తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్తIGood news for Tirumala Srivari devotees

Good news for Tirumala Srivari devotees

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్తIGood news for Tirumala Srivari devotees:తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ తీపికబురు అందించింది. మూడు రోజులుగా నిలిపివేసిన దర్శన టికెట్ల జారీ మళ్లీ ప్రారంభమవుతుంది. రథసప్తమి కారణంగా టీటీడీ సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసిన సంగతి తెలిసిందే. సోమ, మంగళ, బుధవారాల్లో టోకెన్లు జారీ చేయలేదు.

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్తIGood news for Tirumala Srivari devotees

తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ తీపికబురు అందించింది. మూడు రోజులుగా నిలిపివేసిన దర్శన టికెట్ల జారీ మళ్లీ ప్రారంభమవుతుంది. రథసప్తమి కారణంగా టీటీడీ సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసిన సంగతి తెలిసిందే. సోమ, మంగళ, బుధవారాల్లో టోకెన్లు జారీ చేయలేదు. అయితే ఈ టోకెన్లను బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత నుంచి జారీ చేయనున్నారు. తిరుమల శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించి సర్వ దర్శన టోకెన్లు పొందవచ్చు. రథసప్తమికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.. ఈ క్రమంలో టీటీడీ సర్వదర్శనం టోకెన్ల జారీని మూడు రోజుల పాటూ నిలిపివేసింది.

మరోవైపు తిరుమల శ్రీవారు రథసప్తమి సందర్భంగా మంగళవారం (ఫిబ్రవరి 4న) సప్తవాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి వాహనసేవలు వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, గోవిందనామస్మరణలు, కర్పూరహారతులు, భజన, నృత్య, వాద్య బృందాల ప్రదర్శనలతో నాలుగు మాడవీధుల్లో కొనసాగాయి. ఆ తర్వాత రథసప్తమి సందర్భంగా.. మంగళవారం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య చక్రస్నానం వైభవంగా జరిగింది. శ్రీ వరాహస్వామివారి ఆలయం వద్ద గల స్వామిపుష్కరిణిలో చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తెనె, చందనంతో అర్చకులు అభిషేకం నిర్వహించారు.

తిరుచానూరులో వైభవంగా రథసప్తమి వేడుకలు

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో మంగ‌ళ‌వారం రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉదయం భానుని రేఖలు సూర్యప్రభ వాహనంలో కొలువైన అమ్మ‌వారిపై ప్రసరించడాన్ని భక్తులు దర్శించుకుని ఆనందపరవశులయ్యారు. ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల వరకు అమ్మవారు హంస, అశ్వ, గరుడ, చిన్నశేష వాహనాలపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 3.30 నుంచి 4.30 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంలతో అమ్మవారిని విశేషంగా అభిషేకించారు. సాయంత్రం 6 గంటల నుంచి అమ్మవారు చంద్రప్రభ, గజ వాహనంపై దర్శనమిచ్చారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీసూర్యనారాయణస్వామివారి ఆలయంలో ఉదయం 6 గంటలకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచారపరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల బృందాల కోలాటాలు, చెక్కభజనలు, భక్తులను ఆకట్టుకున్నాయి.

సప్త వాహ‌నాల‌పై శ్రీ గోవిందరాజస్వామి కటాక్షం
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి, అమ్మవార్లు స‌ప్త వాహనాలపై విహ‌రించి భక్తులను కటాక్షించారు. మంగ‌ళ‌వారం తెల్లవారుజామున 3 గంటలకు శ్రీచక్రత్తాళ్వార్‌ను ఊరేగింపుగా శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలోని ఆళ్వారు తీర్థానికి వేంచేపు చేసి చక్రస్నానం నిర్వహించారు. అనంతరం ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహన సేవలు ప్రారంభమయ్యాయి. వరుసగా సూర్యప్రభ, హంస, హనుమంత, పెద్దశేష, ముత్యపుపందిరి, సర్వభూపాల వాహనాలపై స్వామివారు భక్తులకు కనువిందు చేశారు. సాయంత్రం 7 నుంచి రాత్రి 8.30 గంటల వరకు విశేషమైన గరుడవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

మాడవీధులు కిటకిట

సోమవారం సాయంత్రం గ్యాలరీల్లోకి భక్తుల ప్రవేశం మొదలైంది. అర్ధరాత్రి ఉత్తరమాఢవీధి పూర్తిస్థాయిలో నిండిపోగా, మంగళవారం వేకువజామునకు పడమర, దక్షణ, తూర్పు మాడవీధులు, శ్రీవారి ఆలయం ముందు భాగం భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఎండకు, చలికి ఇబ్బంది లేకుండా మాడవీధుల్లోని గ్యాలరీలపై షెడ్లు వేయడంతో ముందు రోజు సాయంత్రం నుంచీ మంగళవారం రాత్రి దాకా భక్తులు ఒక్కో వాహనాన్ని తిలకిస్తూ కూర్చుండిపోయారు. టీటీడీ అన్నప్రసాదాలు, తాగునీరు అందించడంతో ఇబ్బందిలేకుండా గడిపారు. రాంభగీచ అతిథిగృహాల వద్ద మాత్రం యాత్రికులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. అక్కడక్కడ గేట్లకు తాళాలు వేయడంతో అగచాట్లు పడ్డారు.

కంగారు పెట్టిన గొడుగు

చిన్నశేష వాహనంలో గొడుగు జారడం అధికారు ల్లో కంగారు పుట్టించింది. వాహనమండపం, పుష్కరి ణి మధ్యలో వాహనబేరర్లు వాహనాన్ని పైకి, కిందకు ఊపుతూ వేగంగా నడవడంతో ఉత్సవమూర్తికి ఎడమ వైపునున్న అర్చకుడి చేతి నుంచి గొడుగు కిందకు జారింది. అయితే వెంటనే అర్చకుడు అప్రమత్తమై గొడుగును పైకి ఎత్తి దాని స్థానంలో ఉంచడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Read more:తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్తIGood news for Tirumala Srivari devotees

Related posts

Leave a Comment