. అయోమయం గందరగోళం
– కొందరి పేర్లు గల్లంతు మరికొందరివి తప్పుడు అడ్రస్ లు
– అడ్రస్ లు దొరకడం లేదంటూ చేతులెత్తేసిన బీ ఎల్ ఓలు
– అధికారుల పర్యవేక్షణ లోపం, ఏంట్రీలో నిర్లక్ష్యం
– ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల ఆగచాట్లు
పెద్దపల్లి ప్రతినిధి:
అయోమయం గందరగోళం మధ్యన ఉదయం 8 గంటలకు ఎమ్మెల్సీ పట్టభద్రులు, టీచర్ల ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమైన అధికారుల నిర్లక్ష్యంతో కొత్తగా తమ పేర్లు నమోదు చేసుకున్న వారు, పాత పట్టభద్రుల ఎన్రోల్మెంట్ విషయంలో పలు లోపాలు స్పష్టంగా కనిపించాయి. ఇందులో కొందరి పేర్లు గల్లంతు కాగా మరికొందరివి తప్పుడు అడ్రస్ లతో నమోదు చేయడం గమనార్హం. దీంతో అడ్రస్ లు దొరకడం లేదంటూ బీ ఎల్ ఓలు చేతులెత్తేశారు. ఫోన్ ద్వారా అడ్రస్ లు వాకబు చేసుకోగా అమర్ నగర్ కు చెందిన ఓ పట్టభధ్రుని అడ్రస్ సుభాష్ నగర్ లోని మరో అడ్రస్ పేరు మీద రావడం విశేషం. మరి కొందరి అసలు ఓటరుగా నమోదు చేయనే లేదు. బీఎల్ ఓ లు కూడా రేపు పోలింగ్ ఉందనగా మరుసటి రోజు పోలింగ్ చిట్టీలు పంపిణి చేయడం కొసమెరుపు.
పట్టభద్రులకు ఆయా అభ్యర్థుల నుండి దండిగా ఫోన్ లు, మెసేజ్ లు వచ్చినా పోలింగ్ చిట్టీలు రాకపోవడంతో సదరు ఓటర్లు కూడా పట్టనట్లుగా వ్యవహారించారు.
మూడు నెలల ముందు నుండే జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశాలు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన మూడు నెలల ముందు నుండే జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి కోయ శ్రీహర్ష పలు శాఖల అధికారులు, సిబ్బందితో నిత్యం సమీక్షలు, సమావేశా లు నిర్వహించడం గమనార్హం. ఎక్కడ ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని అధికారులకు పలు మార్లు ఆదేశాలు జారీ చేశారు. కొత్త ఓటర్ల నమోదుపై కూడా ఆయా నమోదు కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు చేపట్టినా, అధికారుల నిర్లక్ష్యం మూలం గా తూతు మంత్రంగానే చేశారు. పేర్ల నమోదు మొదలుకొని, అడ్రస్ ల వరకు అంతా తప్పుల తడకనే. ఇక బీఎల్ ఓ ల విషయమైతే మరీ అద్వానంగా మారింది. కరెక్ట్ అడ్రస్ లు ఉన్న వారికి ఫోన్ లు చేసి వారి వద్దకే పిలిపించు కొని ఓటరు చిట్టీలు అందిం చారు. మీ ఇష్టం ఉంటే వచ్చి తీసుకెళ్లండి అనే తరహాలో ఓటర్లతో సంభాసించడం కూడా అధికారుల నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నది. జిల్లాలో దాదాపు 31 వేల గ్రాడ్యుయేట్ ఓటర్స్, 1100 మంది టీచర్ ఓటర్స్ ఉన్నారు. ఎన్నికల భాద్యతలు తీసుకున్న అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయడం మరిచి పోయారు. అక్కడ అడ్రస్ ల నమోదు, ఇక్కడ బీఎల్ ఓల పనితీరుపై పలువురు పట్టభద్రులు ఆగ్రహం వ్యక్తం చేయడం పలు పోలింగ్ కేంద్రాల వద్ద కనిపించింది. దీనిపై జిల్లా ఎన్నికల అధికారులు దృష్టి సారించా లని పలువురు పట్టభద్రులు కోరుతున్నారు.
ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితి ఎలా ఉంటుందోనని పలువు రు చర్చించుకోవడం కనిపించింది.
కాంగ్రెస్ నుండి ఓటుకు రూ. 1500 అంటూ జోరుగా ప్రచారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయించే బాధ్యతను ఆయా వార్డుల మాజీ కౌన్సిలర్లు, వార్డు ఇంచార్జిలకు అప్పగించా రు. ఇక వారి వద్ద ఉన్న డేటా మేరకు సదరు ఓటరుకు రూ. 1500 పంచినట్లుగా విశ్వసనీయ సమాచారం. అయితే పలువురు అడ్రస్ లు తప్పుగా నమోదు కావడం, మరో వార్డుకు వెళ్లడంతో సదరు ఇంచార్జ్ లకు డబ్బుల పంపిణి విషయంలో తలనొప్పి గా మారిందనే ప్రచారం జోరుగా సాగింది. పలువురు పట్టభద్రులకు ఫోన్ ద్వారా పిలిచి డబ్బులు ఇచ్చారని, మరికొందరు తమ పేర్లు లిస్టులో లేదంటూ, ఆయా ఇంచార్జిలను కలవండంటూ చేతులు దులుపుకోవడం గమనార్హం. ఇక గ్రామాల్లో పట్టభద్రులకు రూ. వెయ్యి చొప్పున పంపిణి చేయగా, మరి కొంతమందికి రూ. 2 నుంచి రూ. 4 వేల వరకు పంపిణి చేసినట్లు జోరుగా ప్రచారాలు సాగాయి. డబ్బులు పంచుతున్నా రంటూ బీజేపీ నాయకుల ఆందోళన జూలపల్లి మండల కేంద్రంలో గురువారం జరగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు.
ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు గొట్టేముక్కల సురేష్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. స్థానిక పోలీసులు వారికి మద్దతుగా ఉన్నారంటూ ఏసీపీకి ఫోన్ లో ఫిర్యాదు చేశారు. పోలింగ్ చిట్టీలు పంచుతున్న నాయకుల జేబులు పరిశీలించండి అంటూ పోలీసులు మీద సురేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదయం 8 గంటలకు ప్రాంభమైన ఎమ్మెల్సీ ఎన్నికలు అధికారుల పర్యవేక్షణలో ప్రశాంతంగా జరిగాయి. రామ గుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు జిల్లాలో డిసిపీ చేతన ఆధ్వర్యంలో ఏసీపీ గజ్జి కృష్ణ పర్యవేక్షణలో భారీ బందోబస్త్ మధ్యన టీచర్లు, పట్టభద్రుల ఎన్నికల్లో ఓటర్లు ఓట్లు వేశారు. కాగా ఉదయం 10 గంటల వరకు గ్రాడ్యుయేట్స్ ఎన్నికల లో పురుషులు 1467 మంది, మహిళలు 621 మొత్తం 2088 మంది ఓటర్లు అనగా 6.73 శాతం, టీచర్స్ ఎన్నికలలో పురుషులు 100 మంది, మహిళలు 52 మొత్తం 152 మంది ఓటర్లు అనగా 13.68 శాతం పోలింగ్ జరిగింది. కాగా పోలింగ్ ముగిసే సమయానికి పట్టభద్రులు 68 శాతం వరకు తమ ఓటు హక్కును వినియో గించుకున్నారు. మొత్తంగా ఎన్నికలు సజావుగా జరగడం పట్ల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు….
Read : Graduate MLC : గ్రాడ్యేయేట్ ఎన్నికల ప్రచార జోరు
jfas