పెద రాయుడు ఇంట్లో పెద్ద పంచాయితీ
తిరుపతి, డిసెంబర్ 10, న్యూస్ పల్స్)
సినీ యాక్టర్ మంచు మోహన్ బాబు కుటుంబంలో హైడ్రామా కొనసాగుతుంది. కుటుంబంలో విభేదాలు తలెత్తాయని నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. మశిక్షణకు పెట్టింది పేరు, సమయపాలనకు మారు పేరు, గౌరవమర్యాదలకు ఇంటి పేరు అని చెప్పుకునే యాక్షన్ కింగ్ మంచు భక్తవత్సల నాయుడు.. అదేనండి మంచు మోహన్ బాబు కుటుంబంలోని విభేదాలు ఒక్కసారి బ్లాస్ట్ అయ్యాయి. తెలుగు ఇండస్ట్రీలో చాలా క్రమశిక్షణతో కూడుకున్న ఫ్యామిలీ అని మంచు కుటుంబానికి ఇన్ని రోజులు ఒకింత మంచి పేరే ఉండేది. అందుకు కారణం మోహన్ బాబు డిసిప్లేన్ అని చెప్తుంటారు. ఆయన పెంపకంలో పెరిగిన పిల్లలు కూడా అంతే డిసిప్లేన్‌గా ఉంటారని అందరూ అనుకుంటారు. ఇన్నాళ్లూ అలాగే ఉన్నారు కూడా.మంచు మోహన్ బాబుకు.. మంచు విష్ణు, మంచు లక్ష్మీ ప్రసన్న, మంచు మనోజ్.. ముగ్గురు పిల్లలు అని అందరికీ తెలిసిన విషయమే. ముగ్గురికీ పెళ్లిళ్లయి.. అందరికీ పిల్లలు కూడా ఉన్నారు. అందులో మనోజ్‌కు మొదటి భార్యతో విడాకులై.. భూమ అఖిల ప్రియ సోదరి మౌనికను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్లకు కూడా ఓ పాప జన్మించింది. అది వేరే విషయం అనుకోండి. అయితే.. గత కొంత కాలంగా మంచు వారి ఫ్యామిలో గొడవలు జరుగుతున్నట్టు లీకులు వస్తున్నాయి. ఆ మధ్య మనోజ్ ఇంటికి వచ్చి విష్ణు దాడి చేశాడంటూ ఓ వీడియో విడుదల చేసి.. మళ్లీ అదంతా ఉత్తుత్తిదే.. ప్రాంక్.. రియాల్టీ షో అని ఏదేదో చెప్పి బయటికి రాకుండా బాగానే కవర్ చేశారు. కట్ చేస్తే.. ఎన్నాళ్ల నుంచి రగులుతుందో కానీ.. మంచువారి విభేదాలు బయటపడ్డాయి. కేవలం బయటపడటమే కాదు.. పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది వాళ్ల పంచాయితీ.మంచు మనోజ్ పై మోహన్ బాబు మనుషులు దాడి చేశారని డయల్ 100 నెంబర్ కు ఫోన్ కాల్ వచ్చింది. అదే సమయంలో మోహన్ బాబు ఇంటి నుంచి కూడా పోలీసులకు కాల్ వచ్చిందంటున్నారు. అయితే మంచు ఫ్యామిలీలో జరుగుతున్న ఈ పరిణామాలు ఆ కుటుంబాన్ని వీధికెక్కించాయి. మంచు మనోజ్ గాయపడి నిన్న ఆసుపత్రిలో చికిత్స కూడా చేయించుకున్నారు. వైద్యుల నివేదికలో మంచు మనోజ్ కు స్వల్ప గాయాలయ్యాయని కూడా తెలిసింది. పోలీసులు మాత్రం ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ ఆఫ్ ది రికార్డుగా వారు చెబుతన్నారు.
