తెలంగాణలో కొత్త RTC బస్టాండ్లు I బస్సు కోసం ఎదురు చూడాల్సిన పనిలేదు:తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మహాలక్ష్మీ పథకం కింద ఫ్రీ బస్సు జర్నీ సౌకర్యం కల్పిస్తుండగా.. ఈ స్కీం అందుబాటులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. గతంలో రోజుకు 30 లక్షల మంది బస్సుల్లో ప్రయాణిస్తే.. ఇప్పుడు ఆ సంఖ్య డబుల్ అయింది. ఇక జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చే వారి సంఖ్య కూడా రెట్టింపు అయింది. ఏ చిన్న పని ఉన్నా.. ప్రజలు ఫ్రీ బస్సుల్లో నగరానికి వచ్చేస్తున్నారు. దీంతో ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు ఏర్పాటు చేయగా.. ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి అవి వివిధ జిల్లాలకు రాకపోకలు సాగిస్తున్నాయి.
తెలంగాణలో కొత్త RTC బస్టాండ్లు I బస్సు కోసం ఎదురు చూడాల్సిన పనిలేదు
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మహాలక్ష్మీ పథకం కింద ఫ్రీ బస్సు జర్నీ సౌకర్యం కల్పిస్తుండగా.. ఈ స్కీం అందుబాటులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. గతంలో రోజుకు 30 లక్షల మంది బస్సుల్లో ప్రయాణిస్తే.. ఇప్పుడు ఆ సంఖ్య డబుల్ అయింది. ఇక జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చే వారి సంఖ్య కూడా రెట్టింపు అయింది. ఏ చిన్న పని ఉన్నా.. ప్రజలు ఫ్రీ బస్సుల్లో నగరానికి వచ్చేస్తున్నారు. దీంతో ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు ఏర్పాటు చేయగా.. ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి అవి వివిధ జిల్లాలకు రాకపోకలు సాగిస్తున్నాయి.
అయితే అదనపు ప్రయాణికులు, బస్సులతో ఎంజీబీఎస్పై ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతం ఎంజీబీఎస్ నుంచి తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాలకు 4 వేలు బస్సులు 1.2 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఇక వీకెండ్ డేస్‌లో 1.5 లక్షలు, పండగలు, వరుస సెలవులు ఉంటే దాదాపు 1.8 లక్షల మంది వరకు ఎంజీబీఎస్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. దీని వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. శివారు ప్రాంతాల్లో ఉండేవారు కూడా ఎంజీబీఎస్ బస్టాండ్‌కు వచ్చి బస్సులు ఎక్కాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో కొత్తగా మూడు బస్టాండ్లు నిర్మించాలని యోచిస్తోంది.
ప్రస్తుతం ఆరాంఘర్ చౌరస్తా నుంచి దాదాపు 1500 వరకు బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఆ రూట్లో మహబూబ్‌నగర్, కర్నూల్, బెంగళూరు ప్రాంతాలకు వెళ్లేవారు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఎంజీబీఎస్ బస్టాండ్‌పై రద్దీని తగ్గించేందుకు ఆరాంఘర్ చౌరస్తాలో అత్యాధునిక హంగులతో బస్టాండ్ నిర్మించాలని భావిస్తోంది. దాంతో పాటుగా.. ఉప్పల్ ప్రాంతానికి వరంగల్, నల్గొండ జిల్లాల నుంచి, ఎల్బీనగర్ ప్రాంతానికి నల్గొండ, ఏపీలోని పలు జిల్లాల నుంచి ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో బస్సులు ఎంజీబీఎస్ నుంచి నడపకుండా నగర శివారు ప్రాంతాలైన ఎల్బీనగర్, ఉప్పల్ ప్రాంతాల నుంచే నడపాలని యోచిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఇక్కడ కూడా బస్ స్టాండ్లు నిర్మించాలని యోచిస్తున్నారు.
