ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు:Chandrababu in Delhi Assembly election campaign

Chandrababu in Delhi Assembly election campaign

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు:Chandrababu in Delhi Assembly election campaign:ఎన్డీయే భాగస్వామి, టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షం బీజేపీ తరఫున ప్రచారానికి వెళ్లారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న ఆయన.. తెలుగువారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరిన చంద్రబాబు.cms. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌)పై విమర్శలు గుప్పించారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు

ఎన్డీయే భాగస్వామి, టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షం బీజేపీ తరఫున ప్రచారానికి వెళ్లారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న ఆయన.. తెలుగువారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరిన చంద్రబాబు.. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌)పై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో ఆప్ సర్కారు విఫలమైందని దుయ్యబట్టారు. ఇదే సమయంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటోందని అన్నారు.

ఢిల్లీ ప్రజలకు తాగునీరు అందించడంలో కేజ్రీవాల్ ప్రభుత్వం విఫలమైతే.. మోదీ మాత్రం అమృత్ పథకం కింద స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేని దద్దమ్మ ప్రభుత్వం ఆప్‌దని బాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ దుర్గంధభరితంగా ఉండటానికి కారణం ఎవరని ఏపీ సీఎం ప్రశ్నించారు. యమున నదిని ప్రక్షాళన చేస్తామని గత 10 ఏళ్లుగా చెబుతున్నారని కానీ చేయలేకపోయారని విమర్శించారు. యమున ప్రక్షాళన జరగాలంటే మోదీకే సాధ్యమని చంద్రబాబు ఉద్ఘాటించారు.

‘పదేళ్లకుపైగా అధికారంలో ఉన్న ఆమ్ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజలకు కనీసం స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వలేకపోయింది. దేశం స్వచ్ఛ భారత్‌లో దూసుకుపోతుంటే ఢిల్లీ మాత్రం మురికి కూపంలోకి వెళ్లిపోతోంది. ఢిల్లీలో వాతావరణ కాలుష్యంతో పాటు పొలిటికల్ పొల్యూషన్ కూడా ఉంది. 1995లో హైదరాబాద్ ఉన్నట్లు ఇప్పుడు ఢిల్లీ కూడా ఉంది. అభివృద్ధి రాజకీయాలు, జీవన ప్రమాణాలు పెరగాలంటే కమలం గుర్తును గెలిపించుకోవాలి. ఊపిరిపీల్చుకోవాలంటే మోదీ ఆక్సీజన్ కావాలి’ అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో బీజేపీ అభ్యర్ధుల తరపును తెలుగు ఓటర్లు ఉండే ప్రాంతంలో ప్రచారం చేశారు. తెలుగు ప్రజలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు.

బీజేపీ గెలుపులో తెలుగువారు భాగమవ్వాలి

‘ఢిల్లీలో ఇంతమంది తెలుగువారు ఉంటారని అనుకోలేదు. ఢిల్లీలో స్థిరపడ్డ ప్రతి తెలుగు ఓటరు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలి. తెలుగువారు ఢిల్లీలోనే కాదు… ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు ఇది భారతీయులు, తెలుగువారి సత్తా. పెట్టుబడుల కోసం ఇటీవల దావోస్ వెళ్లినప్పుడు 650 మంది అక్కడ ఉన్నారు. ఏఐ, గ్రీన్ ఎనర్జీని ప్రధాని మోదీ ప్రమోట్ చేస్తున్నారు. 1995లో ఐటీ గురించి మాట్లాడాను… ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నాను. ఢిల్లీలోని ప్రజలు, ప్రత్యేకంగా తెలుగు తమ్ముళ్లు, చెళ్లెల్లు ఇంటింటికెళ్లి బీజేపీ గెలుపు.. దేశ చరిత్రకే ఒక మలుపు అని చెప్పాలి. ఐటీలో భారతీయులను ఢీ కొట్టే వారు ఎవరూ లేరు. నా తమ్ముళ్లు ప్రపంచంతా దూసుకుపోతున్నారు. దేశానికి యువత పెద్ద ఆస్తి. సరైన సమయంలో మన దేశానికి సరైన నాయకుడిగా మోదీ ఉన్నారు. మన దేశ బ్రాండ్ మార్మోగడానికి కారణం ప్రధాని మోదీ. 11 ఏళ్లుగా సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణల్లో దేశాన్ని శరవేగంతో ముందుకు తీసుకెళ్తున్నారు. వికసిత్ భారత్ లో భాగంగా 2047 కల్లా దేశం నెంబర్ వన్ అవుతుంది. భారతీయులు శక్తివంతమైన జాతిగా మారతారు. కానీ ఢిల్లీకొస్తే చాలా బాధ కలుగుతోంది. డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చి ఉండుంటే వాషింగ్టన్, న్యూయార్క్‌ను ఢిల్లీ తలదన్నేది. ఉద్యోగాల కోసం ఇక్కడి నుంచి చాలామంది హైదరాబాద్, బెంగళూరు వెళ్లాలని చూస్తున్నారు. దీనికి కారణం ఇక్కడి పాలకులు.

మనకు కావాల్సింది ఆయారాంలు గయారాంలు కాదు.. రాజభవనాలు కట్టుకునే వాళ్లు కాదు… ప్రజల కోసం పనిచేసేవాళ్లు కావాలి.. అభివృద్ధి జరగాలంటే బీజేపీని గెలిపించాలి… కమలం గుర్తుకు ఓటేయాలి… 1995లో హైదరాబాద్ ఎలా ఉండేదో ప్రస్తుతం ఢిల్లీ అలా ఉంది.. ఇక్కడ గాలి కాలుష్యమే కాదు రాజకీయ కాలుష్యం కూడా ఉంది.. పేదలు శాశ్వతంగా మురికవాడల్లోనే ఉండిపోకూడదంటే ఆలోచించాలి’ అని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో సోమవారంతో ప్రచారానికి తెరపడనుంది. ఫిబ్రవరి 8న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు.

Read more:నాటి హైదరాబాద్‌లా.. ఢిల్లీలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం 

Related posts

Leave a Comment