మంచు మోహన్ బాబు ఇంట్లో గొడవలు ఆస్తికి సంబంధించినవేనన్న ప్రచారం జరుగుతుంది. తిరుపతిలోని విద్యాలయానికి సంబంధించిన ఆస్తుల వివాదమే గొడవలకు కారణమని చెబుతున్నారు. మోహన్ బాబు తన ఆస్తులను పంచి పెట్టినప్పటికీ తిరుపతిలో ఉన్న ఆయన యూనివర్సిటీకి సంబంధించిన పంపకాలు జరగలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మనోజ్ కు, మోహన్ బాబు మనుషులకు మధ్య గొడవలు జరిగినట్లు పెద్దయెత్తున నిన్నంతా ప్రచారం జరిగింది. కానీ మోహన్ బాబు టీం మాత్రం నిన్న ఈ మంచు కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని, ఇంట్లో గొడవలు ఏమీ జరగలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆ ప్రచారాన్ని నమ్మవద్దని, తప్పుడు వార్తలు ప్రచురించవద్దంటూ కోరింది. అయితే జరుగుతున్న పరిణామాలు మాత్రం జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంట్లో మాత్రం ఏదో గొడవ జరిగిందని మాత్రం అర్థమవుతుంది. . మనోజ్ మాత్రం తన భార్యను తీసుకుని.. ఆస్పత్రికి కుంటుతూ వెళ్లి.. మీడియాకు ఫుల్ కవరేజే ఇచ్చాడు. దీంతో.. మంచు ఫ్యామిలీ ఏదో మతలబు జరుగుతోందని అందరూ కళ్లు పెద్దవి చేసుకుని వాళ్లింటిపై గట్టిగా ఫోకస్ పెట్టారు. పోలీసులకు మనోజ్ కంప్లైంట్ ఇవ్వటం.. ఆ వెంటనే మనోజ్ మీద మోహన్ బాబు ఫిర్యాదు చేయటంతో అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. ఆస్తి విషయంలోనే వీళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయని స్పష్టమైపోయింది. ముందుగా మనోజ్ పోలీసులు ఫిర్యాదు చేశాడు. తన మీద కొంతమంది గుర్తుతెలియను దుండగులు దాడి చేశారని.. వాళ్లెవరో చూద్దామంటే.. పారిపోయారని.. ఎవరో దర్యాప్తు చేయాలంటూ కంప్లైంట్ చేశారు. ఆ వెంటనే.. తన కొడుకూ కోడలు (మనోజ్, మౌనిక) నుంచి తన ప్రాణానికి, తన ఆస్తులకు భద్రత లేదని.. రక్షణ కల్పించాలంటూ పోలీసులకు మోహన్ బాబు విజ్ఞప్తి చేస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనోజ్, మౌనిక.. అసాంఘీక శక్తులతో కలిసి తనపై దాడికి ప్రయత్నిస్తున్నారంటూ పోలీసులకు మొరపెట్టుకున్నారు. చాలా పెద్ద లేఖను జత చేయటం గమనార్హం.
మంచు మనోజ్ గాయాలు పాలు కావడంతో పాటు ఈరోజు తిరిగి 30 మంది బౌన్సర్లు అక్కడకు చేరుకుంటుండటం కూడా ఈ ప్రచారానికి మరింత ఊతమిస్తుంది. చాలా రోజులుగా అతిపెద్ద బడ్జెట్‌తో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్.. “కన్నప్ప”ను భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్నారు. అతిభారీగా ఖర్చుపెడుతున్న ఈ సినిమా నుంచి ఆ మధ్య శివయ్యా.. అంటూ ఓ టీజర్ కూడా వదిలారు. మరి.. ఉన్న ఆస్తినంతా పణంగా పెట్టి ఈ సినిమా తీస్తున్నాడని అన్న మీద తమ్ముడు ఏమైనా గుర్రుగా ఉన్నాడా.. లేదా రెండో పెళ్లి చేసుకుని తనకు తలవంపులు తీసుకొచ్చాడని చిన్న కొడుకును తండ్రి దూరం పెట్టాడా..? ఇంతకూ అంతా మంచివాళ్లే ఉంటే ఈ మంచు ఫ్యామిలీకి ఎక్కడ చెడింది. మరి ఈ కుటుంబంలో విధేయతతో ఉండే కన్నప్ప ఎవరు.. వెన్నెంటే ఉంటూ కరెక్ట్ టైం చూసి వెన్నుపోటు పొడితే కట్టప్ప ఎవరన్నది తెలియాలంటే.. స్టే ట్యూన్డ్ టూ మంచు వారి ఇంట్లో రగులుతున్న కుంపటి.
Read : నాగబాబుకు మంత్రి పదవి