించేవారు. కొన్ని సార్లు డాన్స్ బేబీ డాన్స్‌తో అశ్లీల నృత్యాలు నిర్వహించేవాళ్లు. రాను రాను వీటిపై నిషేదించారు. చాలా ఏళ్ల నుంచి నిషేదం ఉన్నప్పటికీ.. గత కొంత కాలంగా రికార్డింగ్ డాన్సులు, అశ్లీల నృత్యాలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది.ముఖ్యంగా ఈ మధ్య కాలంలో యువత చెడు వ్యసనాలకు బానిసవడంతో.. ఇలాంటి డాన్సులుపై నిషేదం విధించారు. అయినా సరే కొన్ని గ్రామాల్లో జాతరలు, పండుగల సమయంలో సాంస్కృతిక కార్యకాలాపాలు పేరిట అశ్లీల నృత్యాలు చేస్తూ వస్తున్నారు.
ఇలాంటి కార్యాక్రమాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసులు ఇలాంటి ప్రోగ్రామ్‌లను అడ్డుకున్నప్పటీకీ.. మరికొన్ని చోట్ల చూసీచూడనట్లు వ్యవహరిస్తూ విమర్శలు పాలవుతున్నారు.ఇదిలా ఉంటే.. తాజాగా అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం లో నిర్వహిస్తున్న దండు మారెమ్మ జాతర అభాసుపాలైంది. జాతరలో నిర్వహించకూడని డ్యాన్స్‌లను హిజ్రాల చేత యాథేచ్ఛగా చేయించారు జాతర నిర్వహకులు. అశ్లీల నృత్యాలతో పాటుగా జుగుప్సాకరంగా ఎలాంటి బట్టలు లేకుండా శరీర భాగాలు కనిపించే విధంగా డ్యాన్య్ లు చేశారు కొంతమంది హిజ్రాలు.ఈ వ్యవహారమంతా స్థానిక ముదివేడు పోలీస్ స్టేషన్ పోలీసులు గమనిస్తున్నా ఆ డ్యాన్స్ లను అడ్డుకునే ప్రయత్నం ఏ మాత్రం చేయలేదు. ఆ సమయంలో అక్కడే డ్యూటీలు చేస్తున్న ఇద్దరు ఎస్ఐలు తమకు సంబంధం లేనట్లుగా వ్యవహరించారని స్థానికులు తెలిపారు. ఆ నృత్యాలను SI గాని సంబంధిత CI గాని ఎందుకు ఆపలేదని ? ప్రజలు విమర్శిస్తున్నారు.
అత్యంత జుగుప్సాకరంగా ఉన్న విజువల్స్ చూస్తే పోలీసులే అశ్లీల డ్యాన్స్ లను ప్రోత్సహించారని, వారి సహాకారం ఉండటం వల్లే జాతర నిర్వహకులు ఈ తరహా డ్యాన్స్ లను నడిపిస్తున్నారని ప్రజలు పేర్కొన్నారు.దండు మారెమ్మ జాతర చిత్తూరు పడమటి మండలాల్లో ప్రేత్యేక గుర్తింపు పొందిన వేడుక. అయితే ఈ సారి ఆచారం పేరుతో అర్ధరాత్రి టైమ్‌లో అసభ్యకరమైన డాన్స్‌లు చేయడం, వేడుకను విచ్చలవిడిగా మార్చేయడం అందరిని షాంకింగ్కు గురిచేసింది. సభ్య సమాజం తలదించుకునే విధంగా ట్రాక్టర్‌పై నగ్న దృశ్యాలతో డ్యాన్సులు చేయడం అత్యంత దారుణంగా ఉన్నాయి.ఈ వ్యవహారంపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఈ తరహా డ్యాన్స్ లు జిల్లాలో ఏ జాతరలో కూడా మరలా రీపీట్ కాకుండా చూడాలంటున్నారు ప్రజలు. దండు మారెమ్మ జాతర నిర్వహకులపై, డ్యూటీలో ఉన్న ఎస్ఐ లపై జిల్లా ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.