సిటీ బస్సు ప్రయాణికులకు బస్సు కోసం ఎదురు చూడాల్సిన పనిలేదు
హైదరాబాద్‌లో బస్సు ప్రయాణాలు చేసేవారికి గుడ్‌న్యూస్. నిమిషాలకొద్దీ బస్సుల కోసం ఎదురు చూడాల్సిన పనిలేదు. బస్సు మిస్ అవుతుందన్న టెన్షన్ కూడా లేదు. ఇంట్లో ఉండే ప్రశాతంగా మీరు ఎక్కాల్సిన బస్సు ఎక్కడుందో ఈజీగా తెలుసుకోవచ్చు. ఆ బస్సు బస్టాండ్‌కు ఎంతసేపట్లో వస్తుందో తెలుసుకొని తీరిగ్గా.. అక్కడకు చేరుకోవచ్చు. అందుకోసం జీహెచ్ఎంసీ బస్ ఇన్ఫర్మేషన్ సిస్టం పేరుతో సరికొత్త యాప్ రూపొందిస్తుంది. ఒకవేళ మీ చేతిలో స్మార్ట్‌ఫోన్ లేకపోయినా..ఫర్వాలేదు. బస్టాపుల్లో నిల్చుని పైకి చూస్తే చాలు ఏ బస్సు ఎప్పుడు వస్తుందో నిమిషాలతోసహా.. క్లియర్‌గా అక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది. హైదరాబాద్ సిటీని స్మార్ట్‌గా మార్చే కీలక చర్యల్లో భాగంగా ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తన్నారు.
బస్సులను ట్రాక్ చేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 2,800 బస్సుల్లో జీపీఎస్ సిస్టం అమర్చనున్నారు. తర్వాత బస్టాప్‌లలో ఉండే స్క్రీన్లు, ప్రత్యేక యాప్‌కు కనెక్ట్ చేస్తారు. స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ తెలియని వారి కోసం నగరవ్యాప్తంగా 1,250 బస్టాపుల్లో ప్రత్యేకంగా డిస్ప్లే స్క్కీన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ స్ర్కీన్లపై ఆయా రూట్లలోని బస్సు నంబర్లతో పాటు ఏ ప్రాంతం నుంచి వస్తోంది.. అది ఏ ఏరియాకు వెళ్తుందనే సమాచారం కనిపిస్తుంది. ప్రస్తుతం బస్సు ఏ ఏరియాలో ఉంది? ఎంత సేపట్లో బస్టాప్‌కు వస్తుందో కూడా డిస్ప్లే అవుతుంది. దీంతో పాటుగా యాప్‌లో బస్సుల లైవ్ లోకేషన్‌ను ఈజీగా తెలుసుకోవచ్చు. అందుకోసం జీహెచ్ఎంసీ ఆర్టీసీతో కలిసి పని చేస్తోంది. నెలరోజుల్లో ఈ డిస్ప్లే బోర్డుల ఏర్పాటుకు టెండర్లు పూర్తి చేసి, తర్వాత మరో నెలలో సాప్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఈ కొత్త పద్ధతి ద్వారా భారం పడకుండా PPP మోడ్‌లో ఆపరేట్ చేసేందుకు జీహెచ్ఎంసీ అడ్వర్టైజ్మెంట్ విభాగం అధికారులు కసరత్తు చేస్తోంది. డిస్ప్లేల బాధ్యతలను టెండర్ల ద్వారా ఏజెన్సీలకు అప్పగించనున్నట్లు తెలిపారు. బస్టా్ప్ల్లో ఏర్పాటు చేసే స్క్రీన్ కింద, పై భాగంలో అడ్వర్టైజ్మెంట్లకు ఖాళీ స్థలం వదలనుండగా.. వాటి ద్వారా ఆదాయం పొందాలని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు. దీని ద్వారా వచ్చే ఆదాయం ద్వారానే స్క్రీన్లు, యాప్ మెయింటెనెన్స్ చేయనున్నట్లు సమాచారం. కాగా, బస్సుల్లో సమయానికి స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లేవారికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు.