కొడాలిపై కేసులు తిరగదోడుతున్న పోలీసులు
విజయవాడ, డిసెంబర్ 9, (న్యూస్ పల్స్)
వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం బూతులతో విపక్ష నేతలపై చెలరేగిపోయిన మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల మేరకు అప్పుడప్పుడూ బయటకు వచ్చి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నా.. ఆయన మాటల్లో ఇది వరకటి ఫైర్ కనిపించడం లేదు. కేసుల భయంతోనే ఆయన సైలెంట్ అవుతున్నారన్నది ఓపెన్ సీక్రేట్టే. కొడాలి నాని సైలంట్ మోడ్‌లో ఉన్నంత మాత్రాన మంత్రి నారా లోకేష్ రెడ్‌బుక్ ఛాప్టర్లో ఆయన పేజీ చిరిగిపోలేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కొడాలి నాని అనుచరులను పోలీసులు వరుసగా అరెస్టులు చేస్తున్నారు. అధికారంలో ఉండగా ఆ మాజీ మంత్రి గ్యాంగ్ చేసిన అరాచకాలపై పోలీసులు చర్యలు చేపట్టారు. తాజాగా 9 మంది కొడాలి నాని అనుచరులను గుడివాడ పోలీసులు అరెస్ట్ చేశారు. 2022 డిసెంబర్లో వార టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై పెట్రోల్ ప్యాకెట్లతో దాడి చేసి అరాచకం సృష్టించారు. అప్పట్లో దానిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు.ఆ కేసుని తిరగదోడిన పోలీసులు వివిధ సెక్షన్ల కింద తిరిగి అభియోగాలు నమోదు చేసి కొడాలి నాని అనుచరులను అరెస్ట్ చేశారు. అప్పట్లో కొడాలి నాని అనుచరులకు గుడివాడ గడ్డం బ్యాచ్ అని పేరుండేది. ప్రస్తుత కేసులకు సంబంధించి .. ఆ గడ్డం బ్యాచ్‌లో కీ రోల్ పోషించిన కృష్ణాజిల్లా వైసీపీ అధ్యక్షుడు మెరుగుమాల కాళీ పరారీలో ఉన్నాడట. అతను అస్సాం రాష్ట్రానికి పరారైనట్లు గుర్తించిన పోలీసులు ప్రత్యేక బృందంతో గాలింపుచర్యలు చేపడుతున్నారంట.వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతల చేసినా అరాచకాలపై.. నమోదైన కేసులను పోలీసులు తిరగతోడుతున్నారు. వరుస అరెస్టులతో.. వైసీపీ అరాచక వాదుల వెన్నులో వణుకు మొదలైంది.
వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదన్న ఆరోపణలున్నాయి. ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా ఇష్టానుసారం వ్యవహరించారు. టీడీపీ కార్యకర్తలు మొదలుకుని నేతలు.. ఆఖరికి పార్టీ ఆఫీసులను కూడా ధ్వంసం చేసిన సందర్భాలు కోకొల్లలు. సీన్ కట్ చేస్తే.. ఐదంటే ఐదేళ్లలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో నాడు చెలరేగిపోయిన వారి భరతం పడుతున్నారు.ఇప్పటికే మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం, గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై జరిగిన దాడికి సంబంధించి వరుస అరెస్టులు జరుగుతుండగా.. కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారం బయటి తీశారు. దీంతో గుడివాడ వైసీపీ నేతలకు ఉచ్చు బిగుస్తోంది. మాజీ మంత్రి కొడాలి నాని టార్గెట్‌గా ఏపీ పోలీసులు చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలోకి ఉండగా కొడాలి నాని, ఆయన అనుచరులు గుడివాడ టీడీపీ నేతలు.. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావును తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. వంగవీటి మోహనరంగా వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని రావి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి మరీ వైసీపీ నేతలు బెదిరించారు. ఆఖరికి టీడీపీ కార్యాలయంలో ఉన్న రావి, ఇతర టీడీపీ నేతలపై కత్తులు, కర్రలు, ఇనుప రాడ్లు, పెట్రోల్ ప్యాకెట్లతో వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. అయితే ఇంత జరుగుతున్నా అప్పటి సీఐ ప్రోద్బలంతో పోలీసులంతా కొడాలి గ్యాంగుకే కొమ్మకాశారు.ఇప్పుడు సీన్ మారింది. దాడి తాలుకూ వీడియో ఫుటేజ్ ఆధారంగా నాటి దాడులపై కొడాలి నాని అనుచరులపై కేసులు నమోదు చేశారు. మరోవైపు గుడివాడ కే కన్వెన్షన్‌లో జరిగిన క్యాసినో వ్యవహారంపై నిజనిర్ధారణకు వచ్చిన టీడీపీ కమిటీపై జరిగిన దాడులకు సంబంధించి పోలీసులు తాజాగా విచారణ చేపట్టారు.
కొడాలి నాని క్యాసినో వ్యవహారంపై గుడివాడ వచ్చిన నిజ నిర్ధారణ కమిటీ నేతలపై దాడులు జరిగిన అందరికీ తెలిసిందే. కార్లు ధ్వంసం, గుడివాడ టీడీపీ కార్యాలయంపై దాడి, ఫర్నిచర్ ధ్వంసం ఘటనలలో నాడు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ నేతలపైనే పోలీసులు కేసులు నమోదు చేశారు.మొత్తానికి చూస్తే.. కొడాలి నాని టార్గెట్‌గా చర్యలకు ఏపీ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే నానిపై పలు కేసులు నమోదయ్యాయి. తాజాగా కొడాలి నాని అనుచరులను అరెస్ట్ చేయడంతో కొడాలి నానికి ముహూర్తం పెట్టేసిననట్లే అంటున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత జగన్ ప్రజాక్షేత్రంలోకి వస్తానంటు్నారు. అప్పుడు ఆయన బయటకు వచ్చినప్పుడే కొడాలి నాని అరెస్టుకి ముహూర్తం పెడతారన్న టాక్ వినిపిస్తుంది.