మార్చి 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్:National Lok Adalat on 8th March:రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం మార్చి 8వ తేదీ 2025 న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ తెలిపారు. సోమవారం ఏలూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనము నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో మార్చి 8వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని చెప్పారు.
మార్చి 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్..
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్..
ఏలూరు,ఫిబ్రవరి,3:
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం మార్చి 8వ తేదీ 2025 న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ తెలిపారు. సోమవారం ఏలూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనము నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో మార్చి 8వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ జాతీయ లోక్ అదాలత్ నందు రాజీయోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, వాహన ప్రమాద బీమా కేసులు, కుటుంబ వివాదాలు, చిట్ ఫండ్స్ వివాదాలు, బ్యాంకు లావాదేవీల కేసులు, టెలిఫోన్ బకాయిల కేసులు, మున్సిపల్ ఆస్తి మరియు నీటి పన్నుల కేసులను ఈ జాతీయ లోక్ అదాలత్ నందు రాజీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. అలాగే ప్రతి శనివారం అన్ని కోర్టులలో ప్రీ లోక్ అదాలత్ సిటింగ్స్ నిర్వహిస్తున్నారని, మరియు పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వ నిర్వహిస్తున్నారని ఏలూరు కోర్టు పరిధిలోని కేసులనే కాకుండా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఇతర కోర్టుల పరిధిలోని కేసులను కూడ ఆన్లైన్ విధానం ద్వారా ఈ మధ్యవర్తిత్వం ద్వారా హాజరై తమ కేసులను రాజీ చేసుకోవచ్చునని తెలిపారు. ఈ కేసులలో సమస్యలు ఎదురైన 08812-224555 ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించాలని తెలిపారు. గత డిశంబరు 14వ తేదీన నిర్వహించిన జాతీయ లోక్ అధాలతో వివిధ కేసులకు సంబంధించి 5,616 కేసులను పరిష్కరించుకొని కక్షిదారులు విముక్తి పొందారని, ఆదే విధంగా 2025 మార్చి 8వ తేదీన జాతీయ లోక్ అధాలత్ కు 3,746 కేసులను పరిష్కారానికి మధ్యవర్తిత్వం ద్వారా గుర్తించారని తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో గల 11 మండల లీగల్ సర్వీసెస్ కమిటీలతో కూడా కేసులను పరిష్కరించుకోవడానికి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అదే విధంగా ఇంకా కక్షిదారులు ఎవరైనా ఉంటే వారు కూడా మార్చ్ 8వ తేదీన జరిగే జాతీయ లోక్ అధాలత్ లో పరిష్కరించుకోవడానికి ముందుకు రావాలని తెలిపారు. కక్షి దారులు జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.