అంతుచిక్కని రోజా వ్యూహం….AP Ex Minister Roja | AP Political News

Roja

అంతుచిక్కని రోజా వ్యూహం….AP Ex Minister Roja

Roja

తిరుపతి, సెప్టెంబర్ 2, (న్యూస్ పల్స్)
మాజీ మంత్రి రోజా పొలిటికల్‌ ఫ్యూచర్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైసీపీతో కటీఫ్‌కు సిద్ధపడుతున్నారనే ప్రచారాన్ని తాజాగా ఖండించిన రోజా… ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా సస్పెన్స్‌ కంటిన్యూ చేస్తున్నారని అంటున్నారు. తన సోషల్ మీడియా అకౌంట్లలో వైసీపీ అధినేత జగన్‌ ఫొటోను… వైసీపీ పేరును రోజా తొలగించినట్లు ఇటీవల ప్రచారం జరిగింది.తమిళ రాజకీయాల్లోకి వెళ్లనున్నందునే ఆమె ఇలా జగన్‌ ఫొటోను తొలగించారని విమర్శలు వినిపించాయి. ఐతే తమిళ రాజకీయాల్లోకి వెళతానని తన ప్రత్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నారని చెబుతున్న రోజా…. తన సోషల్‌ మీడియా అకౌంట్ల నుంచి వైసీపీ, జగన్‌ ఫొటోను ఎందుకు తొలగించారో చెప్పకపోవడమే అనుమానాలను తావిస్తోందంటున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ మంత్రి రోజా దాదాపు రెండున్నర నెలలుగా సైలెంట్‌గానే ఉంటూ వస్తున్నారు. గుళ్లూ గోపురాల చుట్టూ తిరుగుతూ రాజకీయాలకు తనకు ఏం సంబంధం లేనట్లే వ్యవహరించారు. ఇదే సమయంలో తన సొంత నియోజకవర్గం నగరిలో పార్టీ నేతల నుంచి సహాయ నిరాకరణ ఎదుర్కొంటున్న రోజా…. పక్కనే ఉన్న తమిళనాడు రాజకీయాలపై ఫోకస్‌ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. రోజా తమిళ పాలిటిక్స్‌పై నెల రోజుల నుంచి ఉధృత ప్రచారం జరిగినా… ఆమె ఇన్నాళ్లు నోరు విప్పలేదు.

KCR and Kavitha | ప్రజల్లోకి కేసీఆర్, కవిత | Eeroju news

AP Ex Minister Roja
గత వారం చెన్నైలో తమిళ పత్రిక ఇంటర్య్వూ ఇచ్చిన రోజా…. తనకు విజయ్‌ పార్టీలోకి వెళ్లాలనే ఆలోచన లేదని చెప్పారు. అయితే రోజా రాజకీయ ప్రస్థానంపై తెలుగునాట ప్రచారం జరిగితే.. ఆమె తమిళ గడ్డపై ఇంటర్వ్యూ ఇవ్వడంపైనా అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. తమిళనాడులో తన కోసం చర్చ జరిగేలా ఆమె ఆ ఇంటర్వ్యూ ఇచ్చారా? అంటూ రోజా ప్రత్యర్థులు ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీంతో తాజాగా తిరుమల వచ్చిన రోజా పార్టీ మార్పుపై ఊహాగానాలను కొట్టిపడేశారు.మరోవైపు రోజా రాజకీయ ప్రత్యర్థులు మాత్రం… విమర్శల దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. తమిళనాడులో విజయ్‌ పార్టీ నుంచి ఆహ్వానం లేకపోవడం వల్లనే ఆమె ఇప్పుడు యూటర్న్‌ తీసుకున్నారని మరో ప్రచారం తెరపైకి తెచ్చారు. నేను ఎక్కడికీ వెళ్లను మొర్రో అంటూ రోజా మొత్తుకున్న ఆమె ప్రత్యర్థుల విమర్శల వ్యూహం నుంచి తప్పించుకోలేకపోతున్నారు. రోజా ఏం చేసినా, అందులో రంధ్రాన్వేషణ చేస్తూ రాజకీయంగా ఆమెను ఇరుకున పెడుతున్నట్లు చెబుతున్నారు.అధికార పార్టీకి టార్గెట్‌గా మారిన రోజా కొన్నాళ్లుగా ఏపీ రాజకీయ అంశాలకు దూరంగా ఉన్నారు. అటు తమిళనాడులో అవకాశం లేదని తేలిపోవడంతోనే ఇప్పుడు ఏపీకి వచ్చి మళ్లీ తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. ఇప్పటికే నగరిలో రోజా ఆస్తులను విక్రయించేస్తున్నారని.. ఆమెను నగరి వైసీపీ ఇన్‌చార్జిగా తప్పించవచ్చనే ఊహాగానాల నడుమ మళ్లీ పార్టీకి దగ్గరయ్యేందుకు ప్రభుత్వంపై విమర్శలకు దిగారని అంటున్నారు. మొత్తానికి 80 రోజుల తర్వాత రోజా మౌనవ్రతాన్ని వీడినా… ప్రత్యర్థుల విమర్శల దాడి తగ్గకపోవడమే హాట్‌టాపిక్‌గా మారింది.

Jagananna Colonies | అమ్మో… జగనన్న కాలనీలు… | Eeroju news

Related posts

Leave a Comment