మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ #SDT18 గ్లింప్స్ డిసెంబర్ 12న

Sai Dharam Tej

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ #SDT18 డిసెంబర్ 12న గ్లింప్స్ & టైటిల్ అనౌన్స్ మెంట్

Sai Dharam Tej
 మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ‘విరూపాక్ష’, ‘బ్రో’ బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత, తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #SDT18 చేస్తున్నారు. డెబ్యుటెంట్ రోహిత్ కెపి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. హనుమాన్ సెన్సేషనల్ పాన్ ఇండియా విజయం తర్వాత నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
మేకర్స్ లేటెస్ట్ గా ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. డిసెంబర్ 12న #SDT18 టైటిల్ అనౌన్స్ మెంట్ & గ్లింప్స్ ని రిలీజ్ చేస్తున్నట్లు తెలియజేశారు.ఇప్పటికే విడుదలైన #SDT18 ఇంట్రూడ్ ఇన్‌టు ది వరల్డ్ ఆఫ్ ఆర్కాడీ” వీడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఓ అద్భుతమైన ప్రపంచాన్ని క్రియేట్ చేయడంలో ప్రొడక్షన్ టీమ్ డెడికేషన్ ని ఈ వీడియో ప్రజెంట్ చేసింది.
#SDT18 లో సాయి దుర్గ తేజ్ మునుపెన్నడూ చేయని పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. మోస్ట్ ట్యాలెంటెడ్ ఐశ్వర్య లక్ష్మి ఈ హై-ఆక్టేన్, పీరియడ్-యాక్షన్ డ్రామాలో సాయి దుర్గ తేజ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. సెన్సేషనల్ కంపోజర్ బి. అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించనున్నారు.  ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్-ఇండియా విడుదల కానుంది.
తారాగణం: సాయి దుర్గ తేజ్, ఐశ్వర్య లక్ష్మి, జగపతిబాబు, శ్రీకాంత్, సాయికుమార్, అనన్య నాగళ్ల

Read : Mr. Idiot | మిస్టర్ ఇడియ‌ట్‌ లో మాధ‌వ్‌, సిమ్రాన్ శ‌ర్మ‌పై లిరికల్ సాంగ్ చిత్రీకరణ | Eeroju news

Related posts

Leave a Comment