Andhra Pradesh:అనంతలో అద్భుతం:గ్రామాల్లో తరచుగా వింతలు జరుగుతుంటాయి. కలలోకి దేవతలు వచ్చారని, ఫలానా పని చేయాలని కొందరు చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్లు చెప్పినట్లు చేస్తే ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వస్తాయి. తాజాగా ఏపీలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ యువకుడి కలలోకి అమ్మవారు వచ్చి.. ఫలానా చోట తవ్వితే తన విగ్రహం బయటపడుతుందని చెప్పిందట. గ్రామస్తులంతా కలిసి అమ్మవారు చెప్పిన చోటుకు వెళ్లి గునపాలతో తవ్వారు. ఆశ్చర్యకరంగా అమ్మవారి విగ్రహం బయటపడింది.
అనంతలో అద్భుతం
అనంతపురం, మార్చి 26
గ్రామాల్లో తరచుగా వింతలు జరుగుతుంటాయి. కలలోకి దేవతలు వచ్చారని, ఫలానా పని చేయాలని కొందరు చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్లు చెప్పినట్లు చేస్తే ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వస్తాయి. తాజాగా ఏపీలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ యువకుడి కలలోకి అమ్మవారు వచ్చి.. ఫలానా చోట తవ్వితే తన విగ్రహం బయటపడుతుందని చెప్పిందట. గ్రామస్తులంతా కలిసి అమ్మవారు చెప్పిన చోటుకు వెళ్లి గునపాలతో తవ్వారు. ఆశ్చర్యకరంగా అమ్మవారి విగ్రహం బయటపడింది. దీంతో గ్రామస్తులంతా ఆ విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేయడం మొదలు పెట్టారు. ఇంతకీ అసలు ఏం జరిగిందటే..అనంతపురానికి చెందిన అంజి అనే యువకుడు గత కొద్ది రోజులుగా అమ్మవారు ఒంటి మీదికి వచ్చిందంటూ పూనకంతో ఊగిపోతున్నాడు. అంతేకాదు, గంగమ్మ అమ్మవారు తన కలలోకి వచ్చిందని చెప్పాడు. గౌరవ గార్డెన్ వాటర్ ట్యాంక్ సమీపంలో తవ్వితే విగ్రహాలు బయటపడతాయని చెప్పిందంటూ శిగం ఊగాడు. రెండు అడుగుల లోతుతో ఆ విగ్రహాలు ఉన్నాయని అమ్మవారు తనకు చెప్పిందని చుట్టుపక్కల వారితో చెప్పాడు. అతడి మాటలు నమ్మిన స్థానికులు వాటర్ ట్యాంక్ సమీపంలో తవ్వకాలు చేపట్టాలి అనుకున్నారు.తాజాగా స్థానికుల అంతా కలిసి పూజలు చేసి అంజి చెప్పిన ప్రాంతంలో పూజలు చేసి, విగ్రహాల కోసం తవ్వకాలు మొదలుపెట్టారు.
చెప్పినట్లుగానే రెండు అడుగులు తవ్వగానే గంగమ్మ అమ్మవారి విగ్రహం బయటపడింది. స్థానికులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అందరూ కలిసి అమ్మవారి విగ్రహాన్ని నీటితో కడిగి, పసుపు, కుంకుమ రాశారు. పూలు, నిమ్మకాయలు పెట్టి పూజలు చేస్తున్నారు.ఈ విషయం అనంతపురం అంతా వ్యాపించడంతో అమ్మవారిని చూసేందుకు ప్రజలు తరలి వస్తున్నారు. అమ్మవారిని చూసి విగ్రహం మీద పసుపు, కుంకుమ వేసి పూజలు చేస్తున్నారు. అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నారు. విగ్రహాలు బయటప పడటంతో అంజి చెప్పిన మాటలు నిజమేనని అందరూ భావిస్తున్నారు. ఆయనకు గంగమ్మ అమ్మవారు ఒంటి మీదికి వస్తున్నట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన అనంతపురంలో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు స్థానికులు అంతా కలిసి అమ్మవారికి ఆలయం కట్టించాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఆలయ నిర్మాణ పనులు మొదలు పెడతామని చెప్తున్నారు. ఈ ఆలయంలో అంజినే పూజారిగా ఉంచాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఆయన మూలంగానే అమ్మవారు బయటకు వచ్చారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు.
Read more:Andhra Pradesh:స్మార్ట్ మీటర్ స్కాం.