20 thousand crores coming to Andhra | ఆంధ్రకు రానున్న 20 వేల కోట్లు | Eeroju news

20 thousand crores coming to Andhra

ఆంధ్రకు రానున్న 20 వేల కోట్లు

విజయవాడ, జూలై 30, (న్యూస్ పల్స్)

20 thousand crores coming to Andhra

కేంద్ర ఆర్థికశాఖ వర్గాలు చెప్పిన అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు 15వేల కోట్ల నుంచి  20వేల కోట్ల వరకూ వచ్చే అవకాశం ఉంది. బిహార్‌కు 5 నుంచి 10వేల కోట్ల సాయం అందనుంది.  ఈ రెండు రాష్ట్రాలకు ఇచ్చిన ప్రత్యేక కేటాయింపుల వల్ల ఈసారి కేంద్ర ఖజానాపై 25వేల నుంచి 30వేల కోట్ల రూపాయల భారం పడనుందని ఆర్థిక శాఖ చెబుతోంది.  ‘రాష్ట్రాల అభ్యర్థనలపై అందించే ప్రత్యేక సాయం’  పద్దు కింద ఏపీ, బిహార్‌కు సాయం అందించే అవకాశం ఉంది. ఈ పద్దుకు ఈసారి బడ్జెట్‌లో 20 వేల కోట్లు కేటాయించారు. ఎన్నికలకు ముందు ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ఈ హెడ్ కింద కేటాయింపులు 4వేల కోట్లు మాత్రమే. ఏవైనా రాష్ట్రాలు ప్రత్యేక అవసరాలు ఉంటే వారి కోరిక మేరకు ఈ పద్దు నుంచి కేటాయింపులు చేస్తుంది కేంద్రం.

ఎన్నికల తర్వాత ఈ పద్దుకు కేటాయింపులు ఏకంగా 5 రెట్లు పెరగడం చూస్తుంటే.. ఈ ఖాతా ద్వారానే ఈ రెండు రాష్ట్రాలకూ సాయం అందించన్నారని అర్థం అవుతోంది.  2023-24 బడ్జెట్ లో రాష్ట్రాలకు సాయం కింద పద్దులో రూ.2,271 కోట్లు ప్రతిపాదించగా.. చివరికి రూ.13,000 కోట్లు సాయం అందించింది కేంద్రం. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో కేవలం 4 వేలు పేర్కొనగా, పూర్తి స్థాయి బడ్జెట్ లో మాత్రం ఆ ప్రత్యేక సాయం పద్దను రూ.20,000 కోట్లకు కేంద్రం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. కిందటి వారం నిర్మలా సీతారామన్ బడ్జెట్ పద్దులో ఎక్కువగా వినిపించిన రాష్ట్రాల పేర్లు ఆంధ్ర, బిహార్. ఇంతకు మందు చాలా ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ అనే పేరే బడ్జెట్‌లో వినిపించేది కాదు. ఈసారి పలుమార్లు నిర్మల ఈ పేరును ప్రస్తావించారు.

అమరావతికి ప్రత్యక ఆర్థిక తోడ్పాటు కింద 15వేల కోట్ల సమీకరణ, ఏపీలో వెనుకపడిన జిల్లాల ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టుకు అయ్యే ఖర్చుపై పూర్తి బాధ్యత తీసుకోవడం, వైజాగ్ -చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లోని కొప్పర్తి నోట్‌కు మౌలిక సదుపాయాలు కల్పించడం, హైదరాబాద్- బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లోని ఓర్వకల్లుకు రోడ్లు, తాగునీరు వంటి సౌకర్యాలకు నిధులు కేటాయింపు వంటివి ప్రస్తావించారు. అలాగే బిహార్‌కు 27వేల కోట్ల విలువైన కూడా హైవేలు, విమానాశ్రయాలు మౌలిక వసతుల కల్పనా ప్రాజెక్టులు ప్రకటించారు.

ఎన్డీఏ 3.0 ప్రభుత్వానికి ఇప్పుడు ఊపిరి ఇస్తున్న పార్టీలు టీడీపీ, జనతాదళ్ యునైటెడ్ లే. మైనార్టీలో ఉన్న ఈ బీజేపీ ప్రభుత్వానికి ఈ రెండు పార్టీలకు చెందిన 28 మంది ఎంపీల మద్దతు దన్నుగా నిలబడుతోంది. కాబట్టి రాజకీయ పరమైన కారణాలతో ఈ రెండు రాష్ట్రాలకు కేటాయింపులు చేశారని విమర్శలు వచ్చాయి. తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం తమకు ప్రత్యేక సాయం ఏమీ అందించడం లేదని చెబుతోంది. ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకే సాయం అందిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.  విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి సాయం అవసరం అంటున్నారు.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం విడుదల చేసిన శ్వేతపత్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి అదనంగా రూ.19,107 కోట్లు అవసరం అని పేర్కొన్నారు.  పోలవరం, వెనుకబడిన జిల్లాల సాయం వంటివన్నీ చట్టంలోనే ఉన్నాయని.. రాజధానికి కేంద్రం సాయం చేస్తామని పదేళ్ల కిందటే చెప్పిందని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

20 thousand crores coming to Andhra

 

A flood of funds for Amaravati | అమరావతికి నిధుల వరద | Eeroju news

Related posts

Leave a Comment