వ్యవసాయ రంగాన్ని విస్మరించిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్Iతెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చెల్పూరి రాము:జమ్మికుంట:తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చెల్పూరి రాము. మంగళవారం రోజున ఇల్లంతకుంట మండల కేంద్రంలో చెల్పూరి రాము. మాట్లాడుతూ. శనివారం రోజున కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 50,65,345 మొత్తం కేంద్ర బడ్జెట్, రైతంగాన్నీ పేద ప్రజలను వంచన చేసి బడా కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే విధంగా ఉందని పేద ప్రజలకు ఆసరాగాలేని బడ్జెట్ ప్రవేశపెట్టారని అన్నారు, 2025-2026 బడ్జెట్ తమ రాజకీయ అవసరాలే ఉపయోగించుకున్నది తప్ప దేశ సమ్మిళిత అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకున్నట్టు లేదని అన్నారు.
వ్యవసాయ రంగాన్ని విస్మరించిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్..
తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చెల్పూరి రాము..
జమ్మికుంట:తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చెల్పూరి రాము. మంగళవారం రోజున ఇల్లంతకుంట మండల కేంద్రంలో చెల్పూరి రాము. మాట్లాడుతూ. శనివారం రోజున కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 50,65,345 మొత్తం కేంద్ర బడ్జెట్, రైతంగాన్నీ పేద ప్రజలను వంచన చేసి బడా కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే విధంగా ఉందని పేద ప్రజలకు ఆసరాగాలేని బడ్జెట్ ప్రవేశపెట్టారని అన్నారు, 2025-2026 బడ్జెట్ తమ రాజకీయ అవసరాలే ఉపయోగించుకున్నది తప్ప దేశ సమ్మిళిత అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకున్నట్టు లేదని అన్నారు, రైతాంగం ఆదాయాన్ని రెట్టింపు చేసే హామీలో భాగంగా నిధుల కేటాయింపులు లేవని కిసాన్ సమాన్ నిధి ఊసే లేదని, ఎరువులు విత్తనాల సబ్సిడీ గాలికి వదిలేసిందని పంటల బీమా పథకానికి కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ఆధారంగా కనీస గిట్టుబాటు ధరల చట్టం ఈ పార్లమెంటులో చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. నూతన జాతీయ మార్కెటింగ్ విధానం రద్దు చేయాలని విద్యుత్తు సవరణ చట్టం ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం పదే పదే వల్లేవేస్తున్న వికసిత్ భారత్ ఇలాంటి వైఖరితో సాధ్యమవుతుందా అని పునర్ సమీక్షించుకోవాలని అన్నారు. ఎన్నికలు ఉన్నా రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో వరాలు ప్రకటించి ఎన్నికలు లేని రాష్ట్రాల పట్ల వివక్ష సరికాదన్నారు.
దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనసులోయి అంటూ ప్రసంగించిన నిర్మల సీతారామన్,దేశమంటే కొన్ని రాష్ట్రాలే అన్నట్టు బడ్జెట్ ప్రవేశపెట్టడం బాధాకరం అన్నారు. 10 సంవత్సరాల నుండి ఇదే ధోరణినీ ప్రదర్శిస్తూ రాజకీయ అవసరాలు తీర్చుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం అని అన్నారు. 2024 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్,2025 ఢిల్లీ బీహార్ రాష్ట్రాల కోసం బడ్జెట్ పెట్టారని,2026 యూపీ బడ్జెట్,2027 గుజరాత్ కోసం బడ్జెట్ పెడుతారా యావత్ దేశానికి సరిపోయే బడ్జెట్ ఎప్పుడు పెడతారని ప్రశ్నిస్తున్నామని అన్నారు. బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి చోటు లేదా తెలంగాణ ప్రాంతం ప్రయోజనాలకు విలువ లేదా అని అన్నారు. ఇది కేంద్ర బడ్జెట్ లా లేదని కేవలం మూడు నాలుగు రాష్ట్రాల బడ్జెట్ ఇలా ఉందన్నారు తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఏమి సాధించినట్టు అని విమర్శిస్తున్నామని అన్నారు. తెలంగాణతో తమకు బంధం లేదని బడ్జెట్ ద్వారా మరోసారి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిరూపించింది అని అన్నారు. కేంద్ర జిడిపికి 5.1 శాతం కాంట్రిబ్యూట్ చేస్తున్న తెలంగాణ మరోసారి మోసపోయిందని అన్నారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ట్రైబల్ యూనివర్సిటీకి ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వకపోవడం తెలంగాణకు నిధులు కేటాయించకపోవడం దారుణమని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బిజెపి చేసింది ఏమీ లేదు అని కేంద్ర బడ్జెట్ ద్వారా నిధులు రాబట్టుకోవడంలో బిజెపి ఎంపీలు విఫలమయ్యారని అన్నారు. కేంద్రానికి మద్దతు పలికిన జనతాదళ్ (యు) బీహార్ లో వివిధ అభివృద్ధి పనులకు రూ.26 వేల కోట్ల సాయం, 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్, గాయాలు పారిశ్రామిక కారిడార్, నూతన విమానాశ్రయాలు, మెడికల్ కాలేజీలకు సాయం తదితరాలు పొందిందని అన్నారు. ఎన్నికలు దగ్గర ఉన్నాయని ఇప్పటి బడ్జెట్ లో బీహార్ కు మరిన్ని వరాల జల్లు కురిపించారు. బీహార్ లో మఖాన బోర్డు ఏర్పాటు, మిథిలాంచల్ లో వెస్టర్న్ కోసి కెనాల్, ఐఐటి పాట్నా విస్తరణ, బీహార్ లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్, ఫడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు అన్నారు. 8 సీట్లు ఇచ్చి బిజెపిని గెలిపిస్తే తెలంగాణ ప్రజలకు మొండి చేయి ఇచ్చారని ఎనిమిది మంది బిజెపి ఎంపీలు రాష్ట్రానికి ప్రత్యేకంగా ఎనిమిది రూపాయలు కూడా అధికంగా సాధించిన దాఖలాలు లేవన్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ బిజెపి ఎంపీ ల వైఫల్యం చెందిన విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించాలన్నారు..