రైస్ దందా మాటున కధలెన్నో…
కాకినాడ, డిసెంబర్ 6, (న్యూస్ పల్స్)
కాకినాడ పోర్టు నుంచి రేషన్ దందాపై రోజుకో నిజం వెలుగులోకి వస్తోంది. కొద్దిరోజుల కిందట సౌత్ ఆఫ్రికా కు రేషన్ బియ్యం తో వెళ్తున్న షిప్ ను కాకినాడ జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పి సీజ్ చేశారు. అటు తరువాత నేరుగా డిప్యూటీ సీఎం పవన్ ఆ షిప్ ను పరిశీలించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు తర్వాత ఈ అంశం మరింత హాట్ టాపిక్ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రం దందాను ఉక్కు పాదంతో అణచివేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయంలో వైసిపి ఎదురుదాడి చేస్తోంది. బియ్యం దందాలో టిడిపి నేతల సమీప బంధువులు ఉన్నారని ఆరోపిస్తోంది. ఇది ఒక రాజకీయ అంశంగా మారిపోయింది. ఈ తరుణంలో కాకినాడ పోర్టు యజమానుల్లో ఒకరైన కెవి రావు సిఐడి ఫిర్యాదుతో కొత్త మలుపు తిరిగింది. రైస్ దందా ఓవైపు..పోర్టునే కబ్జా పెట్టినట్లు చెబుతున్న మాటలు ఇంకోవైపు కాకరేపుతున్నాయి. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం దందా ఇష్యూ..తెలుగు స్టేట్స్లో వారం రోజులుగా వెబ్ సిరీస్‌లా కొనసాగుతోంది. మొదట కలెక్టర్ షిప్ పరిశీలన..తర్వాత పవన్ టూర్‌తో వెరీ ఇంట్రెస్టింగ్గా మారింది సీన్. సీజ్ ది షిప్ టాపిక్ ట్రెండింగ్‌లోకి ఉండగానే..మంత్రివర్గ ఉప సంఘం భేటీ, టాస్క్‌ఫోర్స్ కమిటీ, సీసీ కెమెరాలతో నిఘా ఇలా పోర్టునే నిఘా నీడలో పెట్టాలని ఫిక్స్ అయ్యారు. చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయే స్పెషల్ సెక్యూరిటీ టీమ్‌తో భద్రతను పటిష్టం చేయాలని డిసైడ్ చేసింది ఏపీ సర్కార్. ఇంతలోనే మరో వార్త సెన్సేషన్ అవుతోంది. వైసీపీ పెద్దల డైరెక్షన్లో కొందరు ఏకంగా కాకినాడ పోర్టునే కబ్జా పెట్టారట.కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్‌లోని రూ. 3,600 కోట్ల విలువైన వాటాలను కేవీ రావు నుంచి గత ప్రభుత్వ హయాంలో బలవంతంగా లాక్కున్నారంటూ ఓ వార్త హల్ చల్ చేస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన సీఐడీ..కేవీ రావు ఫిర్యాదులో పేర్కొన్న వారిని కీలక నిందితులుగా భావిస్తోంది. వాటాలు రాసివ్వకపోతే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని బెదిరించారని కేవీ రావు ఫిర్యాదు చేశారట. తనను భయపెట్టి అత్యధిక షేర్లను అరబిందో సంస్థకు అప్పగించేలా చేశారనేది కేవీ రావు ప్రధాన ఆరోపణ. ఈ కేసులోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వైసీపీ ఎంపీ, మరో ముఖ్యనేత తనయుడు, ఓ పారిశ్రామికవేత్తకు ఎల్వోసీ ఇచ్చినట్లు టాక్. ఈ ముగ్గురు విదేశాలకు పారిపోకుండా దేశంలో ఉన్న అన్ని ఎయిర్‌పోర్టులకు లుక్ ఔట్ నోటీసులు పంపించారట ఏపీ సీఐడీ అధికారులు.బియ్యం దందాపై కూపీ లాగితే డొంక మొత్తం కదిలిందట. కాకినాడ పోర్టు ఎవరి ఆధీనంలో ఉంది. ఎవరెవరికి వాటాలున్నాయని లెక్కలు తీస్తుండగా..అప్పటి ప్రభుత్వ హయాంలో జరిగిన సెటిల్మెంట్ కథ వెలుగులోకి వచ్చిందంటున్నారు. వ్యాపారం చేసుకునే వాళ్లను బెదిరించి..గత ప్రభుత్వ అధినేతల కనుసన్నుల్లో..తమ కావాల్సిన వారికి పోర్టులో వాటాలు దక్కేలా చేసుకున్నారని మండిపడుతున్నారు కూటమి నేతలు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని..వైసీపీ పాలకులు, వారి అండతో కొందరు గన్ను పెట్టి బెదిరించి ఆస్తులు రాయించుకున్నారని ఆరోపిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇలాంటివి దేశచరిత్రలోనే ఎప్పుడూ జరగలేదంటూ ఆఫ్ ది రికార్డులో ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు.మహారాష్ట్రలో దావూద్ ఇబ్రహీం లాంటి ముఠాలు ప్రజల్ని బెదిరించి, భయపెట్టి ఆస్తులు రాయించుకుంటే వాటిని సీజ్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఆ చట్టంపై సమాచారం తెప్పించుకుంటామంటున్నారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే భూఆక్రమణల నిరోధక చట్టం తీసుకొచ్చామన్న బాబు..కాకినాడ పోర్టు, సెజ్‌లలో బలవంతంగా వాటాలు రాయించుకున్న వ్యవహారం దీని పరిధిలోకి వస్తుందో, లేదో పరిశీలిస్తున్నారట. ఏదైనా బియ్యం దందా నుంచి స్టార్ట్ అయిన వ్యవహారం వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందనేది ఊహించని డెవలప్మెంట్. సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ స్టోరీలో..ఊహించని క్లైమాక్స్ రేంజ్లో సెటిల్మెంట్ ఎపిసోడ్ వెలుగులోకి రావడం పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది.
