Andhra Pradesh:ఆ ఊరికి ఏమైంది.. గ్రామంలో ప్రతి ఇంటిలో క్యాన్సర్ పేషంట్

There is a cancer patient in every household in the village.

Andhra Pradesh:ఆ ఊరికి ఏమైంది.. గ్రామంలో ప్రతి ఇంటిలో క్యాన్సర్ పేషంట్:ఒకరికి కాదు.. ఇద్దరికి కాదు.. ఏకంగా గ్రామంలో సుమారు 200 మందికి పైబడే కేన్సర్‌ వ్యాధి లక్షణాలు నిర్ధారణ అవ్వడం కలవరానికి గురిచేస్తోంది.. వైద్యపరీక్షల ద్వారా 23 మందికి కేన్సర్‌ను గుర్తించిన అధికారులు గ్రామంలో ఉన్న పరిస్థితిని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ ప్రశాంతితోపాటు ఉన్నతాధికారులకు వివరించారు.. ఇంకా గ్రామంలో ఎంతమందికి క్యాన్సర్‌ ఉందో తెలుసుకునే ప్రయత్నంలో నిమగ్నమైన అధికారులు ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నారు..

ఆ ఊరికి ఏమైంది..
గ్రామంలో ప్రతి ఇంటిలో క్యాన్సర్ పేషంట్

కాకినాడ, మార్చి 25
ఒకరికి కాదు.. ఇద్దరికి కాదు.. ఏకంగా గ్రామంలో సుమారు 200 మందికి పైబడే కేన్సర్‌ వ్యాధి లక్షణాలు నిర్ధారణ అవ్వడం కలవరానికి గురిచేస్తోంది.. వైద్యపరీక్షల ద్వారా 23 మందికి కేన్సర్‌ను గుర్తించిన అధికారులు గ్రామంలో ఉన్న పరిస్థితిని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ ప్రశాంతితోపాటు ఉన్నతాధికారులకు వివరించారు.. ఇంకా గ్రామంలో ఎంతమందికి క్యాన్సర్‌ ఉందో తెలుసుకునే ప్రయత్నంలో నిమగ్నమైన అధికారులు ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నారు.. ప్రాధమికంగా గ్రామంలో చాలా మంది చిన్నారుల్లో కూడా కాలేయ సంబందిత వ్యాధులు ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.. ఇదిలా ఉంటే బలభద్రపురంలో క్యాన్సర్‌ కోరల్లో ప్రజలు చిక్కుకుంటున్న పరిస్థితిపై అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసెంబ్లీలో కూడా ప్రస్తావించడంతో దీనిపై ప్రభుత్వ, అధికార యంత్రాంగం కూడా ప్రత్యేక దృష్టిసారించిన పరిస్థితి కనిపించింది.. బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్‌ కోరలు చాస్తోందన్న వార్త గ్రామంలో తీవ్ర భయాందోళనలు నెలకొంటున్న పరిస్థితి కనిపిస్తోంది.. తమ ఒంట్లో ఏ క్యాన్సర్‌ రాకాసి ఉందోనన్న అనుమానాలు ఆ గ్రామస్తుల మాటల్లో కనిపిస్తున్నాయి.. ఎందుకంటే ఈగ్రామంలోనే ఇప్పటికే 23 మంది క్యాన్సర్‌ బారిన పడడం గమనార్హం. ఇంకా సుమారు 200 మందికి క్యాన్సర్‌ లక్షణాలు ఉన్నట్లు సమాచారం.

అయితే అధికారులు ఇంకా అధికారికంగా దృవీకరించకపోయినప్పటికీ తూర్పు గోదావరి జిల్లా వైద్యశాఖ, కాకినాడ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందాలు సారధ్యంలో గ్రామంలో 32 బృందాలుగా సర్వే చేస్తున్నారు.. అయితే ఇప్పటికే గ్రామంలో 23 మంది క్యాన్సర్‌ చికిత్సలో ఉండగా మరికొంత మందికి ఈ వ్యాధి ఉందన్న సమాచారంతో గ్రామంలో తీవ్ర భయాందోళన పరిస్థితి నెలకొంది.. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ పరిధిలోకి వచ్చే భలభద్రపురం గ్రామంలోనే గ్రాసిమ్‌ కెమికల్‌ ఇండస్ట్రీతో పాటు ఇతర పరిశ్రమలున్నాయి.. వీటినుంచి వెలువడే కాలుష్య వల్లనే గ్రామంలో ఈ భయంకర పరిస్థితులు నెలకొన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్ధాలు భూగర్భంలో డంపింగ్‌ చేయడం వల్ల భూగర్భజలాలు కాలుష్యకాసారాలుగా మారుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. బలభద్రపురం గ్రామంలో సుమారు 10 వేల మంది జనాభా ఉండగా ఎవ్వరిని కదిపినా క్యాన్సర్‌ కలవరం స్పష్టంగా కనిపిస్తోంది.. ఏప్రిల్‌ 2022లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి బలభద్రపురం శివారు ప్రాంతంలో గ్రాసిమ్‌ ఇండస్ట్రీను ప్రారంభించారు.. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బలభద్రపురంలో క్యాన్సర్‌ కోరలు చాస్తోందని తన ప్రసంగంలో ప్రస్తావించారు. దీనిపై వైద్యఆరోగ్యశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. లేకపోతే ఇప్పటికే గ్రామంలో చాలా మంది క్యాన్సర్‌ బారిన పడ్డారని, మరింత మందికి ఈ వ్యాధి ఉండే అవకాశం లేకపోలేదని, గ్రామంలో తక్షణ చర్యలు చేపట్టి క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలతోపాటు క్యాన్సర్‌ కారకాలను గుర్తించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోపాటు వైద్యఆరోగ్యశాఖ మంత్రికి విన్నవించారు..

