బీఆర్ఎస్ 10 ఏళ్లలో ప్రజలకు ఇల్లు ఇవ్వలేదు, రేషన్ కార్డు ఇవ్వలేదు మంత్రి సీతక్క

BRS has not given houses and ration cards to people in 10 years Minister Seethakka

బీఆర్ఎస్ 10 ఏళ్లలో ప్రజలకు ఇల్లు ఇవ్వలేదు, రేషన్ కార్డు ఇవ్వలేదు మంత్రి సీతక్క:పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క బుధవారం నాడు గాంధీభవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. తరువాత మీడియాతో మాట్లాడారు. గ్రామస్థాయిలో దరఖాస్తులను స్వీకరించతో పాటు గాంధీభవన్లో కూడా మంత్రులుగా దరఖాస్తులను స్వీకరిస్తున్నాం. నేను రెండోసారి మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం కోసం గాంధీభవన్ కి వచ్చాను

బీఆర్ఎస్ 10 ఏళ్లలో ప్రజలకు ఇల్లు ఇవ్వలేదు, రేషన్ కార్డు ఇవ్వలేదు
మంత్రి సీతక్క

హైదరాబాద్
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క బుధవారం నాడు గాంధీభవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. తరువాత మీడియాతో మాట్లాడారు.
గ్రామస్థాయిలో దరఖాస్తులను స్వీకరించతో పాటు గాంధీభవన్లో కూడా మంత్రులుగా దరఖాస్తులను స్వీకరిస్తున్నాం. నేను రెండోసారి మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం కోసం గాంధీభవన్ కి వచ్చాను. గతంలో ఏ పార్టీలో ఇటువంటి వ్యవస్థ లేదు.. ప్రజా ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావాణిని వారానికి రెండుసార్లు నిర్వహిస్తున్నాం. ప్రధానంగా భూ సామాజిక సమస్యలే అధికంగా వస్తున్నాయి. ఒకరి భూమి మరొకరి పేరు మీద నమోదయిందని ఫిర్యాదులు వస్తున్నాయి. కెసిఆర్ హయాంలో రుణమాఫీ కానీ ఎంతో మంది రైతులు తమ రుణాలను మాఫీ చేయాలని దరఖాస్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 21 వేల కోట్ల రుణాలను మాఫీ చేశాం. కెసిఆర్ హయంలో 2016లో తీసుకున్న రుణాలు లక్షల మంది రైతులకు మాఫీ కాలేదు. 10 ఏళ్లలో ప్రజలకు ఇల్లు ఇవ్వలేదు, రేషన్ కార్డు ఇవ్వలేదు. అందుకే ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కోరుతున్నారు. మాకు వచ్చిన వినతులను సంబంధిత అధికారులకు చేరవేస్తాం. మీ సమస్యల కోసం స్థానిక అధికారులను సంప్రదించండని అన్నారు. ప్రజల నుంచి స్పందన బాగా వస్తుంది. ప్రభుత్వ పథకాలు నిరంతర ప్రక్రియ.. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రేపు కాంగ్రెస్ ఎమ్మెల్యే లతో సీఎం సమావేశం అవుతున్నారు. దీని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని అన్నారు.

ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎమ్మెల్యేలు సమావేశం అవుతూనే ఉంటారు. 1931లో కుల గణన జరిగింది.. ఆ తర్వాత అత్యంత శాస్త్రీయంగా ఇప్పుడు కుల గణన చేశామని అన్నారు.
గతంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఆశాస్త్రీయంగా, అసంబద్ధంగా చేశారు. లిమ్కా బుక్ రికార్డు కోసం ఒక్కరోజు సర్వే పేరుతో పైపైనే సర్వే చేశారు. సొంత కుటుంబ గణన కేసీఆర్ చేశారు తప్ప.. కుల గణన చేయలేదు. మేము చేపట్టిన కులగలను బహిష్కరించాలని టిఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఇప్పుడు కుల గణన లెక్కల గురించి అడిగే హక్కు బీఆర్ఎస్ కి లేదు. బిసి సమాజం టిఆర్ఎస్ ను ప్రశ్నించాలి. టిఆర్ఎస్ లో ముఖ్యమంత్రి పదవి పార్టీ అధ్యక్ష పదవి ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు. కనీసం 20 ఏళ్లలో ఒక బీసీ నేతకు పదవులు ఇవ్వలేదు. ఎదిగిన బీసీలను పార్టీ నుంచి బయటికి పంపించారు. నరేంద్ర నుంచి రాజేంద్ర వరకు అందరినీ అవమానాల పాలు చేసి బయటకి పంపారు. ఇప్పుడు మా సర్వేను ప్రశ్నిస్తున్న టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, తమ హయాంలో ఎందుకు కులగనన సమగ్రంగా చేయలేదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కులగణనల్లో ఎందుకు పాల్గొనలేదు. దొరలు తమ వివరాలు నమోదు చేసుకోకపోతే వారికి నష్టం లేదు. అయన మాటలు నమ్మి గణనలో వివరాలు నమోదు చేసుకొని బీసీ లే నష్టపోయారు. ఇప్పుడు మేము చేసిన కుల గణన సమాచారం ఆధారంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తాం. కుల గణన లో ఎక్కడ లెక్క తప్పలేదు. ఆయా సామాజిక వర్గాల లెక్కలు పక్కాగా తేలాయని అన్నారు. కుల గణన సర్వే సరిగా లేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడటం ఆయనకే వదిలేస్తున్నాం. అభ్యంతరాలు ఉంటే పార్టీ వేదికల మీద మాట్లాడాలి తప్ప ఇలా బహిరంగంగా మాట్లాడడం మంచిది కాదు. ఆయన సంగతి పార్టీ చూసుకుంటుంది. ప్రజల సంతోషాన్ని చూసి ఓర్వలేక దీన్ని అడ్డుకోవాలని కులగననను, వర్గీకరణను కొందరు వక్రీకరిస్తున్నారు. 30 ఏళ్ల ఎస్సీ వర్గీకరణ పంచాయతీని తెంచాము, ఎవరి వాట వారికి పంచాం. బీసీల లెక్క 56% కి పైగా తేలింది. ఎక్కడ ఎవరికీ నష్టం జరగలేదు. మేక వన్నె పులిలా టిఆర్ఎస్ నేతలు బిసి ల హక్కులను అడ్డుకుంటున్నారని అన్నారు.

Read more:ఇక ముంబై, బెంగళూరు, చెన్నైలకు గంటే..  వచ్చేస్తున్నాయ్.. బుల్లెట్ ట్రైన్స్

Related posts

Leave a Comment