Graduate MLC : గ్రాడ్యేయేట్ ఎన్నికల ప్రచార జోరు

MLC ELECTIONS

గ్రాడ్యేయేట్ ఎన్నికల ప్రచార జోరు

కాకినాడ, ఫిబ్రవరి 14, (న్యూస్ పల్స్)
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అభ్యర్ధుల ప్రచార పర్వం మరింత వేగంగా సాగుతోంది.. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వ్యక్తిగతంగా ప్రచారం  చేస్తున్నారు. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌ తరపున ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు రంగంలోకి దిగారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల నాయకత్వంలో కూటమి ప్రజాప్రతినిధులు, ద్వితీయశ్రేణి నాయకులు ఎవరికి వారు జోరుగా ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రత్యక్ష ఎన్నికలు ఇదే మొదటిసారి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉభయగోదావరి జిల్లా నియోజకవర్గం నుంచి పేరాబత్తుల రాజశేఖర్‌ను బరిలో దింపింది కూటమి నాయకత్వం. గ్రాడ్యుయేట్‌ ఓటర్లు నమోదు నుంచి సభ్యత్వాల నమోదు వరకు ఎమ్మెల్యేలపై పూర్తి బాధ్యతలు పెట్టిన నాయకత్వం ఆ దిశగా పనిచేయకపోయిన వారికి అక్షింతలు వేసింది. పనితీరు ఆధారంగా మార్కులు వేస్తానని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతీ ఒక్క అంశాన్ని పరిశీలించడంతో వారంతా పరుగులు పెడుతున్నారు. మరింత బాధ్యతాయుతంగా పని చేస్తున్నారు. ప్రచారం నుంచి ఓట్లు వేయించే బాధ్యత తీసుకొని కూటమి అభ్యర్థిని గెలిపించుకునేందుకు సాయాశక్తులు కృషిచేస్తున్నారు.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అభ్యర్ధుల ప్రచార పర్వం మరింత వేగంగా సాగుతోంది.. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వ్యక్తిగతంగా ప్రచారం  చేస్తున్నారు. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌ తరపున ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు రంగంలోకి దిగారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల నాయకత్వంలో కూటమి ప్రజాప్రతినిధులు, ద్వితీయశ్రేణి నాయకులు ఎవరికి వారు జోరుగా ప్రచారం చేస్తున్నారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రత్యక్ష ఎన్నికలు ఇదే మొదటిసారి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉభయగోదావరి జిల్లా నియోజకవర్గం నుంచి పేరాబత్తుల రాజశేఖర్‌ను బరిలో దింపింది కూటమి నాయకత్వం. గ్రాడ్యుయేట్‌ ఓటర్లు నమోదు నుంచి సభ్యత్వాల నమోదు వరకు ఎమ్మెల్యేలపై పూర్తి బాధ్యతలు పెట్టిన నాయకత్వం ఆ దిశగా పనిచేయకపోయిన వారికి అక్షింతలు వేసింది. పనితీరు ఆధారంగా మార్కులు వేస్తానని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతీ ఒక్క అంశాన్ని పరిశీలించడంతో వారంతా పరుగులు పెడుతున్నారు. మరింత బాధ్యతాయుతంగా పని చేస్తున్నారు. ప్రచారం నుంచి ఓట్లు వేయించే బాధ్యత తీసుకొని కూటమి అభ్యర్థిని గెలిపించుకునేందుకు సాయాశక్తులు కృషిచేస్తున్నారు.స్వతంత్య్ర అభ్యర్ధిగా మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ తనయుడు ప్రచారంలో జోరుగా ఉన్నారు. అందుకే కూటమి అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖర్‌ కూడా ప్రచార స్పీడు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాపకింద నీరులా హంగూ ఆర్భాటం లేకుండా చేసుకుపోతున్న సుందర్‌ కూటమి అభ్యర్ధిని పరుగులు పెట్టించే పరిస్థితి కనిపిస్తోంది. సొంత మ్యానిఫెస్టో విడుదల చేయడం, విద్యాసంస్థల వద్ద సమావేశాలు నిర్వహించడం, గ్రాడ్యుయేట్లుతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా సుందర్‌ తటస్థులు మరింత దగ్గరవుతున్నారన్న సంకేతాలు వినిపించడంతో కూటమి నాయకత్వం అప్రమత్తమైంది. ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలతో స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించడం, నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఎమ్మెల్యేలతో నిర్వహించడం తదితర అంశాలపై దృష్టి పెట్టిన కూటమి అభ్యర్థి ప్రచారాన్ని వేగవంతం చేశారు.ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన 54 మంది నామినేషన్లు దాఖలు చేయగా వాటిలో 11 నామినేషన్లు తిరస్కరణ గురయ్యాయి. 43 మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు గుర్తించారు.

వామపక్షాల నుంచి డీవీ రాఘవులు, స్వతంత్ర అభ్యర్ధిగా జీవీ సుందర్‌, బండారు రామ్మోహన్‌రావు బరిలో ఉన్నారు. అందుకే జాగ్రత్త పడిన పేరాబత్తుల రాజశేఖర్‌ కూటమిలోని అందర్నీ కలుపుకొని ప్రచారంలో జోరు పెంచారు. స్వతంత్య్ర అభ్యర్ధిగా మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ తనయుడు ప్రచారంలో జోరుగా ఉన్నారు. అందుకే కూటమి అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖర్‌ కూడా ప్రచార స్పీడు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాపకింద నీరులా హంగూ ఆర్భాటం లేకుండా చేసుకుపోతున్న సుందర్‌ కూటమి అభ్యర్ధిని పరుగులు పెట్టించే పరిస్థితి కనిపిస్తోంది. సొంత మ్యానిఫెస్టో విడుదల చేయడం, విద్యాసంస్థల వద్ద సమావేశాలు నిర్వహించడం, గ్రాడ్యుయేట్లుతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా సుందర్‌ తటస్థులు మరింత దగ్గరవుతున్నారన్న సంకేతాలు వినిపించడంతో కూటమి నాయకత్వం అప్రమత్తమైంది. ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలతో స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించడం, నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఎమ్మెల్యేలతో నిర్వహించడం తదితర అంశాలపై దృష్టి పెట్టిన కూటమి అభ్యర్థి ప్రచారాన్ని వేగవంతం చేశారు.ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన 54 మంది నామినేషన్లు దాఖలు చేయగా వాటిలో 11 నామినేషన్లు తిరస్కరణ గురయ్యాయి. 43 మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు గుర్తించారు. వామపక్షాల నుంచి డీవీ రాఘవులు, స్వతంత్ర అభ్యర్ధిగా జీవీ సుందర్‌, బండారు రామ్మోహన్‌రావు బరిలో ఉన్నారు. అందుకే జాగ్రత్త పడిన పేరాబత్తుల రాజశేఖర్‌ కూటమిలోని అందర్నీ కలుపుకొని ప్రచారంలో జోరు పెంచారు.
===================

BRS : కారు పార్టీ ఎందుకిలా!

Related posts

Leave a Comment