ప్రజావాణి లో 154 అర్జీలు
సెలవు దినం అయినా కొనసాగిన ప్రజావాణి
హైదరాబాద్
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్లో శుక్రవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో 154 అర్జీలు అందాయి.
ప్రజావాణి ఇన్చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వివిధ అంశాలపై సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి, అర్జీలపై ఎండార్స్ మెంట్ చేసి చిన్నారెడ్డి, దివ్య సమస్యలను పరిష్కరించారు.మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం సెలవు దినంగా ప్రకటించినప్పటికీ ఈ సమాచారం తెలియక వచ్చిన ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా కొనసాగించారు.పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించి 59, విద్యుత్ శాఖకు 26, రెవెన్యూ శాఖకు 18, హోం శాఖకు 8, వ్యవసాయ శాఖకు 5, ఇతర శాఖలకు సంబంధించి 38 అర్జీలు ప్రజావాణికి అందాయి