చర్యలకు ఉపక్రమించిన ఆరోగ్యశాఖ
తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో క్యాన్సర్ కేసుల కలకలంపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. బలభద్రపురంలో అత్యధిక క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని అనపర్తి ఎమ్మెల్యే అసెంబ్లీలో పేర్కొన్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దీంతో వెంటనే 31 మెడికల్ టీమ్ లను అక్కడికి పంపామన్నారు.నాన్ కమ్యూనకబుల్ 3.0 సర్వేలో భాగంగా నాన్ కమ్యూనకబుల్ డిసిజ్ క్యాన్సర్ స్క్రీనింగ్ మొదలు పెట్టామని వెల్లడించారు. ఇప్పటివరకు కోటి 93 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించగా వీరిలో లక్ష 45వేల 649 మంది వేర్వేరు క్యాన్సర్లతో భాదపడుతున్న అనుమానిత కేసులు వచ్చాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు.”బలభద్రపురానికి సంబంధించి 10800 మంది జనాభాలో 3500 ఇళ్లు ఉన్నాయి. వీరిలో 2803 ఇళ్ల వద్దకు వెళ్లి 8830 మందికి పరీక్షలు చేయగా 38 కేసులు బయటపడ్డాయి. దీనిలో గతంలో క్యాన్సర్ ఉన్న కేసులు ఉన్నాయి. భారత్ లో 14 లక్షల 13 వేల కొత్త కేసులు వచ్చాయి. లక్ష జనాభాకు 367 మంది అంటే 10 వేలు జనాభా ఉన్న బలభద్రపురంలో 32 కేసులు ఉన్నాయి.అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం.

ఆయన అసెంబ్లీలో మాట్లాడటంతో మీడియాలో హైలెట్ అయ్యి అందరికీ తెలిసింది. అనపర్తి నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకుంటే లక్షా 19వేల మందికి స్క్రీనింగ్ చేయగా 736 సస్పెక్టెడ్ కేసులు వచ్చాయి. క్యాన్సర్ ట్రీట్ మెంట్ ను 2022-25 మధ్య ఎన్టీఆర్ వైద్య సేవ కింద లక్ష 13 వేల 363 మందికి చికిత్స చేశారు. బలభద్రపురంలో క్యాన్సర్ అనుమానిత కేసులు అసాధారణంగా పెరగలేదు. స్క్రీనింగ్ ట్రైన్డ్ సీహెచ్ సెంటర్లలో ఉండే వారు చేస్తారు. ఆశా వర్కర్లు కాదు” అని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కృష్ణబాబు- ప్రిన్సిపల్ సెక్రటరీ, వైద్యారోగ్య శాఖ క్యాన్సర్ ను కన్ ఫామ్ చేయడానికి చేసే పరీక్ష బయాప్సీ మాత్రమే. మిగిలిన పరీక్షలన్నీ రూలౌట్ చేయడానికే. కేజీహెచ్, గుంటూరు, కర్నూలులో క్యాన్సర్ ట్రీట్ మెంట్ సౌకర్యాలు ఉన్నాయి. తొలి స్టేజ్ లో డయాగ్నోజ్ చేస్తే లైఫ్ స్పాన్ ను పెంచుకోవచ్చు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్లు కూడా ఓ టీంను బలభద్రపురం పంపారు. పర్యావరణ అంశాలు క్యాన్సర్ కు కారణం అంటే లంగ్స్, స్కిన్ ఎఫెక్ట్ కావాలి. ఆ తరహా క్యాన్సర్లు అక్కడ డయాగ్నోజ్ కాలేదు. ఇదే అంశంపై సీఎం కూడా రివ్యూ చేశారు.

Read more:Chandrababu Pawan Kalyan Can’t Stop Laugh Over Raghu Rama Krishna Raju Getup | AP Cultural Evevning

Related posts

Leave a Comment