ఉన్నాయ.
* 2500 కోట్ల రూపాయల వాటాను 494 కోట్లకు లాక్కున్నారు.సెజ్ లో నా వాటా విలువ 1109 కోట్ల రూపాయలు.దానిని కేవలం 12 కోట్లకు లాగేసుకున్నారు.
* నిజాయితీగా వ్యాపారం చేసాం. ప్రభుత్వానికి రూపాయి కూడా పన్ను ఎగ్గొట్టలేదు.అయినా సరే తీరని అన్యాయం చేశారు. వైసీపీ కీలక నేత వై వి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి చెప్పినట్లుగా చేయాలని చెప్పారు. కనీసం మా మాటలను కూడా వినలేదు.
* ఉమ్మడి రాష్ట్రంలో 1999లో అప్పటి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం. కాకినాడ పోర్టును డెవలప్ చేసాం.జిఎంఆర్ తో కలిసి కాకినాడ సెజ్ ను ఏర్పాటు చేసాం. దీనికోసం కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేశాం. మా కంపెనీలో ఆదాయం 22 శాతం ప్రభుత్వానికి చెల్లించేలా అప్పట్లో ఒప్పందం కుదిరింది.
* 2019 వరకు అంత సవ్యంగానే నడిచింది. ఆ తరువాతే ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. మా సంస్థ ప్రభుత్వానికి 994 కోట్లు ఎగ్గొట్టినట్లు రిపోర్టులు చూపారు. అప్పుడే విజయసాయిరెడ్డి తో పాటు విక్రాంతి రెడ్డిని కలవాలని చెప్పారు. మమ్మల్ని బెదిరించి మా కంపెనీ షేర్లు అమ్మేందుకు సిద్ధపడ్డారు. బలవంతంగా లాక్కున్నారు. అంతా తమకే కట్టబెట్టాలని అరబిందో యాజమాన్యం వార్నింగ్ ఇచ్చింది. కుటుంబమంతా జైలుకు పంపిస్తామని హెచ్చరించడంతో భయపెట్టి విక్రయించాం. అంటూ సంచలన విషయాలు బయట పెట్టారు కెవి రావు. ఇప్పుడు ఇవే సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి.
మొత్తానికి కేవీ రావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి..ముగ్గురిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేసినప్పటికీ..ఈ వ్యవహారం అంతా ఎటు దారి తీస్తుందో..ఎలా విచారణ చేయాలో కూడా ఏపీ సర్కార్‌కు అంతు చిక్కడం లేదట. అసలు ఇంత దారుణంగా బిహేవ్ చేశారా అని షాక్ అయిపోతున్నారట. బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉంటూ అడ్డూ అదుపు లేకుండా ఏంటి ఇదంతా..చెప్పుకుంటూపోతే మరో ఐదేళ్లు అరాచకం ఫైల్స్ కంటిన్యూ అవుతుందంటున్నారు కూటమి నేతలు. అసలు కాకినాడ పోర్టు కబ్జా నిజమా.? లేదా.? రైస్ మాఫియాను గెలికితేనే పోర్టు కబ్జా వ్యవహారం బయటికి వచ్చిందా.? ఇదంతా బయట జరుగుతున్న ప్రచారమేనా..నెక్స్ట్ ఇది ఎటు టర్న్ తీసుకోబోతుందనేది అయితే ఇప్పటికి ఇంట్రెస్టింగ్గా మారింది.
Read : Pawan Kalyan | కాకినాడ పోర్టు లో పవన్ తనిఖీలు | Eeroju news