సంక్షిప్త వార్తలు: 04-12-2025:వనజీవి రామయ్య మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేసారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఆరు దశాబ్దాలుగా అలుపెరుగని కృషి చేసి, సుమారు కోటి మొక్కలు నాటిన పద్మశ్రీ ‘వనజీవి’ రామయ్య కన్నుమూశారని తెలిసి చింతించాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వృక్షో రక్షతి రక్షితః అనే పెద్దల మాటలోని వాస్తవాన్ని ప్రజలకు తెలియచేసేందుకు రామయ్య పడ్డ తపన సమాజానికి ఎంతో మేలు చేస్తోంది.
పద్మశ్రీ వనజీవి రామయ్య కన్ను మూత
పద్మశ్రీ వనజీవి రామయ్య కన్ను మూత:పద్మశ్రీ అవార్డు గ్రహీత వృక్ష ప్రేమికుడు దరిపెల్లి. రామయ్య (వనజీవి రామయ్య) కన్నుమూశారు.అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కోటి మొక్కలు నాటి ప్రకృతి ప్రేమికుడిగా పేరు గాంచిన ఆయనను *2017లో కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది. రామయ్య స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి.
వనజీవి’ రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తాం : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
వనజీవి రామయ్య మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేసారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఆరు దశాబ్దాలుగా అలుపెరుగని కృషి చేసి, సుమారు కోటి మొక్కలు నాటిన పద్మశ్రీ ‘వనజీవి’ రామయ్య కన్నుమూశారని తెలిసి చింతించాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వృక్షో రక్షతి రక్షితః అనే పెద్దల మాటలోని వాస్తవాన్ని ప్రజలకు తెలియచేసేందుకు రామయ్య పడ్డ తపన సమాజానికి ఎంతో మేలు చేస్తోంది. తొలకరి చినుకులుపడగానే మొక్కలు నాటుతూ, విత్తనాలు జల్లుతూ పచ్చదనం పెంచడానికి రామయ్య, ఆయన సతీమణి చేసిన వన యజ్ఞం ఎన్నో తరాలకు స్వచ్చమైన పర్యావరణాన్ని అందిస్తుంది.
రామయ్య కి ఓ సందర్భంలో ప్రమాదం చోటు చేసుకొంటే ఆసుపత్రిలో ఉండగా పరామర్శించాను. అప్పుడు కూడా పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడారు. రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ, పచ్చదనం పెంపునకు కృషి చేయడంతోపాటు… పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తాము. ‘వనజీవి’ రామయ్య కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని అన్నారు.
రామయ్య మరణం తీరని లోటు:
హైదరాబాద్
వనజీవి రామయ్య మృతిపట్ల సీఎం రేవంత్ సంతాపం వ్యక్తం చేసారు. వనజీవి రామయ్య మరణం సమాజానికి తీరని లోటు. పర్యావరణం లేనిదే మానవ మనుగడ సాధ్యం కాదు. పర్యావరణ పరిరక్షణలో అయన సమాజాన్ని ప్రభావితం చేశారు. దరిపల్లి రామయ్య వనజీవి రామయ్యగా మారారని అన్